E-Paper
Advertisement

నిర్మాతగా మల్లి సీరియల్ బ్యూటీ.. కానీ దానికంటే ముందు!

నిర్మాతగా మల్లి సీరియల్ బ్యూటీ.. కానీ దానికంటే ముందు!
Advertisement

Bhavana Lasya:ఈమధ్యకాలంలో అటు సినిమాలలో ఇటు సీరియల్స్ లో నటించి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సెలబ్రిటీలు.. ఆ తర్వాత నటనకి స్వస్తి పలుకుతూ నిర్మాతలుగా, దర్శకులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే మల్లి సీరియల్ తో మంచి ఆదరణ సొంతం చేసుకున్న బ్యూటీ.. ఇప్పుడు నిర్మాతగా అవతరిస్తానంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

హీరోయిన్ గా నటించి, నిర్మాత అవుతా..

మల్లి, లక్ష్మీ నివాసం వంటి సీరియల్స్ తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగు అమ్మాయి భావన లాస్య (Bhavana Lasya) . తెలివితోపాటు తమిళ్లో కూడా పలు సీరియల్స్ చేసిన ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన భవిష్యత్తు ప్లాన్స్ గురించి ఆసక్తికర కామెంట్లు చేసింది. భావన లాస్య మాట్లాడుతూ..” ముందు నేను సినిమా హీరోయిన్ అవ్వాలి. ఆ తర్వాత నిర్మాత అవ్వాలి. ఒక సినిమా తీయాలి. ఆఖరి క్షణం వరకు ఇదే పరిశ్రమలో ఉండాలి.. నాకు కెమెరా ముందు ఉండడం, డాన్స్ చేయడం, నటించడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే మరీ మరీ ఇష్టం. ఆయనతో ఒక్కసారి అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మధ్యలో కొన్ని సినిమా ఛాన్సులు వచ్చాయి. కానీ ఆ సమయంలో కుదరక వదిలేసాను.

ఆ సినిమాలో నేను హీరోయిన్..

Advertisement

కమిటీ కుర్రాళ్ళు సినిమాకి మొదట నన్ను పిలిచారు. ఆడిషన్స్ కూడా తీసుకున్నారు. సెలెక్ట్ అయ్యాను .. అయితే టీవీ సీరియల్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. మూడు నెలలు డేట్స్ అడగడం వల్లే కుదరక క్యాన్సిల్ చేసుకున్నాను. ముఖ్యంగా సినిమాల్లో నటించమని చాలామంది అడుగుతున్నారు. కానీ అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అందుకే చేయలేకపోయాను. కానీ త్వరలో ఎలాగైనా హీరోయిన్గా నటిస్తాను. హీరోయిన్ అయితే డబ్బులు సంపాదించి, ఖచ్చితంగా నిర్మాతగా సినిమా చేస్తాను అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. మరి భావన లాస్యకు హీరోయిన్ ఛాన్స్ వస్తుందా? అందులో సక్సెస్ అయ్యి వచ్చిన డబ్బులతో నిర్మాతగా మారి సినిమా తీస్తుందా ? అనేది చూద్దాం..

also read:సైలెంట్ గా పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ హీరోయిన్ ..!

గ్లామర్ తో ఆకట్టుకుంటున్న తెలుగమ్మాయి..

Advertisement

భావన లాస్య విషయానికి వస్తే.. పేరుకే తెలుగమ్మాయి అయినా.. తన అందం, అభినయంతో, నటనతో గ్లామర్ వలకబోస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఈమె ఖచ్చితంగా సినిమాలలో హీరోయిన్ ఛాన్స్ అందుకుంటుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ గా అవకాశం వచ్చి , మంచి సక్సెస్ అవ్వాలని అభిమానులతో పాటు సీరియల్ లవర్స్ కూడా కోరుకుంటున్నారు.

Related News

మురళీమోహన్ కు సినిమాలంటే ఇష్టం లేదా.. చిన్నప్పటినుంచి అదే కోరిక ఉండేదా?

ఎన్టీఆర్ గారితో సినిమా.. మురళీ మోహన్ కు అలాంటి కండిషన్స్ పెట్టారా?

సమంతకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన కంటెస్టెంట్.. క్రేజీ రియాక్షన్ వైరల్!

సుధీర్ కి వర్షిణి స్ట్రాంగ్ కౌంటర్.. అండగా త్రిగుణ్!

దీపావళి స్పెషల్.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఊహించని సర్ప్రైజ్!

ఫస్ట్ టైమ్ నాగ్ చేత తిట్లు తిన్న నరేష్.. కన్నీళ్ల వెనుక అసలేం జరిగిందంటే?

Karthika Deepam 2 Serial Today Episode November 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో వాళ్లతో చాలెంజ్ చేసిన జ్యోత్స్న 

Big Stories

Advertisement
×