Indian Railways: ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వేలు అనేక నియమాలను రూపొందించాయి. ప్రయాణీకుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడమే ఈ నియమాల ఉద్దేశ్యం. రైలు చాలా సౌకర్యవంతమైన ప్రయాణ విధానం అని చెప్పొచ్చు. అందుకే చాలా మంది రైళ్లలో ప్రయాణిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భారతీయ రైల్వేలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
నేడు.. మన దేశం ఆధునికత వైపు వేగంగా పయనిస్తోంది. దేశ రైల్వే వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా, ఆధునికంగా మార్చడానికి భారతీయ రైల్వేలు దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైళ్లు మొదలైన అనేక ప్రాజెక్టులపై కూడా పనిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ రైళ్లలో ప్రయాణించాలంటే మీకు తప్పకుండా టికెట్ ఉండాలి. మీరు టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తూ పట్టుబడితే, జరిమానా విధిస్తారు.
ఇదిలా ఉంటే.. మీరు రైలులో ప్రయాణించడానికి బుక్ చేసుకునే టికెట్‌లోనే మీకు అనేక సౌకర్యాలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. దీని కోసం మీరు ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.
వెయిటింగ్ హాల్ :
మీరు వెళ్లాల్సిన ట్రైన్ ఏదైనా కారణం వల్ల ఆలస్యమైతే.. మీరు స్టేషన్‌లోని వెయిటింగ్ రూమ్‌లో ఉండొచ్చు.
దీని కోసం మీ నుండి ఎలాంటి డబ్బులు చార్జ్ చేయరు.
ఉచిత చికిత్స:
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీ ఆరోగ్యం క్షీణించినట్లయితే.. ఈ పరిస్థితిలో మీరు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా వైద్య సహాయం పొందవచ్చు. దీనికి మీపై ఎటువంటి ఛార్జీలు విధించరు.
వైఫై:
మీరు రైలులో ప్రయాణిస్తూ స్టేషన్‌కు సమయానికి చేరుకుంటే అక్కడ ఉచిత వైఫై సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.
దేశంలోని ప్రధాన స్టేషన్లలో మాత్రమే మీకు వైఫై సౌకర్యం లభిస్తుంది.
Also Read: ఉగ్ర దాడి ప్రభావం.. వెల వెల బోతున్న టూరిస్ట్ స్పాట్‌లు
ఏసీ కోచ్‌లలో బెడ్ షీట్లు, దిండ్లు, దుప్పట్ల సౌకర్యం:
మీ టికెట్ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ లేదా థర్డ్ ఏసీలో ఉంటే.. రైలులో మీరు కప్పుకోవడానికి, పరుచుకోవడానికి పరుపులు , దుప్పట్లు ఉంటాయి. ఇదే కాకుండా.. మీ తల కింద ఉంచుకోవడానికి ఒక దిండు కూడా ఇస్తారు. అయితే.. మీరు రైలులో ప్రయాణించిన తర్వాత వీటిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.