E-Paper
Advertisement

ఒకే వేదికపై రామ్ చరణ్, నాగార్జున.. ఫ్యాన్స్‌కు పండగే!

ఒకే వేదికపై రామ్ చరణ్, నాగార్జున.. ఫ్యాన్స్‌కు పండగే!
Advertisement

Ittu Arjuna:టాలీవుడ్ లోకి అనీష్ అనే మరో హీరో ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు.మలయాళీ బ్యూటీ అనశ్వర రాజన్ తో కలిసి ‘ఇట్లు అర్జున’ అంటూ ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయిపోయాడులవ్, ఎమోషన్స్, యాక్షన్, కామెడీని కలగలిపి వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఈ సినిమా నవంబర్ 13న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్.ఇందులో భాగంగా నిర్వహిస్తున్న మ్యూజికల్ కాన్సర్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మాములుగా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు ప్రమోషన్స్ అనేవి ఆక్సిజన్ అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రిలీజ్ కి ముందు ఏర్పాటు చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేవి సినిమా స్థాయిని మార్చేస్తాయి.ఇదిగో ఇపుడు ‘ఇట్లు అర్జున’ టీమ్ కూడా అలానే సాలిడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది మూవీ టీమ్.అయితే ఈసారి కేవలం సినిమా మేకర్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్‌లోని టాప్ స్టార్ హీరోలను ఒకే వేదికపైకి తీసుకొస్తుండటం విశేషం.

Advertisement

ఈరోజే హైదరాబాద్‌లోని నోవోటెల్ హైటెక్స్ హాల్ నంబర్ 4లో ‘ఇట్లు అర్జున మ్యూజికల్ కాన్సర్ట్’ పేరుతో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది మూవీ టీమ్.ఇక ఈ కార్యక్రమానికి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది.దీనికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వస్తుండగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న కింగ్ అక్కినేని నాగార్జున, యువ హీరో అఖిల్ అక్కినేని కూడా ఈ వేడుకలో పాల్గొంటారని తెలుస్తుంది.

ఒకవైపు మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, మరోవైపు అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున, అఖిల్ ఒకే వేదికపై కనిపించనుండటంతో ఈ ఈవెంట్‌ సంథింగ్ స్పెషల్ గా మిగిలిపోవడం పక్కా. సాధారణంగా పెద్ద హీరోలు చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తే ఆ సినిమాకి మంచి బజ్ వస్తుందన్న సంగతి తెల్సిందే. గతంలో కూడా స్టార్ హీరోలు తమకు సంబంధం లేని సినిమాల వేడుకలకు వచ్చి సపోర్ట్ చేశారు కూడా.ఇప్పుడు ‘ఇట్లు అర్జున’కు కూడా ఇలాంటి స్టార్ సపోర్ట్ లభిస్తుండటం విశేషం.

Advertisement

ఇక ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్. ఈమధ్య కాలంలో తమన్ సంగీతం తెలుగు సినిమాలకు ఎలా హైలెట్ గా నిలుస్తుందో చెప్పక్కర్లేదు.ముఖ్యంగా మాస్ బీట్స్‌తో పాటు మెలోడీ పాటలను కూడా అందించడం తమన్ స్పెషాలిటీ.  ‘అల వైకుంఠపురములో’, ‘భీమ్లా నాయక్’, ‘సర్కారు వారి పాట’, ‘గుంటూరు కారం’ వంటి సినిమాలతో సత్తా చాటిన తమన్ ఇపుడు ‘ఇట్లు అర్జున’కు కూడా తమన్ ఎలాంటి సంగీతాన్ని అందించాడన్నది క్యూరియసిటీ పెంచేస్తుంది.చూడాలి మరి నవంబర్ 13న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !

ALSO READ :యూసఫ్‌గూడలో చాలా ఆస్తులు సావిత్రి గారివేనా? ప్రేమ్ సాగర్ షాకింగ్ కామెంట్స్!

Tags

Related News

యూసఫ్‌గూడలో చాలా ఆస్తులు సావిత్రి గారివేనా? ప్రేమ్ సాగర్ షాకింగ్ కామెంట్స్!

అనన్య పాండే దీపావళి సెలబ్రేషన్స్.. ఏముంది ఈ అందం!

హీరోగా ఎంట్రీ.. హైకోర్టు అడ్వకేట్‌గా కెరీర్.. ప్రేమ్ సాగర్ లైఫ్‌లో ఇన్ని ట్విస్టులా?

అనిరుద్ కావ్య వెడ్డింగ్.. గ్రీస్ లో ల్యాండ్ అవుతున్న స్టార్స్!

మంచివాడిలా కనిపిస్తూనే విలనిజం.. గొల్లపూడి స్టైల్‌కు ఫిదా అవ్వాల్సిందే!

అనిరుధ్ – కావ్య మారన్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

రామాయణంలో సీత పాత్ర పై.. అలనాటి సీత షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×