E-Paper
Advertisement

టాటా పంచ్ EV ఒరిజినల్ రేంజ్ ఎంత? రియల్ టెస్ట్‌ లో షాకింగ్ రిజల్ట్!

టాటా పంచ్ EV ఒరిజినల్ రేంజ్ ఎంత? రియల్ టెస్ట్‌ లో షాకింగ్ రిజల్ట్!
Advertisement

2026 Tata Punch EV Range Test: 2026 టాటా పంచ్ EVలో కంపెనీ కొన్ని కీలక మార్పులు చేసింది. కొత్త స్టైలింగ్‌ తో పాటు పవర్‌ ట్రెయిన్‌లోనూ మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడంతో రేంజ్‌ పై ఆసక్తి మరింత పెరిగింది. అంతేకాదు, కొత్త పంచ్ EV ప్రారంభ ధర గత మోడల్‌తో పోలిస్తే రూ.1.65 లక్షలు తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ.9.70 లక్షల నుంచి రూ.12.80 లక్షల వరకు ఉంది. అయితే, తాజాగా నిర్వహించిన రేంజ్ టెస్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అవేంటంటే..

రెండు బ్యాటరీ ఆప్షన్లు

2026 టాటా పంచ్ EV ఇప్పుడు 30kWh, 40kWh బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. గత మోడల్‌ లో ఉన్న 25kWh, 35kWh బ్యాటరీలకు ఇవి కాస్త అప్ గ్రేడ్ అయ్యాయి. తాజాగా 40kWh బ్యాటరీతో ఉన్న వెర్షన్‌ను రియల్ వరల్డ్ రేంజ్ టెస్ట్‌ చేశారు. ఇందులో PMSM ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 129hp పవర్, 154Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఈకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లను అందిస్తుంది.

రేంజ్ ఎంత ఇచ్చిందంటే?  

Advertisement

రియల్ వరల్డ్ టెస్ట్‌ లో పంచ్ EV నగర రోడ్లపై మంచి సామర్థ్యాన్ని చూపించింది. నగరంలో 7.92km/kWh సామర్థ్యం నమోదైంది. దీని ప్రకారం పూర్తి ఛార్జ్‌ పై సుమారు 317 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. హైవేపై పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. అక్కడ సామర్థ్యం 7.29km/kWhకు తగ్గింది. దీంతో సుమారు 291 కిలోమీటర్ల రేంజ్ లభించింది. నగరం, హైవే రెండింటినీ కలిపి చూసినప్పుడు 7.61km/kWh సగటు సామర్థ్యం నమోదైంది. అంటే, సాధారణ వినియోగంలో 40kWh పంచ్ EV నుంచి సుమారు 304 కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్ అందిస్తుంది.

ఫాస్ట్ ఛార్జింగ్‌లోనూ మార్పులు

పంచ్ EV DC ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కూడా టాటా పెంచింది. గత మోడల్‌లో ఇది 50kWగా ఉండగా, కొత్త మోడల్‌లో 65kWకు పెరిగింది. టెస్ట్ సమయంలో 180kW DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించారు. ఈ సమయంలో గరిష్టంగా సుమారు 67.3kW ఛార్జింగ్ వేగం నమోదైంది. అయితే బ్యాటరీ 50 శాతం దాటిన తర్వాత ఛార్జింగ్ స్పీడ్ క్రమంగా తగ్గింది. 90 శాతం దాటిన తర్వాత ఈ వేగం మరింత తగ్గింది.  20 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ కావడానికి సుమారు 27 నిమిషాలు పట్టింది. 100 శాతానికి చేరుకోవడానికి మరో 31 నిమిషాలు అవసరమైంది. ఈ పరీక్షలో వచ్చిన 304 కిలోమీటర్ల రేంజ్ ల్యాబ్‌ లో లభించే లెక్కల ప్రకారం కాకుండా, రోజువారీ వినియోగంలో పంచ్ EV నుంచి  పొందే రేంజ్‌కు దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు.

Advertisement

Read Also: మహీంద్రా EVలపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.8 లక్షల తగ్గింపు!

Tags

Related News

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

Big Stories

Advertisement
×