E-Paper
Advertisement

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!
Advertisement

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన నటిస్తున్న సినిమాలు ఏడాదికి ఒకటి చొప్పున ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇలా కొత్త సినిమాలను విడుదల చేస్తూనే అభిమానుల కోసం ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలు మరోసారి థియేటర్లలో విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకున్నాయి.

మళ్లీ థియేటర్లలోకి వర్షం..

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మరో సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ప్రభాస్ త్రిష హీరో హీరోయిన్లుగా శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వర్షం(Varsham). ఎమ్మెస్ రాజు నిర్మాణంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 2004 జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇదివరకే తిరిగి థియేటర్లలో రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది.

ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్..

Advertisement

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వర్షం సినిమాని అక్టోబర్ 23వ తేదీ తిరిగి విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఇప్పటికే రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈసారి ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా త్రిష అద్భుతమైన నటనను కనపరిచారు. ఇక విలన్ పాత్రలో గోపీచంద్ నటన సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

విడుదలకు సిద్ధమైన ఫౌజీ…

ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్(Spirit) సినిమాతో పాటు హనురాగవపూడి దర్శకత్వంలో ఫౌజీ (Fauzi)అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు నెలలోనే విడుదలవుతుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి కానీ చిత్ర నిర్మాతలు మాత్రం ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ మూడో తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్టు తెలియచేశారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 చేయబోతున్నారు అదేవిధంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 సినిమా పనులలో కూడా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కల్కి 2 కూడా షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: ఓటీటీలోకి వచ్చేస్తున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Related News

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

కాంతార వైబ్‌లో గోపీచంద్ ‘భరత వర్ష’.. ఫస్ట్ సాంగ్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×