Yamuna Tarak Top Folk Songs:తెలంగాణా జానపదాలు ఇపుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.ఎంతలా అంటే ఇలా వదిలారంటే అలా మిలియన్ల వ్యూస్ వచ్చి పడేంతగా.ఇక ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్న నటీ నటులు కూడా ఇపుడు స్టార్స్ అయిపోతున్నారు.ఈ క్రమంలోనే బిందె మీద బిందె పెట్టి అంటూ dj వెర్షన్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది నటి యమునా తారక్.
అవును …తనదైన స్టెప్పులు మరియు ఎక్స్ ప్రెషన్స్ తో మ్యూజిక్ లవర్స్ ని ముఖ్యంగా ఫోక్ లవర్స్ ని కట్టిపడేస్తుంది.మరి ఇపుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్న యమునా తారక్ టాప్ సాంగ్స్ ఏంటో మనమూ ఒకసారి చూసేద్దమా !
యమునా తారక్ పేరు వినపడగానే మనందరికీ గుర్తొచ్చే పాట.బిందె మీద బిందె పెట్టి అనే dj సాంగ్. నాగవ్వ,శ్రీనిధి కలిసి పాడిన ఈ పాట ఒరిజినల్ కన్నా dj వర్షన్ లోనే సూపర్ హిట్ కావడం విశేషం.ఎంతలా అంటే కేవలం రెండు నెలల్లోనే 87 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టేంతగా .అక్కడ ఇక్కడా అన్న తేడా లేకుండా అన్ని చోట్లా ఈ పాటే ఇపుడు మోత మోగడం విశేషం.ఇక ఈ పాటలో యమునా తారక్ తో పాటు పూజా నాగేశ్వర్ కూడా స్టెప్పులేయగా,లీడింగ్ బాయ్స్ కోరియోగ్రఫీ మెయిన్ ఎసెట్ గా నిలిచింది.
ఇక పాట తర్వాత యమునా తారక్ కి బాగా పేరు తెచ్చిన ఫోక్ సాంగ్ ‘బోల్ బొంబాయ్ కాడ’ సాంగ్.పర్శురామ్ నాగం లిరిక్స్ అందించిన ఈ పాటకి ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న వెంకట్ అజ్మీరా మ్యూజిక్ అందించడం విశేషం.ఇక వరుస ఫోక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటున్న ప్రభ తో గడ్డం సంతోష్ తన గాత్రాన్ని అందించారు. ఇక శేఖర్ వైరస్ కోరియోగ్రఫీ చేసిన పాట1.5 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం విశేషం.
ఇక ఇదే లిస్టు లో ఉన్న మరో పాట ‘సోలాపురం పోయినాను’ అనే dj సాంగ్.ఈ పాటలో కూడా బోల్ బొంబాయి పాటలో యమునా తారక్ కి జోడీగా నటించిన రాజేష్ జాగ్వారే కలిసి స్టెప్పులేయడం విశేషం.ఇక వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్న శేఖర్ వైరస్ కోరియోగ్రఫీ చేసిన ఈ పాటకి దిలీప్ దేవగన్ ,మణి శ్రీ తమ గొంతుతో ప్రాణం పోసారనే చెప్పాలి.మార్క్ ప్రశాంత్ మ్యూజిక్ అందించిన ఈ పాట ఇప్పటికి 1.1 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.
అలాగే ‘గంగా దారి ఇంటికాడ ‘అనే పాటని కూడా యమునా తారక్ టాప్ సాంగ్స్ లో ఒకటిగా చెప్పుకోవాలి.హనీ గణేష్ మ్యూజిక్ అందించిన ఈ పాటకి దివ్య బోనగిరి లిరిక్స్ తో పాటు వాయిస్ అందించడం విశేషం.ఇక శేఖర్ వైరస్ కోరియోగ్రఫీ చేసిన ఈ పాట దాదాపు 6 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుని సత్తా చాటింది.
అలాగే నారీ సుందరి అనే dj సాంగ్ కూడా యమునా తారక్ టాప్ సాంగ్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు.ఇందులో యమునా తారక్ తో పాటు లాస్య స్మైలీ కూడా స్టెప్పులేయగా సింగర్ ప్రభ తనదైన గొంతుతో పాటని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేశారు. ఇక శేఖర్ వైరస్ అందించిన ఈ పాట ఇప్పటికి 8లక్షల వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం.
మొత్తంగా ప్రస్తుతం ఫోక్ ఇండస్ట్రీలో దూసుకొస్తున్న వారిలో యమునా తారక్ ఒకరని తన నుండి వస్తున్న సాంగ్స్ చూస్తేనే అర్థం అవుతుంది.చూడాలి మరి ముందు ముందు ఎలాంటి పాటలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుందో !
also read :గాజుల గలగలతో సెన్సేషన్.. ఇప్పుడు వరుస ఫోక్ సాంగ్స్‌తో రచ్చ చేస్తున్న రాధమ్మ కూతురు!