Nagavva Folk Songs:తనదైన గొంతుతో జానపదానికి సరికొత్త ఊపునిచ్చిన నాగవ్వ ఇపుడు మరోపాటతో నెట్టింట్లో సందడి చేస్తుంది.అదే ‘ఎద్దులచ్చే ముద్దువెట్టే’ అనే సరికొత్త ఫోక్ సాంగ్.ఇక ఈ పాటకోసం నాగవ్వ తో పాటు సింగర్ ప్రభ కూడా గొంతు కలపడం ఇక్కడ విశేషం.
ఏకంగా 4 మిలియన్లకి పైగా
పైగా ఇందులో తనదైన ఫోక్ సాంగ్స్ తో ఇపుడు యూట్యూబ్ ని షేక్ చేస్తున్న వైష్ణవీ సోనీ ఈ పాట కోసం కాలు కదపగా,పాట పాడిన నాగవ్వ కూడా ఇందులో వైష్ణవీ సోనీ తో పాటు స్టెప్పులేయడం ఇక్కడ మరో విశేషం.ఇక ఈ పాట వచ్చిన మూడు నెలల్లోనే ఏకంగా 4 మిలియన్లకి పైగా కొల్లగొట్టిందంటే ఇది ఆడియన్స్ ని ముఖ్యంగా ఫోక్ లవర్స్ ని ఎంతలా ఆకట్టుకుందో అర్థం అవుతుంది.
వరుస హిట్స్ తో దూసుకుపోతున్న వెంకట్ అజ్మీరా
ఇక ఈ పాటకి మ్యూజిక్ అందించగా శివ గణేష్ ఈ పాటకి అదిరిపోయే స్టెప్స్ కోరియోగ్రఫీ చేయగా .. ప్రస్తుతం ఫోక్ ఇండస్ట్రీలో తన మ్యూజిక్ తో వరుస హిట్స్ అందించి దూసుకుపోతున్న వెంకట్ అజ్మీరా సాలిడ్ మాసీ బీట్స్ తో పాటని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేశాడు.పైగా అరుణ్ జగతి తన కెమెరాతో బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ కంపోజ్ చేసి పాటని ఒక ఐ ఫీస్ట్ లా తీర్చిదిద్దాడు
ఇక తిరుపతి సాహు అందించిన లిరిక్స్ లోని అచ్చ తెలుగు, అందునా తెలంగాణా పదాలలో మట్టి వాసన వెదజల్లడంతో ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిపోయింది.అందుకే రిపీట్ మోడ్ లోపెట్టుకుని ఈ పాటని తెగ చూసేస్తున్నారు.
ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా
ఇక పాటని మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.ఈ పాట ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉందని ఒకరంటే,ఇప్పటికి ఈ పాటని ఇప్పటికే ఏకంగా 25 సార్లు చూశామంటూ పాటని ఆకాశానికి ఎతేస్తున్నారు.మరీ ముఖ్యంగా ఈ జానపదంలో వాడిన బాష ,వాడిన పదాలు,వాటి అమరిక వింటుంటే పాతకాలం నాటి జానపదాలు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయని పాటని ఒక రేంజ్ లో పొగిడేశారు.
నిజానికి ఈ పాట ఇంతలా పాపులర్ కావడానికి నాగవ్వ గొంతే అని చెప్పాలి.ఎదో జోల పాడుతున్నట్టుగా,ఎంతో పెక్యులర్ గా ఉండే ఈ వాయిస్ కే జనాలు ఫిదా అయిపోతున్నారు. నా తిరుపతి రెడ్డి అనే పాటతో ఫోక్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగవ్వ ఇప్పటికే బాయిలోన బల్లి పలికే, మామిడి కొనాల కాడ ,మోహన లాలీ అనే పాటలతో బాగా ఫేమస్ అయిపొయింది కూడా.
యూ ట్యూబ్ లో మిలియన్ల వ్యూస్
మరో వైపు ప్రభ కూడా ఎన్నో పాటల్ని పాడి మెప్పించింది.ముఖ్యంగా రాను బొంబాయికి,ఓ పిలగ వెంకటేశు, రింగు రింగుల జుట్టుదానా, నిమ్మతోట వనంలో ,నా పేరే ఎల్లమ్మ వంటి ఎన్నో పాటలు యూ ట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టాయి.
మొత్తంగా తాజాగా నాగవ్వ క్రేజీ వాయిస్ కి , ప్రభ జోష్ ఇచ్చే వాయిస్ కలిసి వచ్చిన ‘ఎద్దులచ్చే ముద్దువెట్టే’అనే మరో పాట ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తుంది.చూడాలి మరి ఇప్పటికే 44 లక్షల మందికి పైగా చూసిన ఈ పాట ముందు ముందు ఇంకెన్ని మిలియన్ల వ్యూస్ ని వెనకేస్తుందో !
ALSO READ :రాను బొంబాయి నుంచి నిమ్మతోట వనంలో వరకు.. సింగర్ ప్రభ టాప్ సాంగ్స్ ఇవే !