Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10లో నామినేషన్ వార్ చాలా గట్టిగా సాగుతోంది. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ను బయటకు పంపించే క్రమంలో బాల్ పై వారి ఫోటోలను స్టిక్ చేసి మరీ కాలితో తన్నడం మరింత వైరల్ గా మారింది. ముఖ్యంగా ఒకరిపై ఒకరు పెట్టే పాయింట్ చూసే ఆడియన్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యేలా చేస్తోంది. ఇదిలా ఉండగా 8 వారాల వరకు మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్న నరేష్ తొమ్మిదవ వారంలో సంచాలక్ గా ఫెయిల్ అవ్వడమే కాకుండా తన కుటుంబాన్ని కలిసే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. ఇక ఇప్పుడు నీతూ మాస్టర్ కి జరిగిన అన్యాయాన్ని పక్కనపెట్టి.. వంశీకి అండగా నిలబడుతూ.. నామినేట్ పాయింట్ పెట్టడంతో అటు నరేష్ పై కూడా కొంతమంది నెటిజన్స్ మండిపడుతున్నారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడే చూద్దాం.
64వ రోజుకు సంబంధించి విడుదల చేసిన రెండవ ప్రోమోలో.. నరేష్ నీతూ మాస్టర్ను నామినేట్ చేయడం వరకు ఓకే కానీ ఆయన పెట్టిన నామినేట్ పాయింట్ కాస్త కరెక్ట్ గా లేదు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన వంశీ సైడ్ మాత్రమే ఆలోచించారని, నీతూ మాస్టర్ ను అంతగా ఈడ్చుకెళ్లినా.. అవన్నీ పట్టనట్టుగా నరేష్ వ్యవహరించడం అభిమానుల చేత వ్యతిరేకతను నెలకొనేలా చేస్తోంది. ఇక ప్రోమో విషయానికి వస్తే.. ముందుగా శివ ముఖేష్ ను నామినేట్ చేస్తూ.. దెబ్జానీ విషయంలో మీరు చేసింది ఫ్రాంక్ అంటే ఎవరు నమ్మరు. అని శివ చెబుతుంటే ముఖేష్ మాట్లాడుతూ నువ్వు నా క్యారెక్టర్ లెస్ అన్నావు అని ముఖేష్ అన్నాడు. దీనికి శివ మీరు కూడా అదే రోజు నన్ను క్యారెక్టర్ లేనివాడిగా చిత్రీకరించారు అంటూ ఫైర్ అయ్యాడు. దమ్ము లేదా ఒకవేళ దమ్ముంటే ఇలా ఎవరైనా ప్రాంక్ చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశాడు శివ. మీరు మబ్బుల్లో ఉన్నారు. మబ్బుల్లో తేలి ఆడుతున్నారు. మబ్బుల్లోనే ఉండి మబ్బేష్ అయిపోతారా అంటూ మండిపడ్డారు.మధ్యలో సుధీర్ మాట్లాడుతూ కలిసి ఉంటే ఒకటి.. లేకపోతే మరొకటి అంటూ తన వాదన వినిపించాడు.
ALSO READ:నేను లేకపోతే కెప్టెన్ కాదు కదా కంటెండర్ షిప్ కూడా కాలేవ్.. ముఖేష్ కౌంటర్!
రామకృష్ణ.. సుధీర్ ను నామినేట్ చేస్తూ మీరు ఫ్యామిలీ వీక్ వరకు ఉండడానికి కారణం ముఖేష్ అన్న అని రామకృష్ణ చెబుతుండగానే.. సుధీర్ మాట్లాడుతూ ఫ్యామిలీ వీక్ వరకు ఉండడానికి కాదు.. ఆ వీక్ ఉండడానికి కారణం అంటూ సుధీర్ కామెంట్ చేశారు. ఇక తర్వాత ముఖేష్ సుదీర్ పై మండిపడుతూ.. నీకు ఒక గేమ్ ఆడటానికి రాదు.. ఒక పర్సనాలిటీ లేదు.. ఏం సాధిస్తావ్.. నువ్వు ఇక్కడ ఉండడం నా వల్లే అంటూ అంటూ ఫైర్ అయ్యాడు.
దెబ్జానీ నీతూ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. మీకు పూర్తిగా సమాచారం తెలిస్తేనే మాట్లాడండి. లేకపోతే దానిని పెద్దది చేయకండి అంటూ త్రిగుణ్ విషయంలో నీతూ చేసిన రచ్చ గురించి చెబుతూ ఈమె నామినేట్ చేసింది. ఆ తర్వాత నరేష్ కూడా నీతూనే నామినేట్ చేస్తూ.. సాగ్ గేమ్ ఆడేటప్పుడు మీరు కొట్టారు అని చెప్పగా.. అందులో నన్ను నేను కాపాడుకున్నాను.. నన్ను అంత దారుణంగా ఈడ్చి కెళ్ళినప్పుడు మీకు పాయింట్ కనిపించలేదా.. ఇది న్యాయమా అంటూ నీతూ ప్రశ్నించగా.. నరేష్ అన్యాయం వదిలేయండి అంటూ కామెంట్ చేశారు. దీనికి త్రిగుణ్ , వంశీ వెకిలి నవ్వులు నవ్వడం కాస్త వైరల్ గా మారింది.