E-Paper
Advertisement

వచ్చే ఏడాది పెళ్లి.. బిగ్ బాంబ్ పేల్చిన సుప్రీత!

వచ్చే ఏడాది పెళ్లి.. బిగ్ బాంబ్ పేల్చిన సుప్రీత!
Advertisement

Supritha:నటి సురేఖా వాణి కూతురు సుప్రీత (Supritha)సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో పెద్దగా నటించకపోయినా, తన గ్లామర్ ఫోటోలతో నెట్టింట ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. తాజాగా ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఒక పాడ్‌కాస్ట్ షో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమోలో సుప్రీత తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో చూద్దాం.

అషు రెడ్డితో ఇంటర్వ్యూలో ఆసక్తికర చర్చ:

సుప్రీత నిర్వహిస్తున్న టాక్ షో లేటెస్ట్ ఎపిసోడ్‌లో సోషల్ మీడియా స్టార్ అషూరెడ్డి (Ashu Reddy)అతిథిగా వచ్చారు. ఇద్దరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో పెళ్లి టాపిక్ వచ్చింది. ఇకపై ఎక్కువ కాలం సింగిల్ గా ఉండలేనని, వచ్చే ఏడాది లేదా ఏడాదిన్నరలోపు తాను కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు సుప్రీత బాంబ్ పేల్చింది. ఇది విన్న వెంటనే అషు రెడ్డి ఆశ్చర్యపోయి, “అసలు నువ్వు సింగిల్ గా ఎక్కడున్నావో కొంచెం చెప్పు” అంటూ సరదాగా కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ సరదా సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

డబ్బులు, ట్రిప్‌లపై నిత్యం ట్రోల్స్:

Advertisement

సురేఖా వాణి, సుప్రీత ట్రిప్స్ కి వెళ్లడం, విదేశీ ప్రయాణాలు చేయడంపై నెటిజన్లు ఎప్పుడూ రకరకాల కామెంట్లు చేస్తుంటారు. సినిమాలు చేయకుండా వీళ్లకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటూ చాలాసార్లు ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా తమ లైఫ్‌ను తమకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ తల్లికూతుళ్లు. ఇక ఇటీవల సురేఖా వాణి వ్యక్తిగత వీడియోల విషయంలో సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

ALSO READ:వెయిటింగ్ ఈజ్ ఓవర్.. వెండితెరపై కలుద్దాం: యాంకర్ శివ జ్యోతి!

త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న సుప్రీత? :

Advertisement

సోషల్ మీడియాలో ఎప్పుడూ గ్లామర్‌తోనూ, బోల్డ్ కామెంట్లతోనూ రచ్చ చేసే సుప్రీత, ఇప్పుడు ఏకంగా పెళ్లి గురించి ఓపెన్‌గా మాట్లాడటంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక త్వరలోనే ఆమె తన పెళ్లి గురించిన గుడ్ షాక్ ఇస్తుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.మరి సుప్రీత చెప్పినట్టుగానే వచ్చే ఏడాది ఆమె పెళ్లి పీటలెక్కుతుందా, లేక ఇది కేవలం షో కోసం సరదాగా చెప్పిన మాట అనేది త్వరలోనే తెలియనుంది. ఏదేమైనా సుప్రీత చేసిన ఈ పెళ్లి ప్రకటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్‌గా మారింది.

సుప్రీత కెరియర్:

సుప్రీత కెరియర్ విషయానికి వస్తే.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా మంచి పేరు దక్కించుకున్న ఈమె.. సురేఖ వాణి కూతురుగా మరింత ఆదరణ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ఈమె.. 2019లో వచ్చిన ‘మనీ మైండెడ్ గర్ల్ ఫ్రెండ్’ అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ‘వెళ్ళిపో’, ‘గాయత్రి పోతే పోవే’ వంటి మ్యూజిక్ వీడియోలలో కూడా నటించింది. ఇక ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరితో ‘చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక అలాగే కార్తీక్ – అర్జున్ దర్శకత్వం వహించిన లేడీ ఓరియంటెడ్ కామెడీ మూవీ ‘లేచింది మహిళా లోకం’లో కూడా ఈమె నటించింది.

Related News

అలీ వైఫ్ జుబేదా యూట్యూబ్ ఆదాయం ఎంతో తెలుసా?

వెయిటింగ్ ఈజ్ ఓవర్.. వెండితెరపై కలుద్దాం: యాంకర్ శివ జ్యోతి!

సుదీర్ లక్షలు సంపాదిస్తున్న రూపాయి కూడా లేదా?అంతా అతని చేతుల్లోనే ?

అలా ఈడ్చుకెళ్తుంటే కనిపించలేదా మీకు.. నరేష్ పై నీతూ మాస్టర్ ఫైర్!

నేను లేకపోతే కెప్టెన్ కాదు కదా కంటెండర్ షిప్ కూడా కాలేవ్.. ముఖేష్ కౌంటర్!

జాను లిరి అంటేనే ఫోక్ సాంగ్స్‌కు ఫుల్ జోష్.. ఒక్కో పాటకు కోట్ల వ్యూస్!

అంతర్జాతీయ స్థాయిలో కౌశల్ మండాకు కీలక బాధ్యతలు..30 ఏళ్ల అనుభవంలో?

Big Stories

Advertisement
×