E-Paper
Advertisement

ఆ సినిమాలో రమ్యకృష్ణ కంటే నేనే చేసుంటే బాగుండేది.. సుమక్క కామెంట్స్ విన్నారా?

ఆ సినిమాలో రమ్యకృష్ణ కంటే నేనే చేసుంటే బాగుండేది.. సుమక్క కామెంట్స్ విన్నారా?
Advertisement

Suma Kanakala: సుమ కనకాల టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. గత పాతిక సంవత్సరాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ఇప్పటికీ ఎన్నో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఎంతోమంది సెలబ్రిటీలను ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ ముప్పు తిప్పులు పెట్టారు. ఇలా సెలబ్రిటీలను యాంకర్ గా ప్రశ్నించిన సుమ తాజాగా జగపతిబాబు(Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయము రా కార్యక్రమంలో సెలబ్రిటీగా హాజరై సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ముగ్గురిని రిజెక్ట్ చేసిన సుమ..

ఈ ప్రోమో వీడియోలో భాగంగా జగపతిబాబు సుమ మధ్య సరదా సన్నివేశాలు కొనసాగాయి ముఖ్యంగా రాజీవ్ కనకాల కంటే ముందు సుమా ముగ్గురిని రిజెక్ట్ చేసిన విషయాన్ని తెలియజేయడంతో జగపతిబాబు పద్మాలయ అప్పున్ గుర్తున్నారా అంటూ జగపతిబాబు అడగడంతో అంటే ఏంటని సుమా తెలియని విధంగా ఎదురు ప్రశ్న వేశారు నువ్వు రిజెక్ట్ చేసిన బాయ్ అంటూ జగపతిబాబు చెప్పడంతో అయ్యయ్యో సార్ ఇప్పుడు కనుక ఇక్కడికి తీసుకు వచ్చారా? అంటూ సుమ కాస్త కంగారు పడ్డారు. అనంతరం తన స్నేహితులు సుమ గురించి మాట్లాడిన కొన్ని వీడియో క్లిప్స్ కూడా ప్లే చేసి చూపించారు.

వాట్సాప్ చాట్ లీక్…

Advertisement

ఇలా సుమకు సంబంధించిన కొన్ని విషయాలు బయట పెట్టడంతో సుమా షాక్ అవుతూ అరే వాట్స్అప్ చాట్ అంతా కూడా లీక్ చేశారే అంటూ షాక్ అయ్యారు. అనంతరం ఈ కార్యక్రమంలో సుమ అమ్మగారు కూడా పాల్గొన్నారు. ఇలా వీరి మధ్య ఈ కార్యక్రమం సరదా సరదాగా కొనసాగిందని తెలుస్తోంది. ఇక చివర్లో జగపతిబాబు సుమను ప్రశ్నిస్తూ.. ఏదైనా ఒక సినిమాలో ఒక రోల్ చూసిన తర్వాత నేనైతే బాగా చేసి ఉండేదాన్ని అనిపించిన పాత్ర ఏదైనా ఉందా అంటూ అడగడంతో వెంటనే సుమ చాలా సీరియస్ గా తన హావభావాలను మారుస్తూ కాలుపై కాలు వేసుకుని చాలా ధీమాగా కూర్చున్నారు.

?jplx=MXEzZ2JoYmMwaGQ4aQ%3D%3D

Advertisement

సుమ ఇలా సీరియస్ కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంతో కచ్చితంగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ(Narasimha) సినిమాలో రమ్యకృష్ణ (Ramya Krishna)నటించిన నీలాంబరి పాత్ర(Neelambari Role) గురించి సుమ ఈ సందర్భంగా చెప్పారని తెలుస్తోంది. మరి సుమ చెప్పింది నీలాంబరి పాత్ర గురించేనా కాదా అనేది తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమం జీ 5 లో ప్రతి శుక్రవారం అలాగే జీ తెలుగులో ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 లకు ప్రసారం అవుతుంది. ఇక నరసింహ సినిమాలో రమ్యకృష్ణ సైతం నీలాంబరిగా అద్భుతమైన నటనను కనబరిచిన సంగతి తెలిసిందే.

Also Read: వామ్మో ‘బాయ్స్’ టైటిల్ కార్డులో ఇంత అర్థం ఉందా? ఇన్నేళ్లకు బయటపడిందా?

Related News

పాప పుట్టాకే దాని విలువ తెలిసింది.. కన్నీళ్లు పెట్టుకున్న నటరాజ్ మాస్టర్!

15 నిమిషాల కార్ జర్నీలో పుట్టిన పాట.. ఇప్పుడు అందరి మనసుల్లో!

‘బాసింగ బలాలు’తర్వాత వైష్ణవీ సోనీ మరో సెన్సేషన్..తగ్గట్లేదుగా!

ఒక్కో పాటతో ఒక్కో రేంజ్..యమునా తారక్ టాప్ సాంగ్స్ ఇవే!

ఆ భయంతోనే ప్రియాంక జైన్ సీరియల్స్ కి దూరమయ్యారా?

హౌస్ లోకి మాస్క్ మ్యాన్.. భయంతో పరిగెత్తిన ముఖేష్.. కట్ చేస్తే!

గాజులు గల గల to..అయ్యప్ప.మాల.. రాధమ్మ కూతురిని ఏకిపారేస్తున్న నెటిజన్లు!

Big Stories

Advertisement
×