Hyper Aadi: హైపర్ ఆది (Hyper Aadi)పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ప్రేక్షకులకు పరిచయమైన ఆది అనంతరం తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు. ఇలా తన కెరియర్ పరంగా అంచలంచలుగా ఎదుగుతూ నేడు బుల్లితెరపై, వెండితెరపై ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే హైపర్ ఆది నేడు ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు కారణం మరొక కమెడియన్ అదిరే అభి(Adhire Abhi) అని చెప్పాలి. జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఆ షో చూసిన హైపర్ ఆది ఒక అద్భుతమైన స్కిట్ రాసి అదిరే అభికి పంపించడం అది నచ్చే అదిరే అభి తన టీమ్ లోకి తీసుకోవడం జరిగింది. ఇలా మొదట్లో స్కిట్ రైటర్ గా ఉన్న ఆది కమెడియన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జబర్దస్త్…
ఆది పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయి తన అద్భుతమైన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఆది ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న ఇతర కార్యక్రమాలలోనూ అలాగే సినిమా అవకాశాలను అందుకొని ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమై 12 సంవత్సరాల పూర్తి కావడంతో మెగా సెలబ్రేషన్స్ అంటూ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న కమెడియన్స్ అందరూ పాల్గొని సందడి చేశారు.
ఆదిలాంటి గొప్ప శిష్యుడిని సంపాదించుకున్నా…
ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆగస్టు 8 అలాగే 9 తేదీలలో ప్రసారం కాబోతోంది తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా గురు శిష్యులు అంటూ శిష్యులు తమ గురువులకు కాళ్లు కడిగి వారి రుణం తీర్చుకున్నారు. ఇందులో భాగంగానే హైపర్ ఆది తనకు ఇలాంటి లైఫ్ ఇచ్చిన అదిరే అభికి కాళ్లు కడిగి సన్మానం చేశారు. అనంతరం అదిరే అభి మాట్లాడుతూ.. ఎవరైనా నీ లైఫ్ లో నువ్వేం సాధించావు అని అడిగితే ఆదిలాంటి ఒక గొప్ప శిష్యుని సంపాదించుకున్నానని చాలా గర్వంగా చెప్పుకుంటాను అంటూ అభి ఎమోషనల్ అయ్యారు.
ఇక జబర్దస్త్ కార్యక్రమం నా జీవితానికి ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చిందని ఈయన తెలియజేశారు. ఓసారి నేను అమ్మ నాన్నలను తీసుకొని హాస్పిటల్ కి వెళ్తే అక్కడునటువంటి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇలాంటి కొడుకు ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు అంటూ నాన్న దగ్గర మాట్లాడారు. ఇంతకన్నా నాకేం కావాలి అంటూ అభి ఈ సందర్భంగా జబర్దస్త్ కార్యక్రమం తనకు తెచ్చిపెట్టిన గుర్తింపును తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పటిలాగే కమెడియన్స్ అందరు కూడా అద్భుతమైన స్కిట్ లతో ప్రేక్షకులను సందడి చేస్తూ కడుపుబ్బ నవ్వించారని తెలుస్తుంది. ఇలా ఎంతో కనుల పండుగగా ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తుంది కానీ ఈ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్(Sudigali Sudheer) రోజా(Roja) కనిపించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Anasuya -Rashmi: అనసూయ, రష్మీ మధ్య గొడవలు.. ఎంత ఎదిగిన జబర్దస్త్ అనసూయనే!