BigTV English

Chiranjeevi: పెద్దన్న ఏంట్రీ.. చిరంజీవి ఇంట్లో నిర్మాతల కీలక సమావేశం.. ఏం చర్చించారంటే!

Chiranjeevi: పెద్దన్న ఏంట్రీ.. చిరంజీవి ఇంట్లో నిర్మాతల కీలక సమావేశం.. ఏం చర్చించారంటే!


Tollywood Producers Meet Chiranjeevi: మెగాస్టార్చిరంజీవి ఇంట్లో నిర్మాతల భేటీ ముగిసింది. సినీ కార్మికుల సమ్మెపై (Cine Workers Strike) మంగళవారం నిర్మాతలు ఆయన ఇంట్లో సమావేశమైన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం నిర్మాత సి. కళ్యాణ్మీడియాలో మాట్లాడారు. నిర్మాతలు చిరంజీవి (Producers Meeti ng With Chiranjeevi) గారిని కలిసి సమస్య చెప్పామన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరించాము. దీనిపై ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. షూటింగ్స్ సడెన్ గా ఆపడం భావ్యం కాదని, మీ సమస్యలు చెప్పారు అటు వైపు కార్మికుల వెర్షన్ను కూడా తెలుసుకుంటానన్నారు.

చిరంజీవి ఇంట్లో భేటీ


రెండు మూడు రోజుల్లో పరిస్థితులు చక్కబడకపోతే తాను జోక్యం చేసుకుంటానన్నారు. రేపు సమస్యలపై చర్చిస్తామని నిర్మాత సి కళ్యాణ్తెలిపారు. కాగా వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం ఏడాదికి 10 శాతం చొప్పున మూడేళ్లకు 30 శాతం వేతనాలని పెంచాలని వారు డిమాండ్చేస్తున్నారు. దీనిపై నిర్మాతల నుంచి సానుకూలన స్పందన రాకపోవడంతో తెలుగు ఫిలిం ఫేడరేషన్కార్మికులతో కలిసి సమ్మెకు పిలుపునిచ్చింది. ఎలాంటి సమాచారం లేకుండానే రాత్రిరాత్రే కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో టాలీవుడ్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మె కారణంగా మీడియం, చిన్న సినిమాల షూటింగ్స్నిలిచిపోయాయి

భేటీలో పాల్గొంది వీళ్లే

సమావేశంలో ఫిలిం చాంబర్సభ్యులు సి కళ్యాణ్‌.. నిర్మాతలు అల్లు అరవింద్‌, సురేష్బాబు, సుప్రియ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవితో పాటు తదితరులు పాల్గొన్నారుఅయితే సమ్మె వల్ల ప్రస్తుతం టాలీవుడ్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మాతల వేతనాల పెంపుకు నిరాకరించడంతో ఫిల్మ్ఫెడరేషన్సమ్మెకి దిగింది. ఫిలిం ఛాంబర్ముందు ఆందోళనకు దిగాయి. దీంతో సినిమా షూటింగ్స్ఆగిపోయాయి. అయితే పెద్ద సినిమాల షూటింగ్స్మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. కొందరు కార్మికులు మాత్రం సమ్మెతో సంబంధం లేకుండ షూటింగ్స్లో పాల్గొనడంతో సమ్మె కార్మికులు వారిని హెచ్చరిస్తున్నారు.

షూటింగ్స్లో పాల్గొనవద్దని వారిని బెదిరిస్తూ.. షూటింగ్స్ని అడ్డుకుంటు అంతరాయం కలిగిస్తున్నారు. అలాంటి వారిపై ప్రొడ్యూసర్స్గిల్ఆగ్రహం వ్యక్తం చేసింది. మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె పేరుతో ఆందోళన చేపడుతూ.. షూటింగ్స్కి అంతరాయి కలిగిస్తున్న వారిపై బ్యాన్విధించేలా నిర్ణయం తీసుకోబోతున్నారట. భవిష్యత్తులో వారు షూటింగ్స్లో పాల్గొనకుండ నిర్మాతలు కార్మికులకు షాకివ్వబోతున్నారట. ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన లేదు. కానీ, దిశ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. అయితే సమ్మె వెనక ఫెడరేషన్కుట్ర ఉన్నట్టు తెలుస్తోంది. కార్మికులను అడ్డుపెట్టుకుని నాయకులు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ నిర్మాతలకు తలనొప్పిగా మారుతున్నారంటూ ఇండస్ట్రీవర్గాలు అంటున్నాయి.

Also Read: Tollywood: సినీ కార్మికులకు నిర్మాతల ఝలక్.. ఇక భవిష్యత్తులో వారు షూటింగ్లో పాల్గొనేది లేదు!

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×