E-Paper
Advertisement

సుదీర్ లక్షలు సంపాదిస్తున్న రూపాయి కూడా లేదా?అంతా అతని చేతుల్లోనే ?

సుదీర్ లక్షలు సంపాదిస్తున్న రూపాయి కూడా లేదా?అంతా అతని చేతుల్లోనే ?
Advertisement

Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. స్టాండప్ కమెడియన్ గా మొదలైన ఈయన ప్రయాణం నేడు వెండితెరపై హీరోగా కొనసాగుతూ ఉంది. స్టాండప్ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ అనంతరం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇలా జబర్దస్త్ ద్వారా మంచి సక్సెస్ అందుకున్న ఈయన అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా అవకాశాలను అందుకున్నారు. ఇలా బుల్లితెర స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ అనంతరం సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

సంపాదన మొత్తం తండ్రి చేతుల్లోనే..

ఈయన హీరోగా ఇదివరకే పలు సినిమాలలో నటించారు. త్వరలోనే ఈయన హీరోగా నటించిన G.O.A.T సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాంకర్ సుమతో కలిసి సుధీర్ (Sudigali Sudheer)ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో భాగంగా సుమ సుధీర్ కి సంబంధించి ఒక విషయాన్ని బయటపెట్టారు. ఫ్రెండ్స్ తో కలిసి సుధీర్ ఎక్కడికైనా బయటకు వెళ్తే బిల్ ఫ్రెండ్స్ కట్టాల్సిందేనట నిజమేనా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుదీర్ సమాధానం చెబుతూ అవునని తెలిపారు.

పిన్ నంబర్ కూడా తెలియదు..

Advertisement

తాను ఇండస్ట్రీలో ఉండి సంపాదిస్తున్నది మొత్తం తన వద్ద ఒక రూపాయి కూడా పెట్టుకోనని, మొత్తం తన తండ్రికి ఇచ్చేస్తానని సుదీర్ తెలిపారు. ఇక నాన్నే ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటారు. అలా నాన్న బాధ్యతలు చూసుకోవడం వల్ల నేను కూడా నా కెరియర్ పై ఫోకస్ పెట్టగలిగానని సుదీర్ తెలిపారు. ఇక నాకు ఏదైనా అవసరమైతే కచ్చితంగా నాన్నను అడిగే డబ్బు తీసుకుంటానని తెలిపారు. ఇక ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లినప్పుడు కార్డ్ తీసుకెళ్తాను కానీ పిన్ నెంబర్ కూడా నాకు తెలియదని, నాన్నకు ఫోన్ చేసే అడుగుతానని తెలిపారు.

పార్టీలకు వెళితే ఫ్రెండ్స్ బిల్లు కట్టాలి..

ఇక ఫ్రెండ్స్ తో కలిసి ఏదైనా లేట్ నైట్ పార్టీలకు వెళ్తే అప్పుడు మాత్రం ఫ్రెండ్స్ ని బిల్ పే చేయమని చెబుతాను అంటూ సుధీర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా తన సంపాదన మొత్తం తన తండ్రి చేతుల్లోనే ఉంటుందనీ, ప్రతి రూపాయి నాన్నను అడిగి తీసుకుంటాను అంటూ ఈయన మాట్లాడటంతో ఈ కామెంట్స్ విన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.. సుధీర్ లక్షలు సంపాదిస్తున్న రూపాయి కూడా తన చేతుల్లో ఉండదా? అని నాన్నని అడిగే తీసుకుంటారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: ‘రామాయణ’ పై వర్మ రివ్యూ… మొరిగే కుక్కలంటూ !

Related News

వెయిటింగ్ ఈజ్ ఓవర్.. వెండితెరపై కలుద్దాం: యాంకర్ శివ జ్యోతి!

అలా ఈడ్చుకెళ్తుంటే కనిపించలేదా మీకు.. నరేష్ పై నీతూ మాస్టర్ ఫైర్!

నేను లేకపోతే కెప్టెన్ కాదు కదా కంటెండర్ షిప్ కూడా కాలేవ్.. ముఖేష్ కౌంటర్!

జాను లిరి అంటేనే ఫోక్ సాంగ్స్‌కు ఫుల్ జోష్.. ఒక్కో పాటకు కోట్ల వ్యూస్!

అంతర్జాతీయ స్థాయిలో కౌశల్ మండాకు కీలక బాధ్యతలు..30 ఏళ్ల అనుభవంలో?

Gundeninda GudiGantalu Today episode: శృతి మాటతో నీతూ షాక్.. అరుణ్ కు మైండ్ బ్లాక్.. బాలు ఏం చేస్తున్నాడు..?

Karthika Deepam 2 Serial Today Episode November 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ప్లాన్ సక్సెస్ – అయోమయంలో సూరజ్  

Big Stories

Advertisement
×