Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత రెండు రోజుల క్రితం నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈయన తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి అయినటువంటి కిరణ్మయి (Kiranmayi)అనే అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థపు వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సాయి తేజ్ మాత్రం ఇప్పటివరకు తన నిశ్చితార్థం గురించి కానీ తన పెళ్లి గురించి కానీ ఎక్కడ అధికారకంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయలేదు.
ఇలా తన ప్రియురాలితో నిశ్చితార్థం జరుపుకున్న అనంతరం సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సోషల్ మీడియా వేదికగా చేసిన ఫస్ట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాయి తేజ్ నిశ్చితార్థపు వేడుకలో భాగంగా కిరణ్మయితో కలిసి దిగిన ఫోటోని ఈయన షేర్ చేస్తూ ‘ఐ లవ్ యూ’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా సాయి తేజ్ పెళ్లి గురించి తన నిశ్చితార్థం గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఈయన మాత్రం ఎక్కడా స్పందించలేదు. తాజాగా తన ప్రేయసితో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ లవ్ యు అంటూ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ మాత్రం ఈ పోస్ట్ చూసి పిదా అవుతున్నారు.
ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సాయి తేజ్ కిరణ్మయి దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ నిశ్చితార్థపు వేడుకలో భాగంగా మెగా, అల్లు కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు కూడా ఈ నిశ్చితార్థపు వేడుకలో పాల్గొన్నారని తెలుస్తోంది. ఇలా ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్న సాయి తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే వీరి పెళ్లి ముహూర్తం కూడా ఖరారు అయిందని తెలుస్తోంది.
టాలీవుడ్ సమాచారం ప్రకారం సాయి తేజ్ కిరణ్మయిల వివాహం డిసెంబర్ 10వ తేదీ జరగబోతుందని తెలుస్తుంది. ఇక వీరి వివాహ వేడుక హైదరాబాద్ లోనే చాలా ఘనంగా జరగబోతుందని, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరగబోతుందని తెలుస్తుంది. ఇకపోతే సాయి తేజ్ నిశ్చితార్థపు వేడుకలో భాగంగా మెగా ఫ్యామిలీ అందరూ పాల్గొన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. ఇక పెళ్లికి సమయం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి.
Also Read: తేజ సజ్జ నిశ్చితార్థం.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం!