Attapur Incident: హైదరాబాద్‌లో పండుగ పూట ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. దీంతో కుటుంబం మోత్తం వీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి..
హైదరాబాద్‌లోని అత్తాపూర్ వద్ద మెట్రో పిల్లర్ నంబర్ 140 సమీపంలోని ఓ వైన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణలో నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. వైన్స్ షాపులో మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన నాగరాజుకు వైన్స్ సిబ్బందితో చిల్లర డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగినట్లు అక్కడి అధికారుల సమాచారం.
అయితే ఈ క్రమంలోనే సిబ్బంది నాగరాజుపై దాడి చేయడంతో నాగరాజు గుండె భాగంలో తీవ్ర గాయమై కుప్పకూలినట్లు అక్కడి స్థానికులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. వాగ్వాదనంతరం వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also read: దీపావళికి పర్ఫెక్ట్ ఫోటోలు తీయాలా? ఫోన్‌లో ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే సరి