Gen Z Slang: ఒకసారి ఊహించుకోండి.. మీరు ఒక పార్టీకి వెళ్లారు. కొత్త డ్రెస్సు, కొత్త షూస్, పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్… అద్దం ముందు గంటలు గంటలు కష్టపడి రెడీ అయ్యారు. అక్కడికి వెళ్లాక అందరి చూపు మీ మీదే ఉంటుందని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. కానీ అప్పుడే సీన్‌లోకి మీ ఫ్రెండ్ ఎంట్రీ ఇచ్చాడు. అతను పెద్దగా ఏమీ చేయలేదు. సింపుల్‌గా వచ్చాడు. కానీ అందరి అటెన్షన్ మాత్రం అతని వైపే వెళ్లిపోయింది. మీ స్టైలింగ్, మీ లుక్, మీ ఓవర్ కాన్ఫిడెన్స్… అన్నీ ఒక్కసారిగా సైడ్ అయిపోయాయి. అప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూసి ఒక మాట అంటాడు… బ్రో.. హీ ఈజ్ మాగింగ్ యూ.. అని. ఇప్పుడు ఈ మాట వింటే ఏదో కొత్తగా తిడుతున్నాడనుకోకండి. ఎందుకంటే ఇదే ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ట్రెండింగ్ స్లాంగ్. దీని పేరే… మాగింగ్. అసలు ఈ మాగింగ్ అంటే ఏంటి? ఒక వ్యక్తి మరొకరిని ఎలా మాగ్ చేస్తాడు? దీనికి కాలిన్స్ డిక్షనరీ ఏకంగా వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎందుకు గుర్తింపు ఎందుకిచ్చింది? ఈ జెన్ జీ పదం వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ కథేంటో తెలుసుకుందాం.
మాగింగ్ అంటే ఏంటి..?
ముందుగా అసలు మాగింగ్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే… ఎదుటివారిని మించిపోవడం. వాళ్ల కంటే ఎక్కువగా అట్రాక్ట్ చేయడం.. వాళ్లతో పోలిస్తే మనమే ఎక్కువ ఇంప్రెసివ్‌గా కనిపించడం. అంటే ఒకరిని ఔట్ షైన్ చేయడం లేదా ఔట్ పర్ఫామ్ చేయడమే మాగింగ్. ఇది కేవలం అందం గురించి మాత్రమే కాదు. స్టైల్, ఫిజిక్, కాన్ఫిడెన్స్, టాలెంట్, పర్ఫార్మెన్స్… ఇలా ఏ విషయంలోనైనా ఒకరు మరొకరిని డామినేట్ చేస్తే దాన్ని మాగింగ్ అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే… మీరు హీరో అనుకుంటున్న సీన్‌లో ఇంకొకరు వచ్చి మొత్తం స్క్రీన్ ప్రెజెన్స్‌ను తీసేసుకోవడమే మాగింగ్.
మాగింగ్ అనే పదం ఎప్పుడు పుట్టింది..
అయితే ఈ పదం నిన్నో మొన్నో పుట్టింది కాదు. మాగింగ్ అనే పదానికి మూలం AMOG. అంటే అల్ఫా మేల్ ఆఫ్ ది గ్రూప్. 2010ల టైమ్‌లో ఆన్‌లైన్ బాడీబిల్డింగ్ కమ్యూనిటీల్లో ఈ పదం ఎక్కువగా వినిపించేది. ఒక జిమ్‌లో అందరికంటే ఎక్కువ ఫిజికల్ డామినెన్స్ ఉన్న వ్యక్తిని సూచించడానికి దీన్ని ఉపయోగించేవారు. తర్వాత ఈ పదం కొన్ని ఆన్‌లైన్ కమ్యూనిటీల్లోకి వెళ్లింది. ఆ తర్వాత ఇది నౌన్ నుంచి వెర్బ్‌గా మారింది. అంటే ఎవరో ఒకరిని Mog చేయడం అనే అర్థంలో వాడటం మొదలైంది.
అసలు ట్విస్ట్ ఏంటంటే..
కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే… ఒకప్పుడు జిమ్‌లకు, ఫిజికల్ అప్పియరెన్స్‌కు ఉపయోగించే ఈ వర్డ్.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని కొత్త టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఒక అమ్మాయి తన ఫ్రెండ్ కంటే స్టైలిష్‌గా కనిపించినా మాగింగ్ అంటున్నారు. ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ పాత ఫోన్‌ను మించిపోయినా మాగింగ్ అంటున్నారు. ఒక కొత్త సినిమా పాత సినిమాకు మించి క్రేజ్ సంపాదించినా ఇదే పదం వాడుతున్నారు. అంటే ఫిజికల్ డామినెన్స్ నుంచి డిజిటల్ డామినెన్స్ వరకు ఈ పదం ట్రావెల్ చేసిందన్నమాట.
ఈ ఒక్క పదానికి ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?
మరి ఈ ఒక్క పదానికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే.. సోషల్ మీడియా కల్చర్ అనే చెప్పాలి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్‌టాక్ ట్రెండ్స్, మీమ్స్, ఫ్యాషన్ వీడియోస్… వీటన్నింటిలోనూ కంపారిజన్ చాలా కామన్ అయిపోయాయి. ఎవరి లుక్ బాగుంది? ఎవరి ఫిజిక్ బాగుంది? ఎవరి స్టైల్ బాగుంది? ఎవరి పర్ఫార్మెన్స్ టాప్‌లో ఉంది? ప్రతిదానికీ ఒక కంపారిజన్. ఇలాంటి సందర్భాల్లో పెద్ద పెద్ద వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేకుండా… ఒక్క మాగింగ్ అనే పదంతో మొత్తం సీన్‌ను చెప్పొచ్చు అన్నమాట.
వరల్డ్ వైడ్‌గా పాపులర్
ఇలా ఇంత ట్రెండ్ అయ్యింది కాబట్టే.. కాలిన్స్ డిక్షనరి కూడా ఈ ట్రెండ్‌ను గుర్తించింది. 2026లో మాగింగ్‌ను తన వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా అనౌన్స్ చేసింది. ఈ పదం వాడకం ఈ ఏడాది 210 శాతం పెరిగినట్లు అసోసియేటెడ్ ప్రెస్ చెబుతోంది. ఇది కేవలం ఒక స్లాంగ్ పాపులారిటీ మాత్రమే కాదు. సోషల్ మీడియా ఒక పదాన్ని ఎంత వేగంగా వరల్డ్ వైడ్‌గా పాపులర్ చేయగలదో చెప్పడానికి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మాగింగ్‌ని డెయిలీ లైఫ్‌లో కూడా బాగా యూజ్ చేస్తున్నారు. ఫస్ట్.. Fashion Mogging. Spotlight Mogging.. Gym Mogging.. Gaming Mogging.. Food Mogging.. ఇలా చూస్తే.. మన లైఫ్‌లో ఎక్కడైనా కంపారిజన్ కనిపిస్తే అక్కడ మాగింగ్ అనే పదాన్ని ఉపయోగించే అవకాశం ఉందన్నమాట.
మరిన్ని ఇంట్రెస్టింగ్ పదాలు..
ఇక కాలిన్స్ డిక్షనరీలో మాగింగ్ ఒక్కటే లేదు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ పదాలు కూడా షార్ట్‌లిస్ట్‌లో ఉన్నాయి. Friendslop అంటే ఫ్రెండ్స్ ఒకరికొకరు షేర్ చేసుకునే సరదా, కొన్నిసార్లు అర్థంపర్థం లేని వీడియోలు, కంటెంట్‌ను సూచిస్తుంది. Ghost Job… అంటే ఆ జాబ్‌ను ఫీల్ చేయరు కానీ.. అనౌన్స్ చేస్తారు. కార్ స్ప్రెడ్డింగ్.. ఫైర్ వేవ్.. డూమ్.. ఇలాంటి పదాలు కూడా షార్ట్‌లిస్ట్‌లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మాగింగ్ అనే వర్డ్‌ను సరదాగా ఉపయోగిస్తే ఓకే.. బట్.. రియల్ లైఫ్‌లోఒకరిని తక్కువ చేసి మాట్లాడటానికి ఉపయోగించకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఒకరు మరొకరిని Mog చేశారని చెప్పడం వల్ల రెండో వ్యక్తి విలువ తగ్గిపోదు.. బట్.. కొందరు హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
Gen Z ఇంటర్నెట్ లాంగ్వేజ్‌లోకి ఎంట్రీ
చివరిగా ఒక్క మాట… ఒకప్పుడు మనం అదరగొట్టేశావ్ బ్రో’ అనేవాళ్లం. ఇప్పుడు You totally mogged everyone అంటున్నారు. ట్రెండ్స్ మారుతున్నాయి… స్లాంగ్స్ మారుతున్నాయి… కానీ ఎదుటివారిని ఇంప్రెస్ చేయాలనే మనుషుల ఆలోచన మాత్రం మారడం లేదు.. సో.. నెక్స్ట్ టైమ్ మీ ఫ్రెండ్ మీకంటే బాగా రెడీ అయి వస్తే బాధపడకండి. ఒక చిన్న స్మైల్ ఇచ్చి చెప్పండి.. Okay bro… Today youre mogging me అనేయండి. అంతే… మీరు కూడా Gen Z ఇంటర్నెట్ లాంగ్వేజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసినట్టే.
Also Read: యూపీలో తీవ్ర విషాదం.. రీల్స్ చేసే ఇద్దరు మైనర్ బాలికలు ఒకే చెట్టుకు ఉరి! అసలేం జరిగింది?