E-Paper
Advertisement

ధోని గురించి కావాల‌నే డ‌బ్బా కొడుతున్నారు..భ‌జ్జీ, అశ్విన్ మ‌ధ్య మాటల యుద్ధం !

ధోని గురించి కావాల‌నే డ‌బ్బా కొడుతున్నారు..భ‌జ్జీ, అశ్విన్ మ‌ధ్య మాటల యుద్ధం !
Advertisement

Harbhajan Singh On Ms Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని… జట్టుకు ఎన్నో విజయాలను అందించి చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ కెప్టెన్ అందుకొని రికార్డులను, ధోని చేరుకున్నాడు. తన కెప్టెన్సీ లోనే టీమ్ ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు రావడం జరిగింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున కూడా కెప్టెన్ గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోని ఏకంగా ఐదు ట్రోఫీలు ఆ జట్టుకు అందించారు. అలాంటి మహేంద్ర సింగ్ ధోని గురించి తాజాగా హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

ధోని గురించి కావాల‌నే డ‌బ్బా కొడుతున్నారు..భ‌జ్జీ, అశ్విన్ మ‌ధ్య మాటల యుద్ధం !

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతాయి. ఇందులో పాజిటివ్ యాంగిల్ తో పాటు నెగిటివ్ కోణం కూడా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్భజన్ సింగ్, అశ్విన్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఇందులో రవిచంద్రన్ అశ్విన్ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, అశ్విన్ లను క్రికెట్ అభిమానులను నిత్యం విమర్శిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. కానీ మహేంద్రసింగ్ ధోని గురించి ప్రతి ఒక్కరు పొగుడుతారని ఆయన వెల్లడించారు. అయితే దీనికి వెంటనే రవి చంద్రన్ అశ్విన్ కౌంటర్ ఇచ్చారు. ధోని గురించి డబ్బా కొట్టమని ఎవరైనా మీకు డబ్బులు ఇస్తారా ? అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

ధోని గురించి పొగడమని డబ్బులు ఇస్తారా ?

మహేంద్ర సింగ్ ధోనీ గురించి నిత్యం పొగడాలని డబ్బులు ఇస్తారా ? అని అశ్విన్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు హర్భజన్ సింగ్. కామెంట్రీ చేసే వాళ్లకు ఇలా డబ్బులు ఎవరు ఇవ్వరని క్లారిటీ ఇచ్చారు. మనకు నచ్చిన విషయాన్ని కామెంట్రీ బాక్సులో కూర్చుని చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. అంతేకానీ మహేంద్రసింగ్ ధోనీని పొగడమని ఎవరు జేబులో నుంచి డబ్బులు ఇవ్వబోరని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

విరాట్ కోహ్లీ, అశ్విన్ ఇలా ఎంతోమంది టీం ఇండియా క్రికెటర్లు సరిగ్గా ఆడక పోతే.. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు వెంటనే సీరియస్ అవుతారని పేర్కొన్నారు. కానీ మహేంద్రసింగ్ ధోని అభిమానులు మాత్రం చాలా గొప్ప వాళ్ళున్నారు. అతడు విఫలమైన కూడా మెచ్చుకుంటూనే ఉంటారని.. అతనికి ఆదరణ ఏ మాత్రం తగ్గబోదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు హర్భజన్ సింగ్. ప్రపంచంలోనే అత్యంత గొప్ప క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని మాత్రమేనని తెలిపారు. అలాంటోడు టీమిండియా కు కెప్టెన్ గా వ్యవహరించడం అదృష్టమేనని తెలిపారు.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

Related News

మహేంద్ర సింగ్ ధోని కావాలనే ర‌నౌట్ అయ్యాడు..కోహ్లీకి పేరు రావొద్దని !

ధోని చుట్టు అన్ని రాజ‌కీయాలే…అత‌డు రిటైర్మెంట్ ఇస్తే కోట్ల‌ల్లో న‌ష్టం ?

సచిన్ దెబ్బకు మూడు రోజులు కోమాలోకి వెళ్లిన పాకిస్తాన్ క్రికెటర్

విరాట్ కోహ్లీ పరువు తీసిన అంబటి రాయుడు… ధోని, రోహిత్ వల్లే ఐసీసీ ట్రోఫీలు సాధ్యం?

నా దృష్టిలో RCB చాలా చెత్త టీమ్…వాళ్లు ఉగాండా కంటే దారుణం

పాకిస్తాన్ ను దెబ్బ‌కొట్టేందుకు నన్ను ధోని పావులా వాడుకున్నాడు

టీమిండియాకు అవ‌మానం..టెంట్లు వేసి డ్రెస్సింగ్ రూమ్స్‌, కంపుకొట్టే టాయిలెట్స్‌

Big Stories

Advertisement
×