E-Paper
Advertisement

అలీ వైఫ్ జుబేదా యూట్యూబ్ ఆదాయం ఎంతో తెలుసా?

అలీ వైఫ్ జుబేదా యూట్యూబ్ ఆదాయం ఎంతో తెలుసా?
Advertisement

Ali Wife Zubeda: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అలీ(Ali) ఒకరు. బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలీ కమెడియన్ గా ఇండస్ట్రీలో వందల సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటికీ ఈయన కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే అలీ భార్య జుబేదా(Zubeda) కూడా అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తమకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అలాగే వంటలకు సంబంధించిన వీడియోలను అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు..

సోషల్ మీడియాలో విమర్శలు..

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జుబేదా ప్రస్తుతం బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల జుబేదా అనారోగ్య సమస్యల కారణంగా హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీ తర్వాత ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ లో వంటల వీడియోలు ఆపడం గురించి అలాగే యూట్యూబ్ ఆదాయం(Youtube Income) గురించి వారి ఆస్తిపాస్తులకు సంబంధించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇంగ్లీష్ మాట్లాడటం రాదు..

Advertisement

యూట్యూబ్ ఛానల్ లో వంట వీడియోలు మానేయడానికి కారణం అలీ గారని తెలిపారు. తాను తన గురించి ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే అదే విషయం గురించి పదేపదే ఆలోచిస్తూ బాధపడుతుంటా అందుకే సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు ఇది అవసరమా అంటూ ఆయన చెప్పుకొచ్చారని అందుకే వీడియోలు తగ్గించానని తెలిపారు. తాను పదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. ఇంగ్లీష్ చదవగలను కానీ మాట్లాడలేను కొన్ని పదాలు కూడా తప్పుగా మాట్లాడుతుంటాను ఈ విషయంపై నన్ను చాలామంది విమర్శలు చేస్తుంటారని జుబేదా తెలిపారు.

వేలకోట్ల ఆస్తులు..

Advertisement

ఇలా సోషల్ మీడియా గురించి ఈమె మాట్లాడుతున్న నేపథ్యంలో యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం గురించి కూడా తెలిపారు. సోషల్ మీడియాలో తాను యూట్యూబ్ ద్వారా లక్షల సంపాదిస్తున్నానని మాకు వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి అంటూ వచ్చే వార్తలు చూసి షాక్ అయ్యానని తెలిపారు. నిజంగా అన్ని ఆస్తులు ఉంటే బాగుండేది అనిపించింది. ఇక మా ఇంటికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి అలాంటి అందమైన ఇల్లు ఉండాలని తాను కూడా కోరుకుంటున్నానని ఈమె ఆ వార్తలన్నింటిని కొట్టి పారేశారు. మాకు వేల కోట్ల ఆస్తులు ఏమీ లేవని ,అలాగే యూట్యూబ్ ద్వారా మీరు అనుకున్నంత సంపాదన లేదని తెలిపారు . మాకు హైదరాబాద్ లో మాత్రమే ఇల్లు ఉంది రాజమండ్రిలో సొంత ఇల్లు ఉంది. ఇవి తప్ప మాకు ఎక్కడ ఎలాంటి బిల్డింగ్స్ లేవని ఈ సందర్భంగా జుబేదా క్లారిటీ ఇచ్చారు.

Also Read: సుదీర్ లక్షలు సంపాదిస్తున్న రూపాయి కూడా లేదా?అంతా అతని చేతుల్లోనే ?

Related News

వెయిటింగ్ ఈజ్ ఓవర్.. వెండితెరపై కలుద్దాం: యాంకర్ శివ జ్యోతి!

సుదీర్ లక్షలు సంపాదిస్తున్న రూపాయి కూడా లేదా?అంతా అతని చేతుల్లోనే ?

అలా ఈడ్చుకెళ్తుంటే కనిపించలేదా మీకు.. నరేష్ పై నీతూ మాస్టర్ ఫైర్!

నేను లేకపోతే కెప్టెన్ కాదు కదా కంటెండర్ షిప్ కూడా కాలేవ్.. ముఖేష్ కౌంటర్!

జాను లిరి అంటేనే ఫోక్ సాంగ్స్‌కు ఫుల్ జోష్.. ఒక్కో పాటకు కోట్ల వ్యూస్!

అంతర్జాతీయ స్థాయిలో కౌశల్ మండాకు కీలక బాధ్యతలు..30 ఏళ్ల అనుభవంలో?

Gundeninda GudiGantalu Today episode: శృతి మాటతో నీతూ షాక్.. అరుణ్ కు మైండ్ బ్లాక్.. బాలు ఏం చేస్తున్నాడు..?

Big Stories

Advertisement
×