Big Tv Kissik Talks: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం ఇండస్ట్రీలో డైరెక్టర్స్ గా హీరోలుగా కొనసాగుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొంది డైరెక్టర్ గా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్న వారిలో బాబు ఒకరు. జబర్దస్త్ బాబు(Jabardasth Babu)గా ఎంతో ఫేమస్ అయిన ఈయన ఇటీవల దర్శకుడిగా మారి లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Least Eligible Bachelor) అనే సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఈటీవీ విన్ లో అందుబాటులో ఉంది. ఇలా ఈ సిరీస్ ద్వారా మంచి సక్సెస్ అందుకున్న జబర్దస్త్ బాబు తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్ గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక ఈ సిరీస్ మంచి సక్సెస్ కావడంతో ఈయన నటుడు వైవా హర్షా (Viva Harsha)నుంచి ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ (రాయల్ Enfield Bike)కానుకగా అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ అంశం గురించి ప్రస్తావనకు రావడంతో యాంకర్ వర్షా మాట్లాడుతూ ఒక సిరీస్ హిట్ అవడంతో బైక్ గిఫ్ట్ గా అడగడం ఏంటి అంటూ ప్రశ్న వేయగా ఈ ప్రశ్నకు బాబు అదిరిపోయే సమాధానం ఇచ్చారు.
నిజానికి తాను ఈ సిరీస్ మంచి సక్సెస్ కావడంతో బిఎండబ్ల్యూ కారు గిఫ్ట్ గా అడుగుదాం అనుకున్నాను కానీ అడగలేదు. ఈసారి కచ్చితంగా అదే గిఫ్ట్ అడుగుతా అంటూ సరదాగా మాట్లాడారు. ఒక్క సిరీస్ సక్సెస్ కావడంతో ఈయన రేంజ్ మారిపోయింది అంటూ వర్ష ఫన్నీగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా బాబు ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈయనతో పాటు ఈ కార్యక్రమంలో మరో జబర్దస్త్ కమెడియన్ శ్రీవిద్య కూడా సందడి చేశారు.
లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్ విషయానికి వస్తే ఈ సిరీస్ లో జీవన్ కుమార్, హైపర్ ఆది, ఐశ్వర్య హోళక్కల్ తదితరులు నటించారు.కామెడీ మరియు ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, బ్యాచిలర్స్ జీవితాల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఇలా ఈ సిరీస్ ఈటీవీ విన్ లో ప్రసారమవుతూ అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకోవడంతో నటుడు వైవాహర్ష జబర్దస్త్ బాబుకి బైక్ గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే కార్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్పడంతో తనకు డ్రైవింగ్ రాదు కానీ బైక్ గిఫ్ట్ గా ఇవ్వండని స్వయంగా బాబు అడిగిమరీ బైక్ తీసుకున్నారు. ఇక ఈ సిరీస్ సక్సెస్ కావడంతో బాబు ప్రస్తుతం దర్శకుడిగా మరికొన్ని అవకాశాలను అందుకుంటున్నారని తెలుస్తోంది.
Also Read: రామ్ చరణ్ సినిమాలలో ఉపాసన ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా? ఎందుకంత స్పెషల్ అంటే?