Vaishnavi Sony:వైష్ణవీ సోనీ..ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడొక సెన్సేషన్.ముఖ్యంగా ఈశ్వర్ సాయి తో కలిసి చేసిన బాసింగ బలాలు అనే పాటతో ఒక్కసారిగా ఎక్కడ లేని స్టార్ డమ్ సంపాదించింది.ఇక ఎంతలా అంటే ఇపుడు ఎక్కడ ఏ పాట చూసినా వైష్ణవీ సోనీ యే దర్శనమిచ్చేంతగా. ఈ క్రమంలోనే తాజాగా మరో పాటతో ఇపుడు ఆడియన్స్ ని, ముఖ్యంగా ఫోక్ లవర్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంది.
నెలరోజుల్లో ఏకంగా 2.5 మిలియన్ల వ్యూస్
గుజ్జారి గుజ్జారి 2అంటూ వచ్చిన ఈ పాటని మల్లిక్ తేజ రాయగా, నవీన్ జే అందించిన మ్యూజిక్ ఫోక్ లవర్స్ ని ఫిదా చేస్తుంది.మొదటి భాగంగా వచ్చిన గుజ్జారి గుజ్జారి మామిండ్ల కింద సోపర్ హిట్ అవడంతి ఇలా రెండో పాటని తీసుకురాగా ఇది కూడా కేవలం నెలరోజుల్లో ఏకంగా 2.5 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టడం విశేషం.
ఇక రాజేష్ పైండ్ల కోరియోగ్రఫీ అందించిన ఈ పాటకి శివ వేల్పుల దర్శకత్వంతో పాటు కెమెరా, ఎడిటింగ్ ,di వంటి వాటిని చూసుకోవడం విశేషం.ఇక ఇందులో వైష్ణవి సోనీతో పాటు అక్షిత్ మార్వెల్, సాగర్ మాచా వంటి వారు స్టెప్పులు వేసి పాటని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్లారు. అయితే ఈ పాట విషయానికి వస్తే మాములుగా లవ్ , అగ్రికల్చర్ , డివైన్ ,ఫ్యామిలి ..ఇలా రకరకాల నేపథ్యాలతో పాటలు వస్తుంటాయి.కాని ఈ పాటని మల్లిక్ తేజ కుల వృత్తుల బ్యాక్ డ్రాప్ లో రాయడం విశేషం.
కుల వృత్తులని భాగం చేయడం మెచ్చుకోతగ్గ విషయం
ముఖ్యంగా ఇందుకో వడ్డెరలు ,మెదరోల్లు, మాదిగ, మంగలి ,కుమ్మరి ,కుర్మోళ్ళు అంటూ వివిధ కుల వృత్తులని ఇందులో భాగం చేయడం మెచ్చుకోతగ్గ విషయం.అలాగే ప్రతీ వృత్తికి ఒక చరిత్ర ఉంటుందని,ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుందని వివరిస్తూ పాటని అత్యద్భుతంగా రాశారు మల్లిక్ తేజ.
దీంతో ఇలా కుల వృత్తులని ఇంట బాగా పాటలో భాగం చేసినందుకు ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.ఇన్ని రోజులకి మా వడ్డెర వాళ్ళ గురించి పాట పాడినారు సంతోషం అని ఒకరంటే,మేదరోల్లు అల్లిన బుట్టలు అనే పదం వింటే మా పెద్ద వాళ్ళు గుర్తుకు వస్తున్నారు అంటూ మరికొంత మంది కామెంట్స్ చేయడం విశేషం.
మరెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !
మొత్తంగా పాటని తనదైన స్టెప్పులతో వైష్ణవీ సోనీ మరో రేంజ్ కి తీసికెళ్ళింది అనడంలో సందేహం లేదు.పైగా వరుస ఫోక్ హిట్స్ తో దూసుకుపోతున్న సింగర్ ప్రభ అలాగే రామ స్వామీ ల గాత్రం కూడా పాటకి మెయిన్ ఎసెట్ గా నిలిచింది. చూడాలి మరి ఫోక్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న వైష్ణవీ సోనీ ముందు ముందు మరెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !
ALSO READ:ఒక్కో పాటతో ఒక్కో రేంజ్..యమునా తారక్ టాప్ సాంగ్స్ ఇవే!