E-Paper
Advertisement

బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. గుడ్ బై చెప్పిన సుధీర్, నీతూ మాస్టర్!

బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. గుడ్ బై చెప్పిన సుధీర్, నీతూ మాస్టర్!
Advertisement

Bigg Boss 10 Telugu Day 77 Promo 3: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కార్యక్రమం నేటితో 11 వారాలు పూర్తి కాబోతున్నాయి. నాలుగు వారాలలో ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరగబోతుంది. ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ కి సంబంధించిన వార్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. ఈ వారం రామకృష్ణ హౌస్ నుంచి బయటకు వస్తారంటూ వార్తలు వచ్చాయి కానీ రామకృష్ణ కాకుండా నీతూ మాస్టర్ (Neethu master) లేదా సుదీర్(Sudheer) హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని తాజాగా విడుదల చేసిన ప్రోమో వీడియో చూస్తేనే స్పష్టం అవుతుంది.

గుడ్ బై చెప్పేసిన సుధీర్ రెడ్డి..

ఈ ప్రోమో వీడియోలో భాగంగా నాగార్జున వేదిక పైకి రాగానే ఆమన్, ముఖేష్ లతో నాగార్జున మాట్లాడుతూ మీరిద్దరూ సుధీర్, నీతూ మాస్టర్ కళ్ళకు గంతులు కట్టి వారిని గార్డెన్ ఏరియాలోకి తీసుకురమ్మని చెప్పారు. ఇక మీ ఇద్దరికీ హౌస్ నుంచి గుడ్ బై చెప్పే సమయం వచ్చిందని నాగార్జున చెప్పడంతో సుదీర్ మాత్రం తాను ఇదివరకే హౌస్ నుంచి వెళ్లాల్సి ఉంది. అప్పుడు కొంచెం బాధపడ్డాను కానీ ముఖేష్ అన్న మీరు చేసిన దానికి నాకు కొంచెం బాధ తీరిపోయింది ఇండిజువల్ గా కూడా నేను చాలా బాగా గేమ్ ఆడాలి అనుకున్నాను అది కూడా నేను నిరూపించుకున్నానని నమ్మకంతో వెళ్తున్నానని సుదీర్ చెప్పారు.

డేంజర్ జోన్ లో నీతూ మాస్టర్ ..

Advertisement

ఇక నీతూ మాస్టర్ కూడా మాట్లాడుతూ థాంక్యూ సో మచ్ అందరూ నన్ను బాగా చూసుకున్నారు అంటూ వీరిద్దరూ హౌస్ నుంచి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే నాగర్జున ఊహించని ట్విస్ట్ ఇచ్చారు వీరిద్దరిని ఒక కారులో ఎక్కించి హౌస్ నుంచి బయటకు పంపించబోతున్నారు అయితే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కారు నుంచి దిగి వెళ్ళిపోగా, సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ తిరిగి అదే కారులో హౌస్ లోకి వస్తారని నాగార్జున తెలిపారు. ఇలా కారులో బయటకు వెళ్లిన వీరిద్దరిలో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు, ఎవరు సేఫ్ జోన్ లో ఉండి తిరిగి హౌస్ లోకి వచ్చారు అనేది తెలియాలి అంటే ఈరోజు రాత్రి ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

Advertisement

ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా కెప్టెన్ నరేష్ మినహా మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ఇక వీరిలో లీస్ట్ ఓటింగ్ వచ్చిన జాబితాలో నీతూ మాస్టర్ ఉన్నారని ఈ వారం నీతూ మాస్టర్ దాదాపు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈమె బిగ్ బాస్ 5వ వారంలో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మరి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం నీతూ మాస్టర్ హౌస్ నుంచి బయటకు వస్తారా లేదంటే సుదర్ రెడ్డి ఎలిమినేట్ కాబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Related News

జనసేన ప్రచారానికి వెళ్తుండగా యాక్సిడెంట్.. కారు ప్రమాదం పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

జబర్దస్త్ ఆర్టిస్టుల కారుకు యాక్సిడెంట్.. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే!

Priyanka Nalkari : నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda Gudigantalu : ప్రభావతి కొత్త బిజినెస్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Podarillu Today Episode : పెద్దోడు స్టైల్ కేక.. మహాకు ఏమైంది.. ఇది కదా ఫైనల్ ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఘన విజయం.. రమ్య ప్రేమలో పడుతుందా..? గ్రాండ్ ఎంట్రీ..

Brahmamudi Serial Today Episode November 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును ఆట పట్టించిన నందు, అపర్ణ  

Big Stories

Advertisement
×