E-Paper
Advertisement

నీతి నిజాయితీగా ఉంటేనే రాజకీయాలలోకి వెళ్ళండి: మురళీమోహన్

నీతి నిజాయితీగా ఉంటేనే రాజకీయాలలోకి వెళ్ళండి: మురళీమోహన్
Advertisement

Big Tv Kissik Talks: మురళీమోహన్ నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఒకానొక సమయంలో రాజకీయాల (Politics)లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇలా రాజకీయాలలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మురళి మోహన్ (Murali Mohan)తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

డబ్బు సంపాదించడానికి రాజకీయాలు కాదు..

ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎంతోమంది యువత రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రాజకీయాలలోకి రావాలనుకున్న యువతకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు మురళీమోహన్ సమాధానం చెబుతూ.. నువ్వు రాజకీయాలలోకి వస్తున్నావు అంటే ముందుగా ఎందుకు రాజకీయాలలోకి వస్తున్నావు అనేది ప్రశ్నించుకోవాలని ఈయన తెలిపారు. రాజకీయాలలోకి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాం కదా తిరిగి ఆ డబ్బులు సంపాదించుకుందాము అనే ఉద్దేశంతో వెళ్లకూడదని తెలిపారు.రాజకీయాలలోకి వెళ్లాలనుకున్నవారు నీతిగా నిజాయితీగా ఉండాలని తెలిపారు.

ఇచ్చిన మాట తప్పకూడదు..

Advertisement

ఎవరైనా సరే రాజకీయాలలో ఉన్నవారు గ్రామస్తులు అర్ధరాత్రి సమయంలో వచ్చి నీ ఇంటి తలుపు కొట్టిన తలుపు తీసి వారి సమస్య ఏంటో తెలుసుకొని వారికి సర్ది చెప్పి పంపించే విధంగా ఉండాలి. సమస్య లేకుంటే వాళ్లు మీ ఇంటికి రారు కదా.. ఇలా రాజకీయాలలోకి వచ్చిన వారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మాట తప్పకూడదని తెలిపారు. పేరు కావాలి డబ్బు కావాలి అని అనుకుంటే మాత్రం రాజకీయాలలోకి వెళ్ళకూడదని ఈయన తెలిపారు. మనం రాజకీయాలలోకి వెళ్తున్నప్పుడు మన ఊరి అభివృద్ధి కోసం మన నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నామా అనే విషయాలను ఆలోచించుకొని వెళ్లాలని వెళ్లిన తర్వాత ఏ ఉద్దేశంతో అయితే మనం రాజకీయాలలోకి వచ్చామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలని తెలిపారు.

Advertisement

రాజకీయాలలోకి వచ్చే వారందరూ డబ్బు సంపాదించడం కోసమే అయితే రాజకీయాలలోకి రావాల్సిన పని లేదంటూ ఈయన ఈ సందర్భంగా రాజకీయాలలోకి వెళ్లే యువతను ఉద్దేశిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మురళీమోహన్ కూడా నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత తెలుగుదేశం పార్టీ తరపున 2014లో రాజమండ్రి నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే 2019 సంవత్సరంలో మురళీమోహన్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంపీగా ఈయన తన పదవీకాలంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని చెప్పాలి.

Also Read: మురళీ మోహన్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా?

Related News

మురళీ మోహన్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా?

నిర్మాతగా మల్లి సీరియల్ బ్యూటీ.. కానీ దానికంటే ముందు!

మురళీమోహన్ కు సినిమాలంటే ఇష్టం లేదా.. చిన్నప్పటినుంచి అదే కోరిక ఉండేదా?

ఎన్టీఆర్ గారితో సినిమా.. మురళీ మోహన్ కు అలాంటి కండిషన్స్ పెట్టారా?

సమంతకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన కంటెస్టెంట్.. క్రేజీ రియాక్షన్ వైరల్!

సుధీర్ కి వర్షిణి స్ట్రాంగ్ కౌంటర్.. అండగా త్రిగుణ్!

దీపావళి స్పెషల్.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Big Stories

Advertisement
×