E-Paper
Advertisement

అనన్య ఫేవరెట్ హీరో అతనేనా.. సీడీ అరిగిపోయేదాకా సినిమా చూసానంటూ!

అనన్య ఫేవరెట్ హీరో అతనేనా.. సీడీ అరిగిపోయేదాకా సినిమా చూసానంటూ!
Advertisement

Big TV Kissik Talks : అనన్య శర్మ (Ananya sharma )బిగ్ టీవీ కిస్సిక్ టాక్(Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతివారం ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇలా సెలబ్రిటీ టాక్ షో గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ కార్యక్రమంలో ఈ వారం అనన్య శర్మ పాల్గొని సందడి చేశారు ఇందులో భాగంగా ఈమె తన సినిమాల గురించి తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా అనన్య శర్మ నటించిన హై సినిమా(High Movie) నవంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

బన్నీ ఆల్ టైం ఫేవరెట్ హీరో..

ఈ కార్యక్రమంలో భాగంగా అనన్య శర్మ తన ఫేవరెట్ హీరో గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తన ఫేవరెట్ హీరో ఎప్పుడూ అల్లు అర్జున్(Allu Arjun ) గారని ఈ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపారు. అల్లు అర్జున్ గారు నటించిన ఆర్య 2(Arya 2 ) సినిమా తన ఫేవరెట్ సినిమా అని అప్పట్లో మా ఇంట్లో ఈ సినిమాకు సంబంధించి ఒక సిడి ఉండేది . ఆ సిడి అరిగిపోయేదాకా తాను ఆర్య2 సినిమా చూశానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ఆర్య 2 సినిమా సిడి పని చేయకపోవడంతో మా అమ్మ బాగా చివాట్లు పెట్టిందని అనన్య తెలిపారు.

సమంత అంటే చాలా ఇష్టం…

Advertisement

ఇక అల్లు అర్జున్ గారు నటించిన దేశముదురు సినిమాలో ఒక డైలాగ్ చెప్పి అనన్య ఎంటర్టైన్ చేశారు. ఇక ఫేవరెట్ హీరోయిన్ గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో హీరోయిన్ విషయంలో తనకు ఎప్పుడూ ఒకే ఇష్టం ఉండదని ఆయా సందర్భాన్ని బట్టి హీరోయిన్స్ మారుతూ ఉంటారని ఈ సందర్భంగా అనన్య తెలిపారు. మరి ప్రస్తుతం ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న ఎదురవడంతో తనకు సమంత అంటే చాలా ఇష్టమని తెలిపారు. సమంత ఇటీవల నటించిన మా ఇంటి బంగారం సినిమా ఎంతో అద్భుతంగా ఉందని ఆమె ఈ సినిమాలో నటించిన తీరు, సినిమాకి ప్రొడక్షన్ చేయడం వంటి అన్ని విషయాలను అద్భుతంగా హ్యాండిల్ చేసిందని తెలిపారు.

Advertisement

ఇలా ప్రస్తుతం తనకు సమంత ఫేవరెట్ హీరోయిన్ అని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆల్ టైం ఫేవరెట్ హీరో అని అనన్య తెలిపారు . ఇలా దేశముదురు సినిమాల్లోని డైలాగ్ తో అదరగొట్టిన అనన్యకు పాట పాడమని అడగడంతో మీరు చాలా రాంగ్ పర్సన్ను పాట పాడమని అడుగుతున్నారు అంటూ అనన్య తెలిపారు. ఇక అనన్య వెండితెరపైకి హై అనే సినిమా ద్వారా రాబోతున్నారు. ఇది ఆమెకు మొదటి సినిమా కావటం విశేషం. ఇక ఈమె 30 వెడ్స్ 21 సిరీస్ ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సిరీస్ అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న అనన్య ఇప్పుడు పెళ్లి తెరపై హై అనే సినిమా ద్వారా రాబోతున్నారు ఈ సినిమా నవంబర్ 27 తేదీ విడుదల కానుంది.

Also Read: అనన్య సినిమాలు చేయాలంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? అలా చేయమంటే నచ్చదా?

Related News

అనన్య సినిమాలు చేయాలంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? అలా చేయమంటే నచ్చదా?

జబర్దస్త్ ప్రవీణ్ కూతురికి ఇంద్రజ అదిరిపోయే గిఫ్ట్.. నిజంగా గ్రేట్ అబ్బా..

బిగ్ బాస్ 11వ వారం ఎలిమినేట్ అయిన నీతూ మాస్టర్… రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. గుడ్ బై చెప్పిన సుధీర్, నీతూ మాస్టర్!

జనసేన ప్రచారానికి వెళ్తుండగా యాక్సిడెంట్.. కారు ప్రమాదం పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

జబర్దస్త్ ఆర్టిస్టుల కారుకు యాక్సిడెంట్.. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే!

Priyanka Nalkari : నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Big Stories

Advertisement
×