Mass Jathara: మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకుడిగా తెరకెక్కుతున్న చిత్రం మాస్ జాతర. సితార ఎంటర్టైన్మెంట్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఆగస్టు 27న మాస్ జాతర ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం మాస్ జాతర నుంచి రెండో లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది.
ఓలే ఓలే అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం అక్కట్టుకుంటుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. మాస్ స్టెప్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన రవితేజ మరోసారి ఈ సాంగ్ లో తన సత్తా చాటాడు. ధమాకాలో ఇప్పటికే వీరి కాంబో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఈ సాంగ్ లో ఈ జంట అదరగొట్టారు. ఊర మాస్ లిరిక్స్ తో పాటు డ్యాన్స్ కూడా పిచ్చెక్కించారు. ముఖ్యంగా రవితేజ ఎనర్జీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
శ్రీలీల తన అందంతో అదరగొట్టింది. భాస్కర్ యాదవ్ దాసరి అందించిన లిరిక్స్ .. భీమ్స్ , రోహిణీ తమ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక రవితేజ, శ్రీలీల డ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అదిరిపోయింది. లైంగిక వేధింపుల కేసులో జైలు నుంచి బయటకు వచ్చాక మొదటిసారి ఆయనకు వచ్చిన ప్రాజెక్టు మాస్ జాతర అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఆగస్టు 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.