E-Paper
Advertisement

హౌస్ లో సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన పవన్ – రీతూ చౌదరి!

హౌస్ లో సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన పవన్ – రీతూ చౌదరి!
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి కామనర్ కేటగిరీలో అడుగుపెట్టిన డెమోన్ పవన్ (Demon Pawan), అటు సెలబ్రిటీ కేటగిరీలో అడుగుపెట్టిన రీతూ చౌదరి (Rithu Chowdary) ఇద్దరు కూడా తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా హౌస్ లో కంటెంట్ కోసం లవ్ ట్రాక్ నడిపిన విషయం తెలిసిందే. ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా పలు ఈవెంట్లలో సందడి చేసిన వీరు.. “బంగారం” అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కూడా చేశారు. అలా ఈ సాంగ్ తర్వాత వీరిద్దరి జోడి కి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. పైగా వీరి జోడి పై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ కూడా క్రియేట్ అయ్యాయి.

బ్రేకప్ అన్నారు.. హౌస్ లో జంటగా కనిపించిన పవన్, రీతూ..

అయితే ఇద్దరం స్నేహితులమని చెప్పుకున్నా సరే.. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే సడన్ గా ఏమైందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇద్దరు ఒకరికొకరు అన్ ఫాలో కొట్టుకున్నారు. పైగా బ్లాక్ లిస్ట్ లో చేర్చుకున్నారు. ఇకపై కలసి కనిపించమని , ఎవరి దారి వారిదే అని, ఎవరు ఎవరిని వాడుకోదల్చుకోలేదు.. అంటూ పెద్ద ఎత్తున పోస్ట్లు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు..

వర్షిని పై పొగడ్తల వర్షం..

Advertisement

దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. అయితే సడన్గా వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో కనిపించే సరికి అదంతా నాటకమేనా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ వీళ్ళిద్దరూ కలిసిపోయారా? అంటూ కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. బిగ్ బాస్ సీజన్ 10లో 12వ వారం కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ ఇద్దరేసి చొప్పున హౌస్ లోకి వస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే డెమోన్ పవన్, రీతూ చౌదరి జంటగా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈ మేరకు తాజాగా 80వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మొదటి ప్రోమోలో వీరిద్దరూ కనిపించి సర్ప్రైజ్ చేశారు.

also read:సొగసుల సుందరి కాజల్.. 40ల్లో కూడా హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తూ!

నన్ను బ్రతకనివ్వు అన్న నరేష్..

Advertisement

హౌస్ లోకి రాగానే హాయ్ ముఖేష్ అంటూ ముఖేష్ దగ్గరకు వెళ్ళింది రీతూ చౌదరి. ముఖేష్ ఆమె అమాంతం ఎత్తుకొని తిప్పేశారు . ఆ తర్వాత డెమోన్ పవన్ వర్షిణిని ఎత్తుకొని గిరిగిరా తిప్పేసారు. ఇక నరేష్ ను చూడగానే పవన్ ఎత్తుకొని.. నరేష్ అన్న నువ్వు గనుక మా సీజన్ లో ఉండి ఉంటే కనుక అంటూ నరేష్ ని కూడా తిప్పేశారు. ఇక నరేష్ మాట్లాడుతూ..” నన్ను బ్రతకనివ్వు.. ఇంకా నాలుగు వారాలు నేను హౌస్ లో ఉండాలి” అంటూ కామెంట్ చేశారు..

నవరసాలు పండిస్తారు అనుకున్నాను – పవన్

పవన్ రామకృష్ణ గురించి మాట్లాడుతూ.. ఈయన గురించి ఎన్ని పెట్టుకున్నానో.. నవరసాలు అనగానే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎలా నవ్విస్తారో అనుకున్నాను. కానీ ఒకటి కూడా కనిపించలేదు అంటూ కౌంటర్ ఇచ్చాడు. తర్వాత పవన్ వర్షిని తో మాట్లాడుతూ బయట అందరి దృష్టి మీ పైనే ఉంది అంటూ ఆమె గ్లామర్ ను తెగ పొగిడేసారు. ఇక తర్వాత లెహరాయి పాటకు దేబ్జానీ – పవన్, ముఖేష్ -రీతూ చౌదరి, వర్షిని – అమన్ జంటలుగా డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. మొత్తానికైతే ఈ ప్రోమో కాస్త చాలా రొమాంటిక్గా సాగిందని చెప్పవచ్చు.

Related News

Podarillu Today Episode : కన్నీళ్లు పెట్టుకున్న మహాలక్ష్మీ.. ఇది కదా ఫైనల్ ట్విస్ట్.. చక్రీ పంట పండిందిరో..

Brahmamudi Serial Today Episode November 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసుకు వెళ్లి మరీ ఇందుకు నిజం చెప్పిన రఘువీర్ 

Intinti Ramayanam Today Episode: కమల్ కు నిజం చెప్పిన అవని.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. రమ్య ఎంట్రీతో కమల్ హ్యాపీ..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను వాయించిన బాలు.. పాపం మీనా.. సుమతి చనిపోతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: బిడ్డను వద్దనుకున్న చందు.. భాగ్యంకు స్ట్రాంగ్ వార్నింగ్.. అంజలితో చందు..

Nindu Noorella Saavasam Serial Today Episode November 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి డబ్బు మనోహరి కొట్టేస్తుందా..? 

Wedensday TV Movies : బుధవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Big Stories

Advertisement
×