E-Paper
Advertisement

భోగి ప్రమోషన్లకు దూరంగా అనుపమ… హైలెట్ అవుతున్న డింపుల్.. అదే కారణమా?

భోగి ప్రమోషన్లకు దూరంగా అనుపమ… హైలెట్ అవుతున్న డింపుల్.. అదే కారణమా?
Advertisement

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక త్వరలోనే అనుపమ నటించిన భోగి సినిమా(Bhogi Movie) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శర్వానంద్(Sharwanand) అనుపమ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 12వ తేదీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ నవంబర్ 27వ తేదీ విడుదసిద్ధమయింది. ఈ. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల మ్యూజికల్ ఈవెంట్స్ తో పాటు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగిన సంగతి తెలిసిందే.

అనుపమ హర్ట్ అయ్యారా..

ఇలా ఈ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు . ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran)ఎక్కడ సందడి చేయలేదు. ఈ నేపథ్యంలోనే అనుపమ భోగి ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉంది అనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. భోగి సినిమా విషయంలో అనుపమ పరమేశ్వరన్ హార్ట్ అయ్యారా అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉన్నారా? అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక అనుపమ ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండడానికి ఇదే కారణం అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. డింపుల్ హయతి (Dimple Hayathi)కారణంగానే అనుపమ ఈ ప్రమోషన్లకు దూరంగా ఉన్నట్టు సమాచారం.

డింపుల్ పాత్రకు ప్రాధాన్యత..

Advertisement

ఈ సినిమా షూటింగుకు ముందు అనుపమకు ఒక కథ వివరించి షూటింగ్ మొదలైన తర్వాత తన పాత్రకు సంబంధించిన ప్రాధాన్యత పూర్తిగా తగ్గించారని తెలుస్తుంది. తొలుత ఈ సినిమాలో డింపుల్ హయతిని ఒక సపోర్టింగ్ పాత్ర కోసం తీసుకున్నారట ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత కథలో మార్పులు చేస్తూ అనుపమ కంటే డింపుల్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తుంది.కావాలనే డింపుల్ హయాతి పాత్రను హైలైట్ చేయడం కోసమే ‘భోగి’ టీమ్ ఇదంతా ప్లాన్ చేస్తోందని, అందుకే అనుపమను ఉద్దేశపూర్వకంగానే ప్రమోషన్లకు దూరం పెట్టినట్టు సమాచారం.

కావాలనే దూరం పెట్టారా..

ఇక ఇటీవల భోగి సినిమా ప్రమోషన్లలో భాగంగా డింపుల్ హయాతికి ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే నిజంగానే అనుపమను దూరం పెట్టారని తెలుస్తోంది. ఇక అనుపమ పరమేశ్వరన్ సైతం ఈ సినిమా విషయంలో బాగా హార్ట్ అవడంతోనే ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. అలాగే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో అప్డేట్స్ విడుదల చేసినప్పటికీ అనుపమ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేయకపోవడం గమనార్హం. మరి భోగి సినిమా విషయంలో అనుపమ ఎందుకు దూరంగా ఉన్నారు అసలేం జరిగింది అనే విషయాల పట్ల పూర్తిస్థాయిలో స్పష్టత రావాలి అంటే ఈ విషయంపై మేకర్స్ లేదా అనుపమ స్పందించాల్సి ఉంది.

Advertisement

Also Read: డైరెక్టర్ సుజిత్ తో గొడవలు.. జగపతిబాబు షోలో బయటపెట్టిన శేష్..

Related News

కుర్రాళ్ల ఫేవరెట్ ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ ఎప్పుడంటే?

రూ.2,000 కోట్ల క్లబ్‌పై రామాయణ కన్ను.. సాధ్యమేనా?

నర్సన్నా.. నన్ను కూడా సీఎం చేస్తావా? శర్వానంద్ కామెంట్స్ వైరల్!

శోభిత షేర్ చేసిన ఫొటోకు నెటిజన్లు ఫిదా.. క్యాప్షన్ కూడా అంతే స్పెషల్!

సొగసుల సుందరి కాజల్.. 40ల్లో కూడా హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తూ!

కాక వెనక్కి.. విశ్వంభర ముందుకు.. సంక్రాంతికి చిరు సర్‌ప్రైజ్!

అంచనాలు పెంచేస్తున్న వృషకర్మ.. ట్రైలర్‌తో అసలు విషయం బయటపడనుందా?

Big Stories

Advertisement
×