E-Paper
Advertisement

ఎన్టీఆర్ గారితో సినిమా.. మురళీ మోహన్ కు అలాంటి కండిషన్స్ పెట్టారా?

ఎన్టీఆర్ గారితో సినిమా.. మురళీ మోహన్ కు అలాంటి కండిషన్స్ పెట్టారా?
Advertisement

Big Tv Kissik Talks: మురళీమోహన్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటుడిగా, విలన్ పాత్రలలో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా కొనసాగిన మురళీమోహన్(Murali Mohan) ఇప్పటికీ కూడా వెండితెరపై పలు సినిమాల ద్వారా సందడి చేస్తున్నారు. ఇక మురళీమోహన్ కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. అన్నగారు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka ramarao) రాజకీయాలలో వచ్చిన సమయంలో తనకు రాజకీయాలు అంటే కూడా ఇష్టం లేకపోయినప్పటికీ ఎన్టీఆర్ గారి కోసం రాజకీయాలలోకి వచ్చానని మురళీమోహన్ తెలిపారు.

ఏఎన్ఆర్ గారంటేనే ఇష్టం..

ఇక ఎన్టీఆర్ తో సినిమాలలో నటించి రాజకీయాలలో కూడా ఆయన వెంట నడిచిన మురళీమోహన్ తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ గారితో తనకున్న అనుబంధం గురించి తెలిపారు. తనకు ఎన్టీఆర్ గారితో పెద్దగా పరిచయం లేదు వ్యక్తిగతంగా నాకు ఏఎన్ఆర్ గారు, ఆయన సినిమాలంటేనే చాలా ఇష్టం అని తెలిపారు. ఇక తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత  ఎన్టీఆర్ తో కలిసి అన్నదమ్ముల అనుబంధం (Annadammula Anubhandam)సినిమాలో మొదటిసారి నటించాను. ఎన్టీఆర్ ని కూడా చూడటం అదే మొదటిసారి అని తెలిపారు.

ఎన్టీఆర్ ఒప్పుకుంటేనే అవకాశం..

Advertisement

ప్రముఖ సినీ నటుడు ఎంజీఆర్ గారికి మేకప్ ఆర్టిస్ట్ ఎం పీతాంబరం అన్నదమ్ముల అనుబంధం సినిమా కోసం నన్ను సంప్రదించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ గారు పెద్దన్నయ్యగా చిన్న తమ్ముడి పాత్రలో బాలకృష్ణ గారిని సెట్ చేశారు. మధ్యలో తమ్ముడి కోసం మేకర్స్ నన్ను సంప్రదించారు. అయితే మేకర్స్ నన్ను కలిసిన సమయంలో నాకు కొన్ని కండిషన్లు పెట్టారని మురళీమోహన్ తెలిపారు. ఈ సినిమా ముగ్గురు అన్నదమ్ముల నేపథ్యంలో కొనసాగుతుంది మొదటి వ్యక్తిగా ఎన్టీఆర్ గారు చిన్న వ్యక్తిగా బాలకృష్ణ గారు మధ్యలో వ్యక్తిగా మిమ్మల్ని తీసుకోవాలి అనుకుంటున్నాము అయితే ఎన్టీఆర్ గారు మిమ్మల్ని చూసిన తరువాత ఆయన ఓకే చేసినప్పుడే మీకు అవకాశం ఇస్తామని షరతులు పెట్టారని మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు.

Advertisement

ఇక తాను అప్పటివరకు కూడా ఎన్టీఆర్ గారిని చూడలేదు అలా చెప్పేసరికి తాను కూడా ఓకే అన్నాను. అయితే ఎన్టీఆర్ గారిని కలవడానికి వెళ్ళిన రోజు ఆయన నా వంక కూడా చూడలేదు రండి బ్రదర్ మురళీమోహన్ గారు.. నీ గురించి విన్నాను అంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అలా ఆయన నన్ను పేరు పెట్టి పిలవడంతో నాకు తెలియకుండానే నేను కూడా వెళ్లి వెంటనే ఆయన కాళ్లకు నమస్కారం చేశానని మురళీమోహన్ తెలిపారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగుంటుంది మీకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఎన్టీఆర్ గారు నాకు చెప్పారు. అలా ఈ సినిమా చేసాము సూపర్ హిట్ అయిందని మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు మాకొక స్వర్గం లాగా ఉండేదని, ఆయన నుంచి ఎంతో క్రమశిక్షణ నేర్చుకున్నామని, చిన్న వారిని కూడా చాలా గౌరవంగా మాట్లాడుతారని మురళీమోహన్ అప్పటి విషయాలను ఎన్టీఆర్ గారితో తనకున్న అనుబంధం గురించి కూడా తెలియజేశారు.

Also Read: బిగ్ బాస్ 10 తొమ్మిదో వారం నో ఎలిమినేషన్.. సేఫ్ జోన్ లో టాప్ కంటెస్టెంట్

Related News

నిర్మాతగా మల్లి సీరియల్ బ్యూటీ.. కానీ దానికంటే ముందు!

మురళీమోహన్ కు సినిమాలంటే ఇష్టం లేదా.. చిన్నప్పటినుంచి అదే కోరిక ఉండేదా?

సమంతకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన కంటెస్టెంట్.. క్రేజీ రియాక్షన్ వైరల్!

సుధీర్ కి వర్షిణి స్ట్రాంగ్ కౌంటర్.. అండగా త్రిగుణ్!

దీపావళి స్పెషల్.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఊహించని సర్ప్రైజ్!

ఫస్ట్ టైమ్ నాగ్ చేత తిట్లు తిన్న నరేష్.. కన్నీళ్ల వెనుక అసలేం జరిగిందంటే?

Karthika Deepam 2 Serial Today Episode November 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో వాళ్లతో చాలెంజ్ చేసిన జ్యోత్స్న 

Big Stories

Advertisement
×