E-Paper
Advertisement

ఇదెక్కడి క్రేజ్ రా మావా.. బుల్లెట్ బండి లక్ష్మణ్ మరోసారి అదరగొట్టేశాడుగా!

ఇదెక్కడి క్రేజ్ రా మావా.. బుల్లెట్ బండి లక్ష్మణ్ మరోసారి అదరగొట్టేశాడుగా!
Advertisement

Aalu Magalu:”బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు” అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసిన బులెట్ బండి లక్ష్మణ్ మరోసారి ఆలు మగలు అంటూ ఎమోషనల్ సాంగ్ తో ఆడియన్స్ ని ఫిదా చేస్తున్నాడు.ఎప్పుడూ జోష్ గా ఉండేపాటలే కాదు ..ఇలా భార్యా భర్తల మధ్య ఉండే ప్రేమానుబందాలని, కష్ట సుఖాలని కూడా తన పదాలలో బందిస్తానంటూ ప్రూవ్ చేసుకున్నాడు.ఇక బులెట్ బండి లక్ష్మణ్ ఈ పాటని రాయడమే కాకుండా దీనిని దర్శకత్వం వహించడం ఇక్కడ విశేషం.

దాదాపు 65 మిలియన్ల వ్యూస్

Advertisement

ఇకపోతే వర్కల శ్రీకాంత్ గౌడ్ నిర్మించిన ఈ ఎమోషనల్ సాంగ్ ని ఎప్పటిలాగే తనదైన మ్యూజిక్ తో మరో లెవెల్ లో పెట్టేశాడు మదీన్ sk. ముఖ్యంగా శ్రీనిధి, సుమన్ లు ఈ పాటకి తమ గొంతుతో ప్రాణం పోశారనే చెప్పాలి.ఇక పోయినేడాది డిసెంబర్ 26న వచ్చిన ఈ పాట ఇప్పటి వరకు దాదాపు 65 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుందంటే పాట ఆడియన్స్ ని ఎంతలా అలరిస్తుందో అర్థమవుతుంది.ఇక లక్కీ చరణ్ , సునీత మరాసియార్ నటించిన తీరుకి ముగ్దులైపోతున్నారంతా.

‘నా ఒళ్ళు నీ ఒళ్ళు ఏమున్నది అన్ని కాగితాల బంధాలే’

Advertisement

అయితే చాలా వరకు పాటలు అయితే సరదా,లేదంటే ప్రేమ ,కాదంటే రొమాన్స్ అన్నట్టుగా ఉంటాయి.కానీ ఈ పాటలో భార్యా భర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలి, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఇద్దరు ఎలా ఒకరికొకరు తోడుగా ఉండాలి అన్న నేపథ్యం లో బులెట్ బండి లక్ష్మణ్ రాసిన తీరు ఎందరినో ఆకట్టుకుంటుంది.ముఖ్యంగా ‘నా ఒళ్ళు నీ ఒళ్ళు ఏమున్నది అన్ని కాగితాల బంధాలే’ అవి అంటూ పాటలో వచ్చిన పదాలు అభిమానుల మనసుల్ని కట్టి పడేస్తున్నాయి.

మనిషికి మనిషే శాశ్వతమని, డబ్బులు ,ఆస్తులు ,కష్టాలు ఏవీ శాశ్వతం కాదని లక్ష్మణ్ రాసిన పదాలు ఎందరినో ఆలోచింపజేస్తున్నాయి.ముఖ్యంగా భార్యా భర్తలు ఒకరికొకరు చివరికంటా అర్థం చేసుకుని జీవితాన్ని గడపాలన్న సందేశం ఈ పాటలో బలంగా వినిపిస్తుంది.

వచ్చే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు స్ప్రుష్టిస్తాడో !

మొత్తంగా చాలా పాటలకి భిన్నంగా వచ్చిన ఈ పాట ముందు ముందు మరింత ఆదరణ పొందుతున్నదని పాటకి వస్తున్న స్పందన చూస్తుంటే అర్థం అవుతుంది.ఇక బుల్లెట్టు బండి లక్ష్మణ్ పాటల విషయానికి వస్తే ..బుల్లెట్టు బండితో పాటు, వింటున్నా ఓ పిల్ల , అత్తగారింటికి, లగారే సౌండ్ సాలా, భాయ్ బోల్తే, బాగుండాలమ్మా, అల్లరే అల్లా అంటూ ఎన్నో పాటలని రాసి ఫోక్ ఇండస్ట్రీ ని షేక్ చేశాడనే చెప్పాలి.చూడాలి మరి వరుస మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతున్న బుల్లెట్టు బండి లక్ష్మణ్ వచ్చే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు స్ప్రుష్టిస్తాడో !

Tags

Related News

డైరెక్టర్ సుజిత్ తో గొడవలు.. జగపతిబాబు షోలో బయటపెట్టిన శేష్..

చిన్న వయసులోనే వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న బుల్లితెర సెలబ్రిటీ కిడ్స్!

హౌస్ లో సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన పవన్ – రీతూ చౌదరి!

Podarillu Today Episode : కన్నీళ్లు పెట్టుకున్న మహాలక్ష్మీ.. ఇది కదా ఫైనల్ ట్విస్ట్.. చక్రీ పంట పండిందిరో..

Brahmamudi Serial Today Episode November 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసుకు వెళ్లి మరీ ఇందుకు నిజం చెప్పిన రఘువీర్ 

Intinti Ramayanam Today Episode: కమల్ కు నిజం చెప్పిన అవని.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. రమ్య ఎంట్రీతో కమల్ హ్యాపీ..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను వాయించిన బాలు.. పాపం మీనా.. సుమతి చనిపోతుందా..?

Big Stories

Advertisement
×