E-Paper
Advertisement

బిగ్ బాస్10 విన్నర్ అతడే.. రోహిత్ వెళ్ళిపోయాక షో చూడడం మానేశారు: కౌశల్

బిగ్ బాస్10 విన్నర్ అతడే.. రోహిత్ వెళ్ళిపోయాక షో చూడడం మానేశారు: కౌశల్
Advertisement

Kaushal Manda:బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా.. నటుడిగా, మోడల్ గా, కమర్షియల్ డైరెక్టర్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కౌశల్ మండా (Kaushal Manda) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అటు తెలుగు సినిమాలతో ఇటు టెలివిజన్ సీరియల్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. ఇటీవల ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్ ఇంటర్నేషనల్ 2026’ అందాల పోటీకి ఇండియా – అమెరికా తరఫున నేషనల్ డైరెక్టర్గా నియమితులయ్యారు.

ఇదే నా చివరి వీడియో..

అలా ఇన్ని పనులతో బిజీగా ఉన్నప్పటికీ.. బిగ్ బాస్ పై తనకున్న ప్రేమను చంపుకోలేకపోతున్నారు కౌషల్ మండా. అందులో భాగంగానే బిగ్ బాస్ సీజన్స్ రివ్యూలు ఇస్తూ.. ఎవరు టాప్ 5 లో ఉంటారు? ఎవరు విజేతగా నిలుస్తారు అంటూ కామెంట్లు చేస్తూ వస్తున్న కౌశల్ మండా.. బిగ్ బాస్ సీజన్ 10 పూర్తి కావడానికి ఇంకా నాలుగు వారాలు ఉన్నా.. అప్పుడే ఇది తన చివరి వీడియో అంటూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ త్రిగుణ్..

Advertisement

ముఖ్యంగా ఈయన పదో సీజన్ పైన చేస్తున్న వీడియోలు, మాట్లాడుతున్న మాటలు ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెబుతూ.. ఇదే తన లాస్ట్ వీడియో అంటూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. కౌశల్ మాట్లాడుతూ..” బిగ్ బాస్ సీజన్ 10 పై నేను ఇస్తున్న రివ్యూ ఇదే చివరిది. ఇకపై ఈ సీజన్ కి రివ్యూ చేయను. మరో వీడియో వదలను.. ప్రతిసారి నేను చెప్పినట్టుగానే విన్నర్, రన్నర్ ప్లేస్ లు ఫిక్స్ అయ్యేవి. కానీ ఈసారి కాస్త మారిపోయింది. నేను ముందు నుంచి రోహిత్, త్రిగుణ్ టాప్ 2 స్థానాల్లో ఉంటారని చెప్పాను. వాళ్లే కప్పు కొట్టాలి. కానీ కొన్ని కారణాలవల్ల రోహిత్ ఎలిమినేట్ అయ్యారు. అయితే రోహిత్ కి మళ్ళీ బిగ్బాస్ నుంచి కాల్ వచ్చినా రోహిత్ దానిని రిజెక్ట్ చేశాడు. ఇది అతని సొంత నిర్ణయం . ఇక రోహిత్ ని మనం బిగ్ బాస్ లో చూడలేము కాబట్టి ఇక ఎలాగో మిగిలింది త్రిగుణ్ మాత్రమే. అతడే బిగ్ బాస్ సీజన్ 10 విజేత అంటూ కామెంట్ చేశారు కౌశల్.

రోహిత్ వెళ్లిపోయాక షో చూడడం మానేశారు..

మనం ఎప్పుడైతే నిజాయితీగా అనుకొని ఒక రివ్యూ ఇస్తామో.. వాళ్లు ఫైనల్ లో లేకపోతే నిజంగా మనసు బాధపడుతుంది. ఈ సీజన్లో రోహిత్ ఎప్పుడైతే బయటకు వచ్చేశారో అప్పటికి చాలామంది షో చూడడం ఆపేశారు. కానీ గేమ్ బాగా ఆడేవారు ఫైనల్స్ వరకు ఉండి సత్తా చాటాల్సి ఉంటుంది.కానీ మధ్యలోనే ఆడియన్స్ మెప్పు పొందిన రోహిత్ బయటకు రావడం నమ్మశక్యంగా లేదు. ఇక ఏదేమైతేనే ఈ సీజన్ విన్నర్ త్రిగుణ్.. ముందుగా నీకు శుభాకాంక్షలు అంటూ ఒక వీడియో విడుదల చేశారు కౌశల్ మండా. మొత్తానికి అయితే రోహిత్ కప్పు కొడతారని అనుకున్న వారిలో కౌశల్ కూడా ఒకరు. ఇక మధ్యలోనే రోహిత్ బయటకు రావడంతో.. కౌశల్ ఇక రివ్యూలు ఇవ్వను అంటూ చెప్పేశారు. ఏదేమైనా ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

also read:కుర్రాళ్ల ఫేవరెట్ ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ ఎప్పుడంటే?

ఈ సీజన్ ఆకట్టుకోలేదు – కౌశల్

ఇకపోతే ఈ వీడియోకి ఆయన క్యాప్షన్ గా..” సాధారణంగా రెండవ వారంలో నేను ఏది ఊహిస్తానో అదే జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని పరిస్థితుల కారణంగా రోహిత్ నాయుడు తప్పుకోవడంతో ఈ సీజన్లో నా రివ్యూలను కొనసాగించాలని నాకనిపించడం లేదు. నిజం చెప్పాలంటే చాలా సాదాసీదాగా, అంతంతమాత్రంగానే ఉంది. అందుకే వచ్చే సీజన్లో బలమైన కంఠస్టెంట్లతో మరింత పెద్ద వినోదంతో మీ అందరిని చూడాలని ఆశిస్తున్నాను.. వచ్చే సీజన్ కి కలుద్దాం” అంటూ పోస్ట్ పెట్టారు.

?utm_source=ig_web_copy_link&bqrl=NTc4MTIwNjQ2YQ==

Related News

ఇదెక్కడి క్రేజ్ రా మావా.. బుల్లెట్ బండి లక్ష్మణ్ మరోసారి అదరగొట్టేశాడుగా!

డైరెక్టర్ సుజిత్ తో గొడవలు.. జగపతిబాబు షోలో బయటపెట్టిన శేష్..

చిన్న వయసులోనే వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న బుల్లితెర సెలబ్రిటీ కిడ్స్!

హౌస్ లో సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన పవన్ – రీతూ చౌదరి!

Podarillu Today Episode : కన్నీళ్లు పెట్టుకున్న మహాలక్ష్మీ.. ఇది కదా ఫైనల్ ట్విస్ట్.. చక్రీ పంట పండిందిరో..

Brahmamudi Serial Today Episode November 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసుకు వెళ్లి మరీ ఇందుకు నిజం చెప్పిన రఘువీర్ 

Intinti Ramayanam Today Episode: కమల్ కు నిజం చెప్పిన అవని.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. రమ్య ఎంట్రీతో కమల్ హ్యాపీ..

Big Stories

Advertisement
×