E-Paper
Advertisement

పాప పుట్టాకే దాని విలువ తెలిసింది.. కన్నీళ్లు పెట్టుకున్న నటరాజ్ మాస్టర్!

పాప పుట్టాకే దాని విలువ తెలిసింది.. కన్నీళ్లు పెట్టుకున్న నటరాజ్ మాస్టర్!
Advertisement

Natraj Master:కొరియోగ్రాఫర్ గా తన కెరియర్ను మొదలుపెట్టిన నటరాజు మాస్టర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన డాన్స్ స్టెప్స్ లతో అందరిని ఆకట్టుకున్న ఈయన ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై వంటి చిత్రాలకు కూడా ఈయన పని చేశారు. ఆట 2 వంటి డాన్స్ రియాలిటీ షోలలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొని తన ఆట తీరుతో వార్తల్లో నిలిచారు నటరాజ్ మాస్టర్.

నా తప్పు తెలిసి వచ్చింది – నటరాజ్ మాస్టర్

అలాంటి నటరాజ్ మాస్టర్ ఒకవైపు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూనే.. మరొకవైపు బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 లో పాల్గొని సందడి చేశారు. అందులో భాగంగానే తన కూతురు పుట్టాకే దాని విలువ తెలుసొచ్చింది అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ ప్రోమోలో నటరాజు మాస్టర్ మాట్లాడుతూ ..నాకు డబ్బు అంటే అసలు విలువ ఉండేది కాదు.. ఎలా పడితే అలా అనవసరంగా ఖర్చు చేసేవాడిని. కానీ నా కూతురు పుట్టాకే ఆ డబ్బు విలువ తెలిసి వచ్చింది” అంటూ డబ్బు కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను, తాను చేసిన తప్పును అందరి ముందు ఒప్పుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం నటరాజ్ మాస్టర్ భార్య నీతూ నటరాజ్ బిగ్ బాస్ సీజన్ 10 లో వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టి తనదైన పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తున్న విషయం తెలిసిందే.

ప్రేమించనప్పుడు జీవితంలోకి రావడం ఎందుకు – పవిత్ర

Advertisement

ఇకపోతే ఇదే ప్రోమోలో స్రవంతి చొక్కారపు మాట్లాడుతూ.. తనకు తన ఆరోగ్యం పట్ల నెగ్లిజెన్సీ ఎక్కువ అని, ఇకపై తన ఆరోగ్యం పట్ల తాను జాగ్రత్తగా ఉంటానని తెలిపింది. అలాగే జబర్దస్త్ పవిత్ర మాట్లాడుతూ… నేను ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మాను. అతడే సర్వస్వం అనుకున్నాను. కానీ అతడు నన్ను మోసం చేశాడు. నన్ను ప్రేమించనప్పుడు ప్రేమ పేరుతో నా జీవితంలోకి రావడం ఎందుకు ? అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పవిత్ర. ఇక తర్వాత అషు రెడ్డి మాట్లాడుతూ నేను నా జీవితంలో చేసిన మొదటి తప్పు మనుషులను గుడ్డిగా నమ్మడమే అంటూ తన తప్పును బయటపెట్టింది.

also read:ఆ ఒక్కపనితో అనుష్క శాశ్వతంగా టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిందా?

సుధీర్ మొబైల్ ను ఆన్ కెమెరా ఓపెన్ చేసిన అషు రెడ్డి..

Advertisement

ఇక ప్రోమో చివరిలో సుధీర్ మొబైల్ ను ఆన్ కెమెరా ఓపెన్ చేశారు. అందులో ఉన్నది చూసి కొంతమంది సెలబ్రిటీలు ఆశ్చర్య పోతే .. మరికొంతమంది ఛీ అంటూ అక్కడి నుండి పక్కకు వెళ్లిపోయారు. మరి సుధీర్ మొబైల్ లో చూడలేనంతగా ఏమున్నాయి? అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరి పూర్తి వివరాలు తెలియాలి అంటే ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ వచ్చేవరకు.

Related News

15 నిమిషాల కార్ జర్నీలో పుట్టిన పాట.. ఇప్పుడు అందరి మనసుల్లో!

‘బాసింగ బలాలు’తర్వాత వైష్ణవీ సోనీ మరో సెన్సేషన్..తగ్గట్లేదుగా!

ఒక్కో పాటతో ఒక్కో రేంజ్..యమునా తారక్ టాప్ సాంగ్స్ ఇవే!

ఆ భయంతోనే ప్రియాంక జైన్ సీరియల్స్ కి దూరమయ్యారా?

హౌస్ లోకి మాస్క్ మ్యాన్.. భయంతో పరిగెత్తిన ముఖేష్.. కట్ చేస్తే!

గాజులు గల గల to..అయ్యప్ప.మాల.. రాధమ్మ కూతురిని ఏకిపారేస్తున్న నెటిజన్లు!

పెళ్లి పీటలెక్కబోతున్న గుప్పెడంత మనసు సీరియల్ సాక్షి.. పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×