Actress Aamani: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి ఆమని(Aamani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమని ఒకవైపు సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూనే మరోవైపు బుల్లితెర సీరియల్స్ లో కూడా సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu Pillalu) అనే సీరియల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇలా బుల్లితెర సీరియల్ తో పాటు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఆమని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సీరియల్స్ చేయడం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన ఆమనికి నటన వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. అయితే తనకు సీరియల్స్ లో నటించడం మాత్రం చాలా కష్టంగా ఉందని ఆమని చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సీరియల్స్ లో నటించడం కంటే సినిమాలలో నటించడమే చాలా ఈజీగా ఉంటుందని సీరియల్స్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు. ఒక సినిమాకు కమిట్ అయిన తర్వాత స్క్రిప్ట్ మొత్తం మన చేతిలో ఉంటుంది. ఒక సన్నివేశం షూట్ చేయడానికి ముందు ఆ డైలాగ్స్ అన్ని చదువుకుంటే షూటింగ్ చేయడం మనకు పెద్ద కష్టం కాదు. కానీ సీరియల్స్ అలా కాదని ముందుగానే మనకు స్టోరీ చెప్పరని, అప్పటికప్పుడు ఒక సన్నివేశాన్ని షూట్ చేస్తే అందుకు అనుగుణంగా మనం నటించాల్సి ఉంటుంది. అందుకే సీరియల్స్ చేయడం అంటే చాలా కష్టమని ఆమని తెలిపారు.
ఇలా సీరియల్స్ కంటే సినిమాలే బెటర్ అంటూ ఈమె చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తూ.. నిజంగానే టీవీ ఆర్టిస్టులు గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమని నటిస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతూ మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ సీరియల్లో నలుగురు పిల్లల తల్లిగా ఆమని పాత్ర హైలెట్ గా ఉందని చెప్పాలి. ఈ సీరియల్ తో పాటు ఈమె ముఖ్యమంత ముద్దు, ఆమని, కొత్తగా రెక్కలొచ్చేనా వంటి సీరియల్స్ లో నటించారు. మరోవైపు సినిమాలలో తల్లి పాత్రలలో నటిస్తూనే, వెబ్ సిరీస్ ల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Also Read: నిశ్చితార్థం తర్వాత సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ పోస్ట్..ఫిదా అవుతున్న ఫ్యాన్స్!