boAt Chrome Horizon: ప్రస్తుత డిజిటల్ యుగంలో .. స్మార్ట్‌వాచ్ అనేది కేవలం సమయం చూసే గాడ్జెట్‌గా మాత్రమే కాదు, ఇదొక స్టైల్ స్టేట్‌మెంట్‌గా, హెల్త్ ట్రాకర్‌గా మన డైలీ లైఫ్ స్టైల్ లో కీలక భాగమైపోయింది. చేతికి.. అందమైన గడియారం ఉండటంతో.. పాటు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే టెక్నాలజీ ఉంటే ఆ మజానే వేరు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆడియో , వేరబుల్స్ బ్రాండ్ ‘బోట్’మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన మోడల్ ‘బోట్ క్రోమ్ హారిజాన్’. బెస్ట్ ఫీచర్లు, ప్రీమియం లుక్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌వాచ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ప్రీమియం ఫీచర్లు ఉన్న స్మార్ట్ వాచ్‌లు చాలా ఖరీదుగా ఉంటాయి. కానీ బోట్ కంపెనీ యూజర్లు బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ వాచ్‌ను ఆకర్షణీయమైన ధరకు అందించింది. మార్కెట్లో ..ఈ బోట్ క్రోమ్ హారిజాన్ స్మార్ట్‌వాచ్ ధర కేవలం రూ.2,949 మాత్రమే ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో వివిధ సేల్స్, బ్యాంక్ ఆఫర్లతో ఇది మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. తక్కువ ధరలో. ప్రీమియం ఫీల్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
ఈ స్మార్ట్‌వాచ్ ప్రధాన ఆకర్షణ దీని డిజైన్. ఇది ప్రీమియం మెటల్ బాడీతో.. తయారైంది, దీని వల్ల చేతిపై ఉన్నప్పుడు చాలా రాయల్ లుక్ వస్తుంది. ముఖ్యంగా స్టీల్ బ్లాక్ కలర్ వేరియంట్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే..ఇందులో 1.51 ఇంచుల (3.83 సెం.మీ) పెద్దదైన అమోలెడ్ రౌండ్ డిస్‌ప్లేను ఇచ్చారు. అమోలెడ్ స్క్రీన్ కారణంగా ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇందులో ఉన్న ‘వీడియో వాచ్ ఫేసెస్’ఆప్షన్ వాచ్‌కు మరింత మోడర్న్ లుక్‌ను ఇస్తుంది.
ఆరోగ్య స్పృహ ఉన్నవారికి.. ఈ వాచ్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో లేటెస్ట్ హెచ్‌ఆర్‌వి, విఓ2 మాక్స్ ట్రాకింగ్ ఆప్షరన్లు కూడా ఉన్నాయి. ఇవి మీ గుండె పనితీరును, శారీరక సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తాయి. అంతేకాకుండా, స్లీప్ మానిటరింగ్, హార్ట్ రేట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ వంటి అన్ని హెల్త్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆటో-యాక్టివిటీ డిటెక్షన్ ఫీచర్ ద్వారా మీ వర్కౌట్లు, రన్నింగ్ వంటి యాక్టివిటీస్ ఆటోమేటిక్‌గా రికార్డ్ అవుతాయి.
Also Read: క్లాసిక్ లుక్‌తో..బ్లూటూత్ స్పీకర్,రూ.వెయ్యిలోపు బెస్ట్ ఛాయిస్
స్మార్ట్‌వాచ్‌లలో.. బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. ఈ విషయంలో.. బోట్ క్రోమ్ హారిజాన్ ఎంతో ఆకట్టుకుంటుంది. ఇందులో.. ఉన్న ASAP ఛార్జ్ టెక్నాలజీ కారణంగా.. వాచ్ చాలా తక్కువ సమయంలోనే.. వేగంగా ఛార్జ్ అవుతుంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. సాధారణ వాడకంలో రోజంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేస్తుంది. రోజువారీ ఆఫీస్ పనులకు, జిమ్ చేసే వారికి, రన్నింగ్ చేసే వారికి ఈ వాచ్ చక్కగా సరి పోతుంది.
బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉండటం వల్ల ఫోన్ చేతిలో లేకపోయినా వాచ్ ద్వారానే నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు. నోటిఫికేషన్లు, సోషల్ మీడియా అలర్ట్స్ క్షణాల్లో.. మీ చేతికి అందుతాయి. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉండటం వల్ల.. వర్షంలో తడిచినా లేదా చెమట పట్టినా ఎలాంటి సమస్య ఉండదు.
రూ. 3,000 బడ్జెట్‌లో ప్రీమియం మెటల్ బాడీ, అమోలెడ్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ హెల్త్ ఫీచర్లు కోరుకునే.. వారికి ‘బోట్ క్రోమ్ హారిజాన్’ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ వీకెండ్ లో ఒక మంచి స్మార్ట్‌వాచ్ కొనాలని చూస్తున్నట్లయితే దీన్ని నిరభ్యంతరంగా కొనొచ్చు!