Priyanka Jain: ప్రియాంక జైన్ మౌనరాగం అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకుల ముందుకు నటిగా పరిచయమై మొదటి సీరియల్ తోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రియాంక జైన్ (Priyanka Jain)అనంతరం జానకి కలగనలేదు(Janaki Kalaganaledu) సీరియల్ తో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. ఈ సీరియల్ ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇలా జానకి కలగనలేదు సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టాప్ 5 కంటెస్టెంట్ గా బయటకు వచ్చిన ప్రియాంక తదుపరి కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతారని అందరూ భావించారు కానీ ఈమె మాత్రం అనుకున్న విధంగా అవకాశాలను మాత్రం అందుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ తర్వాత ఈమె నయనం అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది మినహా ఎలాంటి అవకాశాలను అందుకోలేదని చెప్పాలి.ఇక బుల్లితెర సీరియల్స్ నుంచి కూడా ప్రియాంక దూరంగా ఉంటున్నారు. అయితే ఈమెకు అవకాశాలు లేక సీరియల్స్ చేయలేదా కావాలనే సీరియల్స్ కు దూరమయ్యారా అనే సందిగ్ధంలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇలా ప్రియాంక సీరియల్స్ కి దూరం అవ్వడానికి గల కారణాలను ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తాను నటించిన మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్ రెండు మంచి సక్సెస్ అందుకున్నాయి అయితే ఈ సీరియల్స్ లో నా పాత్రకు మంచి ఆదరణ రావడంతో తదుపరి సీరియల్స్ లో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. ఇలా ఎప్పుడు ఒకే తరహా పాత్రలు చేస్తే నటిగా నా కెరియర్ ఆగిపోతుందనే భయంతోనే తాను సీరియల్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చానని నటిగా నన్ను నేను కొత్తగా నిరూపించుకోవడం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు.
ఇక ప్రస్తుతం తాను సీరియల్స్ కు చిన్న బ్రేక్ ఇచ్చినప్పటికీ మంచి బలమైన కథ ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించే అవకాశం వస్తే తప్పకుండా సీరియల్స్ చేస్తానని ప్రియాంక ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈమె బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉన్నప్పటికీ బుల్లితెర కార్యక్రమాలలో మాత్రం పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇలా స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్యక్రమాలతో పాటు ఇతర చానెల్ లో కూడా ప్రసారమవుతున్న బుల్లితెర కార్యక్రమాలలో తన ప్రియుడు శివకుమార్ తో కలిసి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్ ఛానల్ ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు.
Also Read: ఈ రోజే బిడ్డకు జన్మనివ్వచ్చేమో..సమంత పోస్ట్ వైరల్!