E-Paper
Advertisement

అంతర్జాతీయ స్థాయిలో కౌశల్ మండాకు కీలక బాధ్యతలు..30 ఏళ్ల అనుభవంలో?

అంతర్జాతీయ స్థాయిలో కౌశల్ మండాకు కీలక బాధ్యతలు..30 ఏళ్ల అనుభవంలో?
Advertisement

Kaushal Manda: 1999లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)! హీరోగా నటించిన రాజకుమారుడు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రతో వెండితెరకు పరిచయమయ్యారు కౌశల్ మండా. ఆ తర్వాత బద్రి, శ్రీరామ్, శివరామరాజు, నీ స్నేహం, ఆయుధం, నేనున్నాను, వెంకీ, అనుకోకుండా ఒకరోజు, అసాధ్యుడు, ద్రోణా, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన.. చివరిగా కన్నప్ప సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఒకవైపు తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూనే.. మరొకవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో పాల్గొని విజేతగా నిలిచారు. అలా ఈ ఒక్క షోతో రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కౌశల్.. ప్రస్తుతం బిగ్ బాస్ షోకి తనదైన శైలిలో రివ్యూలు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి కౌశల్ మండాకు అంతర్జాతీయ స్థాయిలో కీలక బాధ్యత లభించడంతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.

ఫ్యాషన్ ప్రపంచంలో నేషనల్ డైరెక్టర్ గా కౌశల్ కు కొత్త బాధ్యతలు..

అసలు విషయంలోకి వెళ్తే.. అంతర్జాతీయ స్థాయిలో గత 25 ఏళ్లుగా విశేష గుర్తింపు, ప్రజాదారణ పొందిన ప్రతిష్టాత్మక “మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్” అంతర్జాతీయ అందాల పోటీలకు అమెరికా, భారతదేశం తరఫున నేషనల్ డైరెక్టర్ గా కౌశల్ మండా ఎంపిక కావడం భారతీయులందరికీ గర్వకారణం. అటు మోడలింగ్ ఇటు ఫ్యాషన్, నటన రంగాలలో సుమారుగా 30 సంవత్సరాల అనుభవం కలిగిన కౌశల్ .. ఇప్పటివరకు వేలాది మోడలింగ్ షూట్స్ లో పనిచేయడంతో పాటు 3వేల మందికి పైగా మోడలింగ్ లో శిక్షణ అందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఫ్యాషన్ షోలు, ప్రకటనలు, అందాల పోటీలతో ఈయనకు విశేష అనుబంధం ఉంది.

ప్రతిభావంతులైన మోడల్స్ ను గుర్తించడమే పని..

Advertisement

ఇంతటి ప్రతిభ కలిగిన కౌశల్ మండాకు రెండు దేశాల నేషనల్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించడం విశేషం. ఈయన భారతదేశంతో పాటు అమెరికాలోని ప్రతిభావంతులైన మోడల్స్ ను గుర్తించి వారికి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అందించి , ప్రపంచ వేదికలపై ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దే బాధ్యతలను ఇప్పుడు ఈయన చేపట్టారు.. బాధ్యతలు చేపట్టిన వెంటనే.. రెండు దేశాల వ్యాప్తంగా వచ్చిన అనేక మంది అభ్యర్థుల ఫోటోలు, వివరాలను పరిశీలించి.. కఠినమైన పరీక్షల తర్వాత ఇప్పుడు ఈ పోటీకి భారతదేశం తరఫున ఇద్దరినీ,అమెరికా తరఫున ఒకరికి ఎంపిక చేశారు

అమెరికా తరఫున..

5 అడుగుల 8 అంగుళాల హైట్ కలిగిన మెడికల్ విద్యార్థిని తన్వి పడాలను మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ఆమె అమెరికా నుండి హైదరాబాద్ కి వచ్చి కౌశల్ మండా వద్ద మోడలింగ్ శిక్షణ పొందడం విశేషం. గత రెండు నెలలుగా ఆమెకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేశారు.

ఇండియా తరఫున ఇద్దరూ..

Advertisement

అటు ఇండియా తరఫున.. 19 సంవత్సరాల వయసున్న ఈషాన్ ఎల్డే ను ఎంపిక చేశారు.ఈయన ఆరు అడుగుల రెండు అంగుళాల హైట్ కలిగి ఉన్నారు. శారీరకంగా, మానసికంగా, మోడలింగ్ రంగానికి ఎంతో అనుకూలమైన ప్రతిభ ఉన్న ఈయన ఇటీవల నిర్వహించిన మిస్టర్ టీన్స్ సౌత్ ఇండియా పోటీలలో ఫస్ట్ రన్నరప్ గా నిలిచారు. తన ప్రతిభ , వ్యక్తిత్వం, ఫిట్నెస్ తో అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి మంచి పేరు తీసుకురాగలడనే నమ్మకంతో కౌశల్ ఈయనను ఎంపిక చేశారు. అలాగే హైదరాబాద్ కి చెందిన మెడికల్ విద్యార్థిని ఆశ్రిత నీలకంఠం ని కూడా ఈ పోటీలకు ఇండియా తరఫున ఎంపిక చేయడం జరిగింది. అద్భుతమైన వాక్చాతుర్యం, ప్రశ్నలకు సమాధానం చెప్పే విధానం , ఆత్మవిశ్వాసంతో న్యాయ నిర్నేతలను ఆకట్టుకున్న ఈమె ఇంటర్నేషనల్ స్టేజ్ పై తన ప్రతిభతో ఇండియాకు మంచి గుర్తింపు తీసుకొస్తుందనే విశ్వాసంతో ఈమెను ఎంపిక చేశారు.

ALSO READ:రామాయణంలో సీత పాత్ర పై.. అలనాటి సీత షాకింగ్ కామెంట్స్!

నేషనల్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కౌశల్ మండా రియాక్షన్..

ఇకపోతే రెండు దేశాల తరఫున నేషనల్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కౌశల్ మాట్లాడుతూ..”ఇండియాలో ఎంతోమంది ప్రతిభ కలిగిన మోడల్స్ వున్నారు. వీరికి సరైన గుర్తింపు, శిక్షణ , అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పించాలనేదే మా లక్ష్యం. గత రెండు నెలలుగా ఈ ముగ్గురు అభ్యర్థులకు ఎంతో కష్టపడి శిక్షణ అందించాము. ర్యాంప్ వాకు నుంచి ప్రశ్నోత్తరాల వరకు ప్రతి అంశం లో కూడా వీరిని సిద్ధం చేశాము. ఖచ్చితంగా వీరు తమ ప్రతిభను కనబరిచి , దేశాలకు కిరీటాలు తీసుకొస్తారని పూర్తి నమ్మకం నాకుంది”అని తెలిపారు.

Related News

Gundeninda GudiGantalu Today episode: శృతి మాటతో నీతూ షాక్.. అరుణ్ కు మైండ్ బ్లాక్.. బాలు ఏం చేస్తున్నాడు..?

Karthika Deepam 2 Serial Today Episode November 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ప్లాన్ సక్సెస్ – అయోమయంలో సూరజ్  

Podarillu Today Episode : అయ్యో.. పాపం చక్రీ.. సిగ్గుపడ్డ మాధవ్.. ఫీల్ అయిన శైలు.. ఇదే కదా ట్విస్ట్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 9th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి ఇంట్లో మిస్సమ్మను చూసిన పార్థు   

Illu Illalu Pillalu Today Episodes: నర్మద, వేదవతి ఫైట్.. వల్లి కోసం భాగ్యం టెన్షన్.. ధీరజ్ స్ట్రాంగ్ వార్నింగ్..

Brahmamudi Serial Today Episode November 9th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు చుక్కలు చూపించిన శేషు  

Intinti Ramayanam Today Episode: అవనిని చంపేందుకు పల్లవి ప్లాన్.. రమ్య ఎంట్రీతో షాక్.. భరత్ కు వార్నింగ్..

Big Stories

Advertisement
×