Pahalgam: పహల్గామ్ కాశ్మీర్‌లోని చాలా అందమైన పర్యాటక కేంద్రం. ఇది ప్రశాంతమైన లోయలు, పచ్చదనం, మంచుతో కప్పబడిన పర్వతాలకు ప్రసిద్ధి చెందింది. దీనిని ‘మినీ స్విట్జర్లాండ్’ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వస్తారు.
మినీ స్విట్జర్లాండ్:
పహల్గామ్ జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఒక అదంమైన హిల్ స్టేషన్. ఇది శ్రీనగర్ విమానాశ్రయం నుండి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పహల్గాంను ‘గొర్రెల కాపరుల లోయ’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రవహించే లిడ్డర్ నది, దట్టమైన అడవులు, పవిత్ర అమర్‌నాథ్ గుహ వంటి ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
పహల్గాం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్, ‘మినీ స్విట్జర్లాండ్’ గా పిలువబడే ప్రశాంతమైన, అందమైన ప్రదేశం. పైన్ చెట్లు, దట్టమైన పచ్చని పొలాలు, మంచు పర్వతాలు దీనికి మరింత ప్రత్యేకతను అందిస్తాయి. ఇక్కడి నుండి తులియన్ సరస్సు వరకు ట్రెక్కింగ్ , క్యాంపింగ్ కూడా చేయవచ్చు. బైసారన్ లోని పచ్చదనం, మంచుతో కప్పబడిన పర్వతాలు, స్పష్టమైన నదులు స్విట్జర్లాండ్‌ను గుర్తుకు తెస్తాయి. సమ్మర్‌లోనూ ఈ ప్రాంతం పచ్చని పొలాలతో అందంగా ఉంటుంది. శీతాకాలంలో మంచు దుప్పటితో కప్పబడి ఉంటుంది. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ ప్రియులకు చాలా బాగా నచ్చుతుంది.
బైసరన్ లోయ పహల్గాం:
స్విట్జర్లాండ్ లాగే.. పహల్గాం వాతావరణం కూడా ఏడాది పొడవునా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. చలికాలంలో ఎక్కువగా మంచు కురుస్తుంది. ఇది ఈ ప్రదేశాన్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. అందుకే పర్యాటకులు ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఇక్కడికి వస్తారు.
సాహస ప్రియులకు స్వర్గధామం:
సాహస ప్రియులకు.. పహల్గామ్‌లో ట్రెక్కింగ్, గుర్రపు స్వారీ, రివర్ రాఫ్టింగ్ , స్కీయింగ్ వంటి అనేక కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి. శీతాకాలంలో.. ఈ ప్రదేశం స్కీయింగ్ ప్రియులకు స్వర్గధామం అని చెప్పొచ్చు.
ప్రశాంతమైన వాతావరణం:
నగర హడావిడికి దూరంగా ప్రశాంతతను కోరుకునే వారికి.. పహల్గామ్ చాలా నచ్చుతుంది. ఇక్కడి తాజా గాలి, నిశ్శబ్ద లోయలు మీకు ప్రశాంతతను ఇస్తాయి. ఇది స్విట్జర్లాండ్ లాగా అనిపిస్తుంది.
గత 5 సంవత్సరాలలో సందర్శించిన పర్యాటకుల సంఖ్య:
సంవత్సరం పర్యాటకుల సంఖ్య
2020 34,76,153
2021 1,13,16,484
2022 1,88,84,317
2023 2,07,34,673
2024 334,98,000
Also Read: ట్రైన్ జర్నీ చేస్తున్నారా ? ఈ ఫ్రీ బెనిఫిట్స్ గురించి తప్పకుండా తెలుసుకోండి !
పహల్గామ్ లోని ప్రధాన ఆకర్షణలు:
బైసరన్ ఘాట్ : ప్రశాంతమైన, అందమైన ప్రదేశం. దీనిని ‘మినీ స్విట్జర్లాండ్’ అని పిలుస్తారు.
ఆరు లోయ: పచ్చని పొలాలు, పర్వతాలు , సరస్సులతో ఉన్న ఈ ప్రదేశం చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది.
బేతాబ్ లోయ : సినిమా షూటింగ్‌లకు ప్రసిద్ధి. అందమైన జలపాతాలకు ప్రసిద్ధి.
చందన్వాడి: అమర్నాథ్ యాత్ర ప్రారంభ స్థలం. యాత్రికులు అమర్నాథ్ గుహకు ట్రెక్కింగ్ ప్రారంభించే ప్రదేశం.
తార్సర్ సరస్సు : ఈ ప్రదేశం పహల్గాం సమీపంలో కూడా ఉంటుంది.
బేతాబ్ లోయ : సినిమా షూటింగ్ కు ప్రసిద్ధి చెందిన బేతాబ్ లోయలో అందమైన పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు , మంచుతో కప్పబడిన పర్వతాలకు ప్రసిద్ధి చెందింది.