Mohammad Yousuf On IND VS PAK: పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా (Pakistan vs. Team India) మధ్య జరిగే మ్యాచ్ ల గురించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ యూసఫ్ (Mohammad Yousuf ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో టీమిండియా పై వన్ సైడెడ్ గా పాకిస్తాన్ మ్యాచ్ లు గెలిచేదని… కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని బాంబు పేల్చారు. 2021 సంవత్సరంలో టీమిండియాను పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఓడించిందని… ఆ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి చాలా హీనంగా తయారైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021 లో టీమిండియా ఓటమి.. పాకిస్తాన్ పతనానికి కారణమైందని హాట్ కామెంట్స్ చేశారు మహ్మద్ యూసఫ్. దీంతో మహమ్మద్ యూసఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఈ మధ్యకాలంలో ప్రతి మ్యాచ్ లో టీమ్ ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రైవల్వరీపైన మహమ్మద్ యూసఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2021 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా దుబాయ్ లో టీమిండియాపై పాకిస్తాన్ పది వికెట్ల తేడాతో విజయం సాధించిందని గుర్తు చేశారు. ఈ విజయం తర్వాత పాకిస్తాన్ పతనానికి పునాది పడిందని హాట్ కామెంట్స్ చేశారు.
ఆ ఒకే ఒక్క మ్యాచ్ గెలవడానికి చాలా కృషి చేశామని, విజయం తర్వాత మేమే హీరోలమని భావించడం ఆటగాళ్లు మొదలు పెట్టారని వెల్లడించారు. టీమిండియాను ఓడించామన్న గర్వం పాకిస్తాన్ ప్లేయర్లకు ఎక్కిందని హాట్ కామెంట్స్ చేశారు. 10 వికెట్ల తేడాతో ఓడించామన్న పొగరు కూడా తలకెక్కిందని ఫైర్ అయ్యారు. దీంతో కొమ్ములు వచ్చిన వాళ్ళ లాగా పాకిస్తాన్ ప్లేయర్లు.. కాలర్ ఎగరేసి మరీ, గొప్పలు చెప్పుకున్నట్లు గుర్తు చేశారు. ఇక ఆ తర్వాత అదే పొగరు చూపించడంతో పాకిస్తాన్ పతనం మొదలైందని వివరించారు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఐకమత్యమనేదే కరువైందని మహమ్మద్ యూసఫ్ బాంబు పేల్చారు. ఒకడంటే మరొకడికి పడదని.. ఒకడు ఎదుగుతుంటే… వాడి వెనకాలే గోతులు తీస్తారని బాంబు పేల్చారు. ముఖ్యంగా పాకిస్తాన్ కెప్టెన్సీ కోసం చాలా మంది పోటీ పడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఈ కెప్టెన్సీ కోసం డ్రెస్సింగ్ రూమ్ లోనే తన్నుకునే పరిస్థితిలు కూడా చాలా సార్లు చోటు చేసుకున్నట్లు వ్యాఖ్యానించారు. ఇప్పటికీ కెప్టెన్సీ కోసం బాబర్ ఆజం ( Babar Azam) అటు షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) తనుకుంటూనే ఉన్నారు అంటూ ఫైర్ అయ్యారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, మాత్రం పాకిస్తాన్ క్రికెట్ అంతరించిపోవడం గ్యారెంటీ అని హెచ్చరించారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ యూసఫ్ (Mohammad Yousuf ).