E-Paper
Advertisement

వెయిటింగ్ ఈజ్ ఓవర్.. వెండితెరపై కలుద్దాం: యాంకర్ శివ జ్యోతి!

వెయిటింగ్ ఈజ్ ఓవర్.. వెండితెరపై కలుద్దాం: యాంకర్ శివ జ్యోతి!
Advertisement

Anchor Shiva Jyothi:ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో, కలలతో అడుగుపెట్టే ప్రతి ఒక్కరు వెండితెరపై ఒక్కసారైనా తమను తాను చూసుకోవాలని ఎంతో పరితపిస్తూ ఉంటారు. అందుకోసం ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆ సమయం ఆసన్నమైనప్పుడు వారి ముఖంలో కనిపించే ఆ తేజస్సు వర్ణనాతీతం. అలా దాదాపు ఎన్నో సంవత్సరాల ఎదురుచూపు తర్వాత తొలిసారి తనను తాను వెండితెరపై చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ యాంకర్ శివజ్యోతి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తొలిసారి వెండితెరపై సందడి చేయబోతున్న సావిత్రి..

ఇకపోతే వెండితెరపై కనిపించడం కోసం దాదాపు దశాబ్ద కాలానికి పైగా టీవీ షోలు, సినిమా ఈవెంట్లు చేసి యాంకర్ గా ప్రూవ్ చేసుకున్న స్రవంతి చొక్కారపు (Sravanthi chokkarapu)ఎట్టకేలకు సుహాస్ ‘హే బలవంత్’ సినిమాతో వెండితెరపై కనిపించి తన కోరికను నెరవేర్చుకుంది. ఇప్పుడు ఆమె బాటలోనే శివ జ్యోతి (Shiva Jyothi) కూడా అడుగులు వేసింది. తీన్మార్ సావిత్రి గా అందరికీ పరిచయమైన ఈమె.. తన విలక్షణమైన తెలంగాణ యాసతో, వార్త వ్యంగ్యంతో, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆకర్షణీయమైన ప్రదర్శనతో ప్రాంతీయంగా మంచి పేరు తెచ్చుకుంది. ఇస్మార్ట్ న్యూస్ తో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇకపోతే టీవీ షోలతో ఒక మోస్తారుగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొని, రెండు తెలుగు రాష్ట్రాలలో అసాధారణమైన ఆదరణను సొంతం చేసుకుంది.

ఇడుపు కాయితం సినిమాతో వెండితెరకు పరిచయం..

Advertisement

ఇక ఈ షో తర్వాత చిన్న చిన్న ఈవెంట్లు, పండుగ స్పెషల్ ఈవెంట్లు, షోలు , సిరీస్ లు అంటూ కాలం గడుపుతున్న ఈమె.. ఇంతవరకు సినిమాలలో నటించలేదు. అయితే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ప్రియదర్శి, నాగదుర్గ కాంబినేషన్లో డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఇడుపుకాయితం. ఇప్పటికే ఈ సినిమా నుండి “బారాత్ బీట్స్” అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో నాగదుర్గ తన మాస్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఇందులోనే శివ జ్యోతి పాత్రను కూడా రివీల్ చేశారు. ఇందులో శివజ్యోతి ప్రియదర్శికి అక్క పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది.

ALSO READ:అలా ఈడ్చుకెళ్తుంటే కనిపించలేదా మీకు.. నరేష్ పై నీతూ మాస్టర్ ఫైర్!

మాస్ స్టెప్పులతో శివ జ్యోతి పోస్టర్..

Advertisement

ఆమె కూడా చీరకట్టులో తీన్మార్ స్టెప్పులు వేస్తున్నట్టుగా తన పోస్టర్ ను ఇన్స్టా లో షేర్ చేయడంతో పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లు, టీవీ సెలబ్రిటీలు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మొత్తానికైతే వెండితెరపై కనిపించాలనే ఎదురుచూపు.. ఈ సినిమాతో పూర్తయింది. “డిసెంబర్ 11న థియేటర్లలో కలుద్దాం” అంటూ శివజ్యోతి ఇచ్చిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్న ఈమె.. వెండితెరపై తన అసాధారమైన ప్రతిభతో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

?utm_source=ig_web_copy_link&psln=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

Related News

సుదీర్ లక్షలు సంపాదిస్తున్న రూపాయి కూడా లేదా?అంతా అతని చేతుల్లోనే ?

అలా ఈడ్చుకెళ్తుంటే కనిపించలేదా మీకు.. నరేష్ పై నీతూ మాస్టర్ ఫైర్!

నేను లేకపోతే కెప్టెన్ కాదు కదా కంటెండర్ షిప్ కూడా కాలేవ్.. ముఖేష్ కౌంటర్!

జాను లిరి అంటేనే ఫోక్ సాంగ్స్‌కు ఫుల్ జోష్.. ఒక్కో పాటకు కోట్ల వ్యూస్!

అంతర్జాతీయ స్థాయిలో కౌశల్ మండాకు కీలక బాధ్యతలు..30 ఏళ్ల అనుభవంలో?

Gundeninda GudiGantalu Today episode: శృతి మాటతో నీతూ షాక్.. అరుణ్ కు మైండ్ బ్లాక్.. బాలు ఏం చేస్తున్నాడు..?

Karthika Deepam 2 Serial Today Episode November 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ప్లాన్ సక్సెస్ – అయోమయంలో సూరజ్  

Big Stories

Advertisement
×