SweetPotato Halwa Recipe| చలికాలం వచ్చిందంటే వేడివేడి వంటకాలు, రుచికరమైన స్వీట్లు తినాలని అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో చిలగడదుంపలు ఎక్కువగా కనిపిస్తాయి. చాలామంది వీటిని కాల్చుకుని లేదా ఉడికించుకుని తింటుంటారు. అయితే వీటితో ఎంతో రుచికరమైన హల్వా కూడా తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా? సరైన రెసిపీతో దీని హల్వా రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టలేరు. తక్కువ పదార్థాలతో ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే ఈ స్వీట్‌ని ఈ శీతాకాలంలో తప్పకుండా ట్రై చేయండి.
ఈ రుచికరమైన హల్వా తయారుచేయడానికి పెద్దగా పదార్థాలు అవసరం లేదు. ఇంట్లో సులభంగా లభించే వాటితోనే తయారుచేసుకోండి.
మీ ఆరోగ్యం, రుచికి తగినట్లు పంచదార వేసుకోండి.
ముందుగా చిలగడదుంపలను శుభ్రంగా కడగాలి. వాటిపై ఉన్న మట్టిని పూర్తిగా తొలగించాలి. ఇప్పుడు వాటిని ప్రెషర్ కుక్కర్‌లో వేసి సరిపడా నీళ్లు పోయాలి. రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత చల్లారనిచ్చి పొట్టు తీసేయాలి.
ఉడికించిన చిలగడదుంపలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటిని గరిటె లేదా మాషర్‌తో మెత్తగా చేసుకోవాలి. ముద్దలో పెద్ద ముక్కలు లేకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే హల్వా మెత్తగా, రుచిగా తయారవుతుంది.
ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీడిపప్పు, బాదంపప్పు వేసి దోరగా వేయించాలి. వాటిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
అదే కడాయిలో మెత్తగా చేసిన చిలగడదుంప ముద్దను వేయాలి. తక్కువ నుంచి మీడియం మంటపై కలుపుతూ వేయించాలి. పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు అందులో అర కప్పు పాలు పోసి బాగా కలపాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత పంచదార వేసుకోవాలి. పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఈ సమయంలో మిశ్రమం కొద్దిగా పలుచగా మారుతుంది.
మిశ్రమంలోని తేమ పూర్తిగా పోయే వరకు ఉడికించాలి. అడుగున అంటుకోకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. హల్వా చిక్కగా మారిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి.
Also Read: పిల్లలు ఇష్టంగా తినే పెరి పెరి మసాలా.. తయారీ విధానం ఇదిగో
ఇప్పుడు ముందుగా వేయించిన జీడిపప్పు, బాదంపప్పు, కిస్‌మిస్ వేసి బాగా కలపాలి. హల్వా కడాయి అంచులను వదులుతున్నప్పుడు స్టవ్ ఆపేయాలి. అంతే మీ హల్వా రెడీ.
Also Read: లీటర్ పాలు రూ.7,000.. పాల పౌడర్ కిలో రూ.80,000.. పాడి రైతులకు బంగారు పంట
తయారైన చిలగడదుంప హల్వాను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పైన కొద్దిగా బాదం, జీడిపప్పు ముక్కలతో అలంకరించాలి. వేడివేడిగా సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం టీతో పాటు లేదా భోజనం తర్వాత డెజర్ట్‌గా తీసుకోవచ్చు. ఈ చలికాలంలో ఇంటిల్లిపాదీ ఇష్టపడే తీపి వంటకంగా ఇది నిలుస్తుంది.