Big TV Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ప్రతివారం సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొంటూ వారికి సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ నటుడు మురళీమోహన్(Murali Mohan) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈయన ఎన్నో విషయాలను అభిమానులకు తెలియజేశారు. ఇక మురళీమోహన్ ఇండస్ట్రీలో నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగారు. అదే విధంగా ఒక వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే యాంకర్ వర్ష మురళీమోహన్ గారిని ప్రశ్నిస్తూ.. మీకు సినిమాలంటే ఇష్టమా రాజకీయాలు అంటే ఇష్టమా లేదా బిజినెస్ అంటే ఇష్టమా అనే ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు మురళీమోహన్ సమాధానం చెబుతూ.. చిన్నప్పటినుంచి కూడా బిజినెస్(Business) చేయడమే ఇష్టం అని తెలిపారు. తన ఇంట్లో తన నాన్న చిన్నాన్న అందరూ కూడా బిజినెస్ చేసేవారు. అందుకే తాను కూడా బిజినెస్ లోనే కొనసాగాలని మొదటి నుంచి అనుకునేవాడిని. సినిమాలంటే తనకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదని మురళీమోహన్ తెలిపారు. ఇలా బిజినెస్ లోనే స్థిరపడాలని తాను కోరుకోవడంతో చదువు కూడా పెద్దగా చదువుకోలేదని తెలియజేశారు.
తాను ఇంటర్ ఫెయిల్ కావడంతో తను చదువు ఆగిపోయింది అయితే అప్పుడే బిజినెస్ లోకి వెళ్దాం అనుకుంటే నాన్న దగ్గర ఒక రూపాయి కూడా డబ్బులు లేకుండా పోయాయని తెలిపారు. అప్పటికే ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేయడం వారికి పెళ్లి ఖర్చులు కట్న కానుకలు ఇవ్వడంతో చేతిలో రూపాయి కూడా లేదని తెలిపారు. బిజినెస్ చేయాలంటే డబ్బు లేదు ఉద్యోగం చేయాలంటే డిగ్రీ లేదు ఆ సమయంలో ఏం చేయాలని ఆలోచిస్తున్నా తరుణంలో తన చిన్నాన్న తన బిజినెస్ లో తనకు 15% వాటా ఇస్తూ ఒక అవకాశం ఇచ్చారని మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు.
చిన్నప్పటినుంచి బిజినెస్ అంటే ఎంతో ఆసక్తి ఉన్న తనకు బిజినెస్ లో కొనసాగుతూనే మరోవైపు సినిమాలలోకి కూడా అడుగు పెట్టారు. ఇక సినిమాలలో కూడా సక్సెస్ కావడంతో నిర్మాతగా కూడా స్థిరపడ్డారు. అదేవిధంగా రాజకీయాలలో కూడా ఈయన కొనసాగుతూ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా కూడా విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇలా సినిమాలు రాజకీయాలు బిజినెస్ అంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటికీ కూడా ఈయన పలు సినిమాలకు నిర్మాతగాను అలాగే కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ బిజీగా కొనసాగుతున్నారు. మరోవైపు తన వ్యాపార కార్యకలాపాలను కూడా నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.
Also Read: మురళీమోహన్ కు సినిమాలంటే ఇష్టం లేదా.. చిన్నప్పటినుంచి అదే కోరిక ఉండేదా?