Big TV Kissik Talks: అనన్య శర్మ పరిచయం అవసరం లేని పేరు. 30 వెడ్స్ 21 సిరీస్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనన్య శర్మ కొంత గ్యాప్ తర్వాత తిరిగి వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈమె త్వరలోనే హై (High)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా అనన్య శర్మ (Ananya sharma )బిగ్ టీవీ కిస్సిక్ టాక్(Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అనన్య శర్మ తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 30 వెడ్స్ 21 సిరీస్ ద్వారా ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన ఈమె ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ తనకు బిగ్ స్క్రీన్ పై కనిపించాలని ఎప్పటినుంచో కోరికగా ఉంది అందుకే సరైన కథ కోసం ఎదురు చూడటం వల్లే ఈ గ్యాప్ వచ్చిందని తెలిపారు. ఇక హై సినిమాలో తన పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుందని తెలిపారు. ఇలా సినిమాల గురించి ప్రస్తావనకు రావడంతో వర్ష అనన్యను ప్రశ్నిస్తూ.. అనన్య సినిమాలలో నటించాలి అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయట నిజమేనా? అనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ తాను సినిమాలలో ఎలాంటి సన్నివేశాలలో అయినా నటిస్తాను. కథకు ఆసీన్ చేయటం కీలకం అనిపిస్తే తాను కచ్చితంగా చేస్తానని తెలిపారు. ఇక బట్టలు విషయానికి వస్తే తాను తన నిజ జీవితంలో ఎన్నో రకాల బట్టలను వేసుకుంటాను బట్టల విషయంలో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. అయితే ఆ పాత్రకు సినిమా కథకు అవసరం లేకపోయినా ఈ సీన్ పెడితే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని , ఈ సీన్ పెట్టడం అనేది ఈజీ సెల్లింగ్ అనేది నాకు నచ్చదని తెలిపారు.
నిజానికి ఆ కథకు పాత్రకు ఆ సీన్ చేయటం కీలకం అయితే కచ్చితంగా తాను చేస్తానని తెలిపారు. తాను ఎన్నో హాలీవుడ్ సినిమాలను చూస్తున్నాను. మనం ఏదైనా ఒక సీన్ చేస్తున్నాము అంటే దానికి రెస్పెక్ట్ ఉండాలి కానీ గ్లామర్ చూపించడానికి సీన్లు పెట్టకూడదంటూ ఈ సందర్భంగా అనన్య చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కేవలం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసమే కొన్ని ఇంటిమేట్ సీన్లను పెడుతుంటారు అలాంటి వాటిలో నటించడం తనకు నచ్చదని ఈ సందర్భంగా అనన్య చెప్పకనే చెప్పేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన ఇష్ట ఇష్టాల గురించి తన ఫ్యామిలీ విశేషాలు గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.
Also Read: అనిరుద్ కావ్య వెడ్డింగ్ రిసెప్షన్.. ఖర్చు తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే!