BigTV English

India vs Pakistan: యుద్ధానికి ముహూర్తం ఫిక్స్‌..? ఆ రోజే తొలి దాడి

India vs Pakistan: యుద్ధానికి ముహూర్తం ఫిక్స్‌..? ఆ రోజే తొలి దాడి

India vs Pakistan: మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్లు ఉంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. లోపల భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా.. బయటికి మాత్రం భీకరంగా ఉన్నట్లు నటిస్తుంది. భారత్‌ దాడి చేస్తే తిప్పికొడతామని, మా దగ్గర సైన్యం ఉంది.. న్యూక్లియర్ బాంబులున్నాయంటూ ప్రగల్భాలు పలుకుతోంది. త్వరలో భారత్‌ ప్రతీకార చర్యగా పాకిస్తాన్‌పై దాడి చేస్తుందని వార్తలు వస్తున్న క్రమంలో రష్యాలోని పాక్ దౌత్యవేత్త ముహమ్మద్ ఖలీద్ జమాలీ ఓ ప్రకటన చేశారు. భారత్ తమపై దాడి చేసేలా ఉందని, దానికి సంబంధించిన ప్లాన్ అంతా లీక్ అయినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.


భారత దాడిని పాక్ తిప్పి కొడుతుందన్న..

భారత్‌ దాడిని పాక్ తిప్పికొడుతుందని, అణువాయుధాలతో దాడి చేస్తుందని చెప్పుకొచ్చాడు ఖలీద్. పాక్‌ చేతికి కొన్ని డాక్యుమెంట్స్ చిక్కాయని.. వాటిని బట్టి చూస్తే భారత్ తమ దేశంలోని కొన్ని చోట్ల దాడులు చేయాలనుకుంటుందని ఆరోపించారు. భారత్ ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుదా అని పాక్ బిక్కు బిక్కుమంటూ బతుకుతుంది. భారత ఆర్మీ సైనిక చర్యలకు భయంతో వణికిపోతుంది. ఈక్రమంలోనే మే 9లోపు భారత్ సైనిక చర్య ఉంటుందని ఓ వార్త వచ్చింది. ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటన రద్దు చేసుకున్న క్రమంలో.. భారత్ ఏదో పెద్దదే ప్లాన్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


మే 9 లోపే సైనిక చర్య ఉంటుందంటున్న నిపుణులు

మే 9న రష్యాలో జరిగే విక్టరీ పరేడ్‌కు మోడీ, రాజ్‌నాథ్ సింగ్ వెళ్లాల్సి ఉంది. అయితే ఉన్నపళంగా పర్యటనను రద్దు చేసుకుని.. రక్షణ సహాయ మంత్రి సంజయ్‌ని రష్యాకు పంపిస్తున్నారు. దీంతో భారత్ ఏం ప్లాన్ చేస్తుందని ఇటు పాక్‌తో పాటు.. అటు ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో అమెరికా భారత్‌లు పలు సూచనలు చేసింది. సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని తెలిపింది. అమెరికా విన్నపంపై స్పందించిన భారత్.. ఉగ్రవాదంపై పోరు ఆపేది లేదని తేల్చిచెప్పింది.

రంగంలోకి దిగిన పీఓకేలో రిజర్వ్ బలగాలు

పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్ దాడి చేస్తుందని పాక్ భావిస్తుంది. ఆ భయంతో అక్కడి పౌరులకు పాక్ సైనిక శిక్షణ ఇస్తుంది. పీఓకేలో రిజర్వ్ బలగాలను రంగంలోకి దింపింది. బంకర్లు శుభ్రం చేస్తుంది. ఏ క్షణమైనా భారత్ దాడి చేస్తుందని, స్థానికులు రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు, మందులు సిద్ధం చేసుకోసుకోవాలని సూచించింది.

భారత్, పాక్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు

పాక్‌.. బోర్డర్‌లో కయ్యానికి కాలు దువ్వడం మాత్రం ఆపడం లేదు. భారత్, పాక్ సరిహద్దుల్లో రోజు రోజుకు ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. వరుసగా పదోరోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఎల్‌వోసీ ప్రాంతాల్లో భారత సైనిక పోస్టులే టార్గెట్‌గా పాక్ సైన్యం కాల్పులకు దిగుతోంది. అయితే పాక్‌ కాల్పులను భారత సైన్యం తప్పికొట్టింది.

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీతో పాకిస్తాన్ అంతర్యుద్ధం

ఇదిలా ఉంటే.. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీతో.. పాకిస్తాన్ అంతర్యుద్ధం ఎదుర్కుంటోంది. బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని తిరుగుబాటు చేస్తున్నారు. పాక్ సైనికులను హతమార్చుతూ.. ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో నెమ్మది నెమ్మదిగా బలూచిస్థాన్‌పై పాక్ నియంత్రణ కోల్పోతుంది. అటు తమ ప్రాంతం వీడి వెళ్లాలని.. పాక్, చైనా సైన్యానికి బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ హెచ్చిరికలు జారీ చేసింది.

బలూచిస్థాన్ ఆర్మీపై నియంత్రణ కోల్పోతున్న పాక్ ప్రభుత్వం

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఏమాత్రం తగ్గడం లేదు. పాక్‌ దళాలపై పట్టు సాధిస్తుంది. క్వెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకునే దిశగా దాడులు చేస్తుంది. ఇప్పటికే మంగోచార్ పట్టణంలోని అనేక భవనాలను బలూచ్ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది సైనికులు, అధికారులను కూడా బంధించారు.

Also Read: పహల్గాం దాడి ప్లాన్ లష్కరే పనే.. NIA రిపోర్ట్ లో సంచలన నిజాలు

క్వెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకునే దిశగా దాడులు

పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుల్లో పెరుగుతున్న సంక్షోభం ఇస్లామాబాద్‌ అంతర్గత భద్రతకు సవాలుగా మారింది. భారత్‌-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఎదురవుతున్న క్రమంలో.. ప్రాంతీయ స్థిరత్వంపై కొత్త ఆందోళనలు లేవనెత్తుతున్నాయి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×