Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్నతో ఐస్‌క్రీమ్ తిన్న విషయం మాలిని సూరజ్‌ను అడిగి దక్షిణమూర్తి ముందు తిట్టడంతో సూరజ్ హర్ట్ అవుతాడు. రూంలోకి వెళ్లి జ్యోత్స్నకు కాల్ చేస్తాడు. మీ అమ్మ రోడ్డు మీద గొడవ చేసింది చాలక మళ్లీ మా అమ్మకు ఫోన్ చేసి తిట్టిందట అంటూ సూరజ్ ప్రశ్నిస్తే.. మా అమ్మ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. తన కూతురు ఎవరితోనో రోడ్డు పక్కన ఐస్‌క్రీమ్ తినడం చూసిన ఏ తల్లైనా అలాగే రియాక్ట్ అవుతుంది. అదే కాదు నిన్నటి సంఘటన చూసిన తర్వాత ఇంట్లో వాళ్లు నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు.
పెళ్లి చేసుకోకపోతే బాగుండని వార్నింగ్ కూడా ఇచ్చారు అంటూ జ్యోత్స్న చెప్పగానే.. సూరజ్ గుండె వేగం పెరుగుతుంది. అందుకు నువ్వేం చెప్పావు అంటూ జ్యోత్స్నను అడిగితే.. చేసుకుంటాను సంబంధాలు చూడండి అన్నాను అంటూ జ్యోత్స్న అబద్దం చెబితే.. సూరజ్ మాత్రం బాధతో విలవిలలాడుతుంటాడు. వెంటనే జ్యోత్స్న అలా అంటాను అనుకున్నావా..? అలా అస్సలు అనను.. అనలేదు.. అవును నేను నిన్ను కలిసిన ప్రతిసారి మీ అమ్మ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతుంది. నేను ఎక్కడ నిన్న ఎగరేసుకుపోతానోనని భయం అనుకుంటా అందుకే నిన్ను ఫాలో అవ్వమని సీక్రెట్‌గా ఒకరిని పెట్టింది. ఆ వ్యక్తే మనం కలిసిన ప్రతి విషయం చెప్తున్నాడు మీ అమ్మకు అయినా మీ అమ్మ స్వార్థం వల్లే నీకు మనఃశాంతి లేకుండా పోయింది అంటూ జ్యోత్స్న తిడితే.. సూరజ్ కూడా జ్యోత్స్న వాళ్ల అమ్మను తిడతాడు సూరజ్.
కార్తీక్, దీప చెబితే జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంటుందని పారిజాతం వెళ్లి అడుగుతుంది. మీ వల్లే జ్యోత్స్న ఇలా మారిపోయింది. అద పాత జ్యోత్స్నలా ఉంటే బాగుండేది కానీ సూరజ్ ప్రేమించడం వల్లే ఇదంతా జరిగింది. జ్యోత్స్నకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది. మీరే అంటూ పారిజాతం తిడుతుంది. ఎలాగైనా జ్యోత్సన్న మార్చేసి తను పెళ్లి చేసుకునేలా చేస్తానని అంటుంది పారిజాతం. అందుకు కార్తీక్ కోపంగా అసలు జ్యోత్స్న జీవితం ఇలా కావడానికి కారణం నువ్వే ఆ రోజు హాస్పిటల్‌లో జ్యోత్స్న, దీపలను మార్చకుండా ఉండాల్సింది. పెళ్లిలో సూరజ్ సుమిత్ర, దశరథల కూతురుకు తాళి కట్టనని వెళ్లిపోతున్నప్పుడు జ్యోత్స్న వాళ్ల కూతురు కాదన్న నిజం చెప్పాల్సింది అంటే.. మరి పెళ్లిలో మీరెందుకు నిజం చెప్పలేదు అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది పారిజాతం. ఆ నిజం ఇప్పుడు చెప్పినా ఫలితం లేదని జ్యోత్స్నను మార్చే ప్రయత్నం మాత్రం చేయకని కార్తీక్ చెబితే.. తప్పకుండా జ్యోత్స్నను మారుస్తానని అంటుంది పారిజాతం.
జ్యోత్స్న రెస్టారెంట్‌తో ఢీల్ సెట్ చేసుకోవడానికి నేషనల్ ఇన్వెస్టర్లు వస్తున్నారని ఈ ఢీల్ తనకు ఎంతో ఇంపార్టెంట్ అని దీప, జ్యోత్స్స, మాలినిలకు చెప్తాడు సూరజ్. ఆ ఇన్వెస్టర్లు ఇక్కడకు వచ్చి డీల్ ఓకే చేసుకుని వెళ్లే వరకు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ఇద్దరిపై ఉందని దీప, జ్యోత్స్నలకు చెప్తాడు సూరజ్. తర్వాత ఆ ఇన్వెస్టర్లు వస్తున్నారని తెలిసి వాళ్లకు స్వాగతం పలికేందుకు జ్యోత్స్న, దీప వెళ్తుంటారు. మాలినిని కూడా రమ్మంటే మీతో వస్తే నాకు విలువ ఉండదని వెళ్లదు.
దీప, జ్యోత్స్న వెళ్తారు. వాళ్లు రాగానే.. దీప తనను పరిచయం చేసుకుని జ్యోత్స్నను పరిచయం చేస్తుంది. ఆ ఇన్వెస్టర్లలో ఒకడు.. జ్యోత్స్నను చూసి ఇంప్రెస్ అవుతాడు. చూడ్డానికి చాలా అందంగా ఉందని మనసులో అనుకుంటాడు. తర్వాత వాళ్లను ఒక చాంబర్‌లో కూర్చోబెడతారు. దీప ఫైల్స్ జ్యోత్స్నకు ఇచ్చి వాళ్లకు ఎక్స్‌ప్లైన్ చేయమని చెప్తుంది. ఫైల్ తీసుకుని వెళ్లిన జ్యోత్స్నతో ఒక ఇన్వెస్టర్ మిస్ బిహేవ్ చేస్తాడు. మీ చైర్మన్ నే సుఖపెడతావా..? నన్ను కూడా సుఖపెట్టు నీకెంత కావాలంటే అంత ఇస్తాను అంటూ మాట్లాడతాడు. జ్యోత్స్స వాడిని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.