Bigg Boss 10:దశావతారం పేరుతో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఊహించని ఎంటర్టైన్మెంట్ రెట్టింపు స్థాయిలో ఆడియన్స్ కు అందుతోంది. మొత్తం 10మంది సెలబ్రిటీలు, 6మంది కామనర్స్ తో బిగ్ బాస్ సీజన్ 10 ఘనంగా ప్రారంభం అయింది. మధ్యలో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఈ షో మరింత హీటెక్కిందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా 73వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మొదటి ప్రోమో అటు ఆడియన్స్ లో కూడా మరింత ఆసక్తిని కలిగించింది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మాస్క్ మ్యాన్ ఎంటర్ అవ్వడం ముఖేష్ భయంతో పరిగెత్తడం కాస్త ఆసక్తికరంగా మారింది. మరి ఈ ప్రోమోలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ సీజన్ 10లో భాగంగా పదవ వారం ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ గా గడిచింది. కుటుంబ సభ్యులు హౌస్ లోకి వచ్చి కన్నీటి పర్యంతమవుతూ.. తమ తమ వారికి ఎలా ఆడాలో సలహాలు ఇచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత సెలబ్రిటీలు స్టేజ్ పైకి వచ్చి సపోర్టు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక 11వ వారం డిక్టేటర్స్ గా ఎక్స్ హౌస్ మేట్స్ హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ ను నామినేట్ చేశారు. ముఖ్యంగా తమదైన పాయింట్ చెప్పి చుక్కలు చూపించారు. హౌస్ మేట్స్ – ఎక్స్ హౌస్ మేట్స్ మధ్య నామినేషన్ వార్ చాలా గట్టిగా సాగింది. మొత్తం ఈ వారం ఎనిమిది మంది నామినేషన్ లోకి వచ్చారు.
మరొకవైపు 79వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు. నామినేషన్ హీట్ కాస్త తగ్గడంతో కంటెస్టెంట్స్ అంతా ఒకచోట కూర్చుని సరదాగా ఫ్యామిలీ వీక్ లో జరిగిన సన్నివేశాలను రీ క్రియేట్ చేస్తూ నవ్వుకుంటున్నారు.ముఖ్యంగా నరేష్ – రాంప్రసాద్ నీతూ -నటరాజ్ లను రీ క్రియేట్ చేశారు. ఆ తర్వాత దేబ్ జానీ పేరెంట్స్ ని కూడా రీ క్రియేట్ చేస్తూ నవ్విస్తున్న సమయంలో సడన్గా బజర్ మోగింది. అసలు ఏం జరిగిందో అంటూ కంగారుగా అందరూ లేచి వెతకడం మొదలుపెట్టారు.
also read:ఆసక్తికరంగా మోసపోయాం జానకి.. సందీప్ రెడ్డి వంగ స్పెషల్ ప్రమోషన్!
అయితే కిచెన్ ఏరియాలో ముఖేష్ వెతుకుతుండగా డార్క్ మోడ్లో కొంతమంది మాస్క్ మ్యాన్ లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వారిని చూడగానే భయంతో అక్కడి నుండి ముఖేష్ పరుగులు తీశాడు. ఈ విజువల్ చూడడానికి కాస్త ఫన్నీగా ఉన్నా.. అసలేం జరుగుతోంది? అనే ఆసక్తి నెలకొంది. ఇక హౌస్ మేట్స్ అంతా ఏం జరుగుతోంది అని చూసేలోపే ఆ మాస్క్ మ్యాన్లు ముగ్గురు అక్కడ ఉన్న పవర్ బాక్సులను తీసుకెళ్లిపోయారు. ముఖ్యంగా వంశీతో ఆ మాస్క్ మ్యాన్లు చూస్తూ ఉండు అంటూ చెబుతూ వెనకాల ఎక్స్పైరీ డేట్ అయ్యిందా? అనే రేంజ్ లో ఒక పోస్టర్ వదిలి వెళ్లారు. ఇక అసలేం జరుగుతోంది? అసలు వీళ్ళు ఎవరు ?ఎందుకు పవర్ కీ బాక్సులు తీసుకెళ్లారు? అనే విషయం తెలియాలి అంటే నెక్స్ట్ ప్రోమో వరకు ఎదురు చూడాల్సిందే.