E-Paper
Advertisement

శోకసంద్రంలో మునిగిపోయిన బిగ్ బాస్ ప్రియాంక సింగ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

శోకసంద్రంలో మునిగిపోయిన బిగ్ బాస్ ప్రియాంక సింగ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Advertisement

Bigg boss Priyanka Singh: ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సాయి తేజ అలియాస్ ప్రియాంక సింగ్ (Priyanka Singh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పింకీగా మరింత పాపులారిటీ అందుకున్న ఈమె.. జబర్దస్త్ షో కంటే కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత పెరిగిపోయింది.ఇక్కడ పూర్తి అమ్మాయిగా మారి తన అందం, అభినయంతో అందరినీ ఒక్కసారిగా ఆకట్టుకుంది. పూర్తి అమ్మాయిగా మారిపోయిన ప్రియాంక సింగ్ ను చూసి కళ్ళు చెదిరిన అభిమానులు కోకొల్లలు. అలా తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె తాజాగా కన్నీటి పర్యంతం అవుతూ ఒక ఎమోషనల్ పోస్టు షేర్ చేసింది.

శోకసంద్రంలో ప్రియాంక సింగ్..

తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వ్యక్తితో ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేస్తూ..” ఈరోజు నేను నా ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను. నిజం చెప్పాలంటే ఈ హృదయ విధారకర వార్తను ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఇకపై మాతో ఉండరు అనే నిజాన్ని నా గుండె అంగీకరించలేకపోతోంది. దేవుడా.. సాధ్యమైతే దయచేసి నా స్నేహితుడిని తిరుగు పంపండి. మేము సృష్టించుకోవాల్సిన కలలు , జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి..

సోదర సమానులైన వ్యక్తి మృతి..

Advertisement

వంశీ గారు ..మీరు నాకు ఎప్పుడూ కూడా ఒక స్నేహితుడిగా కంటే కూడా సొంత అన్నయ్యలా ఉండేవారు. మనం పంచుకున్న బంధం ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. మిమ్మల్ని కోల్పోయిన బాధను వ్యక్తపరచడానికి కూడా నా దగ్గర మాటలు లేవు. మేము మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నామో.. మాటల్లో చెప్పలేనంతగా మిస్ అవుతున్నాం.. మనం మళ్లీ కలిసే వరకు మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.ను మా కళ్ళ ముందు నుండి మీరు దూరమైనా.. మా హృదయాల నుండి ఎప్పటికీ దూరం కాలేరు ” అంటూ ఎమోషనల్ పోస్టు షేర్ చేసింది.. ఇకపోతే ప్రియాంక సింగ్ సోదర సమానుడైన తన స్నేహితుడిని కోల్పోయానని చెప్పడంతో అభిమానులు కూడా అతనికి ఏమైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఏ కారణం చేత ఆ వ్యక్తి మరణించారు అనే విషయంపై మాత్రం ఆమె స్పష్టత ఇవ్వలేదు.

also read: మత్తు వదలరా’ మూవీ నటి అరెస్ట్.. జాబితాలో ఇంకెంతమందో?

ప్రియాంక సింగ్ కెరియర్..

Advertisement

ప్రియాంక సింగ్ విషయానికొస్తే.. జబర్దస్త్ లో సాయి తేజ అనే తెర పేరుతో విశేష ప్రజాదారణ సొంతం చేసుకుంది. తన అసాధారణమైన కామిడీ టైమింగ్స్ తో తెలుగు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె.. 2013 తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ 2017లో పవన్ మల్లెల దర్శకత్వంలో వచ్చిన కమర్షియల్ యాక్షన్ కామెడీ చిత్రం బాలకృష్ణుడు లో ఒక పాత్రతో వెండితెరకు పరిచయమైన ఈమె.. రెండు మూడు చిత్రాలలో నటించి వెండితెరకు దూరం అయింది.. 2021లో అదిరింది షోలో మళ్లీ తన కామెడీ ప్రస్థానాన్ని కొనసాగించిన ఈమె.. అదే ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఇక్కడ దాదాపు 91 రోజుల పాటు కొనసాగి మంచి పేరు సొంతం చేసుకుంది.

Related News

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి అండగా రామరాజు.. భద్రకు దిమ్మతిరిగే కౌంటర్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : మనీష కోసం టెన్షన్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. విక్కీకి షాక్..

Karthika Deepam 2 Serial Today Episode November 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇచ్చిన సుమిత్ర   

Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బతో పల్లవి షాక్.. పూజ పూర్తి.. పల్లవికి ఘోర అవమానం..

Gundeninda GudiGantalu Today episode: ప్రభా కక్కుర్తి.. రోహిణి ప్లాన్ సక్సెస్.. మనోజ్ ఫుల్ హ్యాపీ..

Brahmamudi Serial Today Episode November 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందులకు షాక్ ఇచ్చిన పంతులు  

శృతి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Big Stories

Advertisement
×