E-Paper
Advertisement

కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే.. వామ్మో అనన్య లిస్ట్ చూశారా?

కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే.. వామ్మో అనన్య లిస్ట్ చూశారా?
Advertisement

Big TV Kissik Talks : బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతివారం సెలబ్రిటీలు పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇలా సెలబ్రిటీ టాక్ షో గా మంచి సక్సెస్ అందుకున్న ఈ కార్యక్రమంలో ఈ వారం నటి అనన్య శర్మ (ananya sharma) పాల్గొన్నారు. ఈమె 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా ఈ సిరీస్ తర్వాత అనన్య హై అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు.

పెద్ద లిస్ట్ బయట పెట్టిన అనన్య..

ఈ నేపథ్యంలోనే బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్న  అనన్య తనకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు. ఇక ఈమె ఈ కార్యక్రమంలో భాగంగా తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీ ఉండాలి అనే విషయాన్ని కూడా తెలిపారు. సాధారణంగా ప్రతి ఒక్క అమ్మాయి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు.. ఇక అనన్య శర్మ సైతం తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ పెద్ద లిస్ట్ బయట పెట్టారు. మరి ఈమెకు భర్త కావాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం..

యానిమల్స్ అంటే ఇష్టం ఉండాలి..

Advertisement

చిన్నప్పటి నుంచి తనకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం అందుకే యానిమల్స్ ఇష్టపడే వ్యక్తి తనకు భర్తగా రావాలని తెలిపారు. మంచి హృదయం ఉండాలి. ఓపిక కూడా ఎక్కువగా ఉండాలి. తన జీవితంలో ఏం చేయాలి అనే విషయంపై క్లారిటీ ఉన్న వ్యక్తి అయితే చాలు ఆయన ఉద్యోగం చేయకపోయినా పరవాలేదని, తనకు ఏం కావాలో తెలుసుకోగలగాలి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి భర్తగా రావాలని అనన్య తెలిపారు. ఇలా ఈమె క్వాలిటీస్ గురించి చెప్పడంతో వెంటనే వర్ష మాట్లాడుతూ.. క్వాలిటీస్ చెప్పావు కానీ లుక్స్ ఎలా ఉండాలి అనేది మాత్రం చెప్పలేదు అంటూ ప్రశ్న వేశారు.

Advertisement

తాను లుక్స్ పరంగా పెద్దగా ఇంపార్టెంట్ ఇవ్వనని తెలిపారు .ఒక పది సంవత్సరాలు తర్వాత మనం కోరుకున్న లుక్స్ మనలో ఉండవు కదా.. లుక్స్ టెంపరరీ అంటూ అనన్య ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక మీరు సింగిల్ నా లేక కమిటెడ్ నా అంటూ వర్ష ప్రశ్నలు వేయడంతో తాను ఈ పాడ్ కాస్ట్ పూర్తి అయ్యేలోపు నేనే అబ్బాయి ఎలా ఉంటాడు ఏంటి అనే విషయాలను చెబుతానని అనన్య తెలిపారు. ఏది ఏమైనా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాలను బయట పెడుతూ అనన్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: అనన్య ఫేవరెట్ హీరో అతనేనా.. సీడీ అరిగిపోయేదాకా సినిమా చూసానంటూ!

Related News

అనన్య ఫేవరెట్ హీరో అతనేనా.. సీడీ అరిగిపోయేదాకా సినిమా చూసానంటూ!

అనన్య సినిమాలు చేయాలంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? అలా చేయమంటే నచ్చదా?

జబర్దస్త్ ప్రవీణ్ కూతురికి ఇంద్రజ అదిరిపోయే గిఫ్ట్.. నిజంగా గ్రేట్ అబ్బా..

బిగ్ బాస్ 11వ వారం ఎలిమినేట్ అయిన నీతూ మాస్టర్… రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. గుడ్ బై చెప్పిన సుధీర్, నీతూ మాస్టర్!

జనసేన ప్రచారానికి వెళ్తుండగా యాక్సిడెంట్.. కారు ప్రమాదం పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

జబర్దస్త్ ఆర్టిస్టుల కారుకు యాక్సిడెంట్.. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×