E-Paper
Advertisement

బిగ్ బాస్ 11వ వారం ఎలిమినేట్ అయిన నీతూ మాస్టర్… రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ 11వ వారం ఎలిమినేట్ అయిన నీతూ మాస్టర్… రెమ్యునరేషన్ ఎంతంటే?
Advertisement

Neethu Master Elimination : బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు కార్యక్రమం 11 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరొక నాలుగు వారాలలో ఈ కార్యక్రమం ఫినాలే జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే టాప్ ఫైవ్ వెళ్లడం కోసం కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇక 11వ వారంలో భాగంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ భావించారు. కానీ నాగార్జున(Nagarjuna) మాత్రం ఈ వారంలో కూడా సింగిల్ ఎలిమినేషన్ ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈవారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

చివరి స్థానంలో నీతూ మాస్టర్ ..

ఇక 11వ వారంలో భాగంగా హౌస్ నుంచి లేడి కంటెస్టెంట్ బయటకు రాబోతోందని తెలుస్తోంది. ఈవారం నామినేషన్స్ లో భాగంగా కెప్టెన్ మినహా మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ఇలా నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో త్రిగుణ్, ముఖేశ్ ఓటింగ్ విషయంలో అగ్రస్థానాల్లో దూసుకుపోగా, వీరి తరువాత దేబ్జానీ, అమన్, వర్షిణి సేఫ్ జోన్‌లో నిలిచారు. మరోవైపు రామ్ ప్రసాద్, వంశీ, సుధీర్, రామకృష్ణ, శివ, నీతూ మాస్టర్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ముఖ్యంగా సుధీర్, రామకృష్ణ నీతూ మధ్య గట్టి పోటీ నెలకొంది.

వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నీతూ మాస్టర్ ..

Advertisement

ఇక ఈ కార్యక్రమం నుంచి ఇటీవల విడుదల చేసిన ప్రోమో వీడియో చూస్తుంటే సుదీర్,నీతూ మాస్టర్ (Neethu Master) లో ఎవరో ఒకరు హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ వారం సుధీర్ సేఫ్ జోన్ లో ఉండగా,నీతూ మాస్టర్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఇలా నీతూ మాస్టర్ ఎలిమినేట్ కావడంతో రెమ్యూనరేషన్ (remuneration) కి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. నీతూ మాస్టర్ బిగ్ బాస్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

6 వారాల రెమ్యూనరేషన్..

ఇలా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె ఆరువారాలపాటు హౌస్ లో కొనసాగారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే కొరియోగ్రాఫర్లు లేదా సెలబ్రిటీలకు వారానికి సుమారు 1.2 లక్షల నుండి ₹1.5 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన 6 వారాలకు గాను ఆమెకు సుమారు రూ.7.2 లక్షల నుండి 9 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇలా నీతూ మాస్టర్ టాప్ ఫైవ్ కంటెంట్ గా ఉంటుందని భావించగా ఈమె ఆరువారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈమె ఎలిమినేట్ కావడానికి ప్రధాన కారణం గొడవలు అనే చెప్పాలి. నీతూ మాస్టర్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులపై ఫోకస్ పెట్టడం కంటే కూడా గొడవల పైన ఎక్కువ ఫోకస్ చేయడం ఈమెకు మైనస్ గా మారిందని చెప్పాలి. ఇలా హౌస్ లోకి వచ్చిన ఆరువారాలకే నీతూ మాస్టర్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు.

Advertisement

Also Read: రష్మిక ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్… వాయిదా పడిన మైసా.. కారణం ఏంటంటే?

Related News

బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. గుడ్ బై చెప్పిన సుధీర్, నీతూ మాస్టర్!

జనసేన ప్రచారానికి వెళ్తుండగా యాక్సిడెంట్.. కారు ప్రమాదం పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

జబర్దస్త్ ఆర్టిస్టుల కారుకు యాక్సిడెంట్.. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే!

Priyanka Nalkari : నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda Gudigantalu : ప్రభావతి కొత్త బిజినెస్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Podarillu Today Episode : పెద్దోడు స్టైల్ కేక.. మహాకు ఏమైంది.. ఇది కదా ఫైనల్ ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఘన విజయం.. రమ్య ప్రేమలో పడుతుందా..? గ్రాండ్ ఎంట్రీ..

Big Stories

Advertisement
×