E-Paper
Advertisement

మురళీ మోహన్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా?

మురళీ మోహన్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా?
Advertisement

Big Tv Kissik Talks: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటుడు మురళీమోహన్(Murali Mohan) ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇలా హీరోగా కొనసాగుతూనే మురళీమోహన్ మరోవైపు రియల్ ఎస్టేట్ బిజినెస్లను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే నిర్మాతగా కూడా కొనసాగుతూ భారీ స్థాయిలోనే ఆస్తులు సంపాదించారు.ఇలా నటుడిగా, నిర్మాతగా, బిజినెస్ మెన్ గా గుర్తింపు పొందిన మురళీమోహన్ తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన మొదటి జీతం(First Remuneration) గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

చదువు పెద్దగా ఎక్కేది కాదు..

మురళీ మోహన్ కుటుంబం మొదటి నుంచి కూడా వ్యాపార రంగంలో కొనసాగుతున్నట్లు ఈయన తెలియచేశారు. తన నాన్న, చిన్నాన్న కూడా వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండేవారని తద్వారా తనకు కూడా వ్యాపార రంగం వైపు కాస్త ఆసక్తి ఉండేదని మురళీమోహన్ ఈ సందర్భంగా తెలియజేశారు. చిన్నప్పటి నుంచి కూడా పెద్దాయన తర్వాత తాను కూడా బిజినెస్ చేయాలని భావించే వారని అందుకే చదువు పట్ల పెద్దగా శ్రద్ధ చూపించలేదని అందుకే తాను ఇంటర్ ఫెయిల్ అయ్యానని తెలిపారు. ఇలా ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత బిజినెస్ చూసుకోవాలి అంటే అప్పటికి ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెలిపారు.

నెలకు వంద రూపాయల జీతం..

Advertisement

ఇలా బిజినెస్ చేయటానికి డబ్బు లేదు అలాగే ఉద్యోగం చేద్దామంటే ఇంటర్ ఫెయిల్ కావడంతో చేతిలో డిగ్రీ కూడా లేదని అలాంటి సమయంలో తాను తన చిన్నాన్న వద్ద పనిచేశానని తెలిపారు. బిజినెస్ కి సంబంధించి తనకు ఒక పని కల్పించారు అప్పుడు తాను 23 సంవత్సరాల వయసు కలిగి ఉన్నానని, 1963వ సంవత్సరంలో తాను ఈ ఉద్యోగంలో చేరానని అప్పటికి తన జీతం 100 రూపాయలు అని మురళీమోహన్ తెలిపారు. ఇలా వంద రూపాయల జీతంతో పాటు లాభాలలో 15 పైసలు వాట కూడా ఇస్తామని చెప్పినట్లు మురళీమోహన్ తెలిపారు.

Advertisement

1963 వ సంవత్సరంలోని నెలకు వంద రూపాయల జీతంతో పాటు 15 పైసల వాట అంటే మామూలు సంపాదన కాదనే చెప్పాలి. చిన్నాన్న కల్పించిన బిజినెస్ లో తాను చాలా కష్టపడి మంచిగా పేరు సంపాదించుకున్నానని అయితే తన చిన్నన్న మాత్రం తనకు సంబంధించిన బిజినెస్ షేర్ అమ్మాలని భావిస్తున్నారు దానిని నన్నే కొనుక్కోమని చెప్పారు కానీ నా దగ్గర డబ్బులు లేకపోవడంతో మా ఆవిడ తన పేరున తన పుట్టింటి వాళ్లు పసుపు కుంకుమల కింద ఇచ్చిన పొలం అమ్మి ఆ బిజినెస్ తీసుకున్నానని, అలా బిజినెస్ లో తాను సక్సెస్ అవుతూ వచ్చాను అంటూ ఈ సందర్భంగా మురళి మోహన్ తన బిజినెస్ సక్సెస్ స్టోరీ తెలియజేశారు. బిజినెస్ లోకి అడుగు పెట్టాలి అంటే కచ్చితంగా దానిపట్ల సరైన అవగాహన ఉండాలి లేదంటే పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మురళీమోహన్ తెలిపారు.

Also Read: మురళీమోహన్ కు సినిమాలంటే ఇష్టం లేదా.. చిన్నప్పటినుంచి అదే కోరిక ఉండేదా?

Related News

నిర్మాతగా మల్లి సీరియల్ బ్యూటీ.. కానీ దానికంటే ముందు!

మురళీమోహన్ కు సినిమాలంటే ఇష్టం లేదా.. చిన్నప్పటినుంచి అదే కోరిక ఉండేదా?

ఎన్టీఆర్ గారితో సినిమా.. మురళీ మోహన్ కు అలాంటి కండిషన్స్ పెట్టారా?

సమంతకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన కంటెస్టెంట్.. క్రేజీ రియాక్షన్ వైరల్!

సుధీర్ కి వర్షిణి స్ట్రాంగ్ కౌంటర్.. అండగా త్రిగుణ్!

దీపావళి స్పెషల్.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఊహించని సర్ప్రైజ్!

ఫస్ట్ టైమ్ నాగ్ చేత తిట్లు తిన్న నరేష్.. కన్నీళ్ల వెనుక అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×