E-Paper
Advertisement

‘జిమ్ జిమ్ తారా’ ఆంటీ రేంజ్ మారిపోయిందిగా.. ఏకంగా ఆ షోలో ఛాన్స్!

‘జిమ్ జిమ్ తారా’ ఆంటీ రేంజ్ మారిపోయిందిగా.. ఏకంగా ఆ షోలో ఛాన్స్!
Advertisement

Lakshmi Aunty:సోషల్ మీడియా ఆదరణ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో కాస్త టాలెంట్ ఉన్నా చాలు ఇట్టే వైరల్ అయిపోవచ్చు. అయితే అలా వైరల్ అయిన వారికి ఈ మధ్యకాలంలో టీవీ షోలలో, సినిమాలలో కూడా అవకాశాలు కల్పిస్తూ మరింత పాపులారిటీ అందిస్తున్నారు. అలాంటి వారిలో “జిమ్ జిమ్ తార” సాంగ్ ఆంటీ కూడా ఒకరు. ఈ ఒక్క పాట రీమిక్స్ వెర్షన్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒక్క పాటతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న లక్ష్మీ ఆంటీ..

జిమ్ జిమ్ తార అనే పాటను గోగుల లక్ష్మీదేవి (Gogula Lakshmi Devi) రచించి, ఆలపించారు. దీంతో యూత్ అంతా “లక్ష్మీ ఆంటీ”గా ఈమెను పిలవడం మొదలుపెట్టారు. అలా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఆన్లైన్లో విపరీతంగా పేరు దక్కించుకుంది. ఇకపోతే ఈ పాటను వినయ్ శశిధర్ సంగీత దర్శకత్వంలో కార్తికేయ, అనుక్త నల్లని జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తెలుగు చిత్రం పర్ణశాలలో కూడా అధికారికంగా పూర్తి నిడివి ఉన్న పాటను రూపొందించారు. అలా ఈ ఒక్క పాటతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న లక్ష్మీ ఆంటీ కి.. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఈమెను ఏకంగా జబర్దస్త్ కామెడీ షో లో చూపించబోతున్నారు.

జబర్దస్త్ షోలో అవకాశం..

Advertisement

ఈ విషయాన్ని తాజాగా లక్ష్మీ ఆంటీ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. షూటింగ్ సెట్లో ప్రముఖ సినీ నటుడు కృష్ణ భగవాన్, జబర్దస్త్ వర్షతో పాటు మరికొంతమంది నటీనటులు అక్కడ ఉన్న వీడియోని ఆమె తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. మొత్తానికైతే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జిమ్ జిమ్ తారా ఆంటీ రేంజ్ భారీగా పెరిగిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈమె ఎపిసోడ్ ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.

also read:‘బెవర్లీ హిల్స్’ నటి మృతి.. అసలేం జరిగిందంటే?

ఆదర్శ కుటుంబం మూవీ టీం పై లక్ష్మీ ఆంటీ మండిపాటు..

Advertisement

ఇకపోతే ఈ పాటతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram ) కాంబినేషన్లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో అనుమతి లేకుండా తన పాటను ఉపయోగించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేసి వార్తల్లో నిలిచారు.

పెరుగుతున్న ఆదరణ..

ఇకపోతే ఈమెకు సోషల్ మీడియాలో భారీగా పాపులారిటీ ఉండడంతో తెలుగు యూట్యూబ్ , మీడియా నెట్వర్క్ లలో అనేక ఇంటర్వ్యూలు ఇస్తూ.. స్థానిక బ్రాండ్ లాంచ్ లు, అలాగే హోమ్ టూర్లలో కనిపిస్తూ మరింత ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో కూడా ఈమె భాగమైంది అని తెలియడంతో ఈమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

హీరోగా అవతారం ఎత్తిన బిగ్ బాస్ కళ్యాణ్ పడాల.. డైరెక్టర్ ఎవరంటే?

శోకసంద్రంలో మునిగిపోయిన బిగ్ బాస్ ప్రియాంక సింగ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి అండగా రామరాజు.. భద్రకు దిమ్మతిరిగే కౌంటర్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : మనీష కోసం టెన్షన్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. విక్కీకి షాక్..

Karthika Deepam 2 Serial Today Episode November 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇచ్చిన సుమిత్ర   

Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బతో పల్లవి షాక్.. పూజ పూర్తి.. పల్లవికి ఘోర అవమానం..

Gundeninda GudiGantalu Today episode: ప్రభా కక్కుర్తి.. రోహిణి ప్లాన్ సక్సెస్.. మనోజ్ ఫుల్ హ్యాపీ..

Big Stories

Advertisement
×