Konaseema Crop Loss: కోనసీమ జిల్లాలో వరుస తుపాన్లు అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీశాయి. ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి సాగు చేసిన వరి పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి రైతన్నపై పగబట్టినట్లు విరుచుకుపడింది. అర్నబ్ తుపాను ప్రభావంతో ఇప్పటికే వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరగగా.. తాజాగా మురసు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రైతుల ఆశలను నీరుగార్చాయి.
వరుస తుపాన్ల కారణంగా జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో పంట నీట మునిగింది. మరికొన్ని ప్రాంతాల్లో వరి కంకులు నీటిలో నానడంతో ధాన్యం మొలకెత్తే ప్రమాదం ఏర్పడింది. ఏళ్ల తరబడి కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి, అప్పులు చేసి సాగు చేసినా కనీసం పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.
మరోవైపు పంట నష్టంపై అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నప్పటికీ తమకు ఇప్పటివరకు ఎలాంటి పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వేలతో కాలయాపన చేయకుండా క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టాన్ని అంచనా వేసి తక్షణమే పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కొందరు రైతులు ఆత్మహత్యే శరణ్యమనే స్థాయిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read: 2027 వరల్డ్ కప్ లో టీమిండియాలో చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవడం గ్యారెంటీ