Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ప్రతివారం సెలబ్రిటీలు పాల్గొంటూ సందడి చేస్తుంటారు. ఈ వారం ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ బాబు(Babu) అలాగే నటి శ్రీవిద్య(Sri Vidya) కూడా హాజరై సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా వీరిద్దరూ తమ ఇండస్ట్రీ జర్నీ గురించి ఇండస్ట్రీలో ఈ స్థాయికి రావడానికి ఎదుర్కొన్న కష్టాలు గురించి ముచ్చటించారు.
ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా జబర్దస్త్ బాబు మాట్లాడుతూ.. తాను మీ షో కి వస్తానని ఎన్నోసార్లు అడిగాను వర్ష కానీ నీకేమంతా పేరు ఉందని మాట్లాడావు అయితే ఇప్పుడు నన్ను పిలిచావంటే నాకు కూడా పేరు వచ్చిందనే కదా అర్థం అంటూ బాబు మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వర్షా మాట్లాడుతూ ఆర్టిస్ట్ గా బాగుందా డైరెక్టర్ అయ్యాక కెరియర్ బాగుందా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బాబు సమాధానం చెబుతూ నేను డైరెక్ట్ గా సక్సెస్ అయ్యాను కాబట్టి డైరెక్టర్ గా బాగుందనిపించింది కానీ తాను డైరెక్టర్ గా సిరీస్ చేస్తున్న సమయంలో ఆర్టిస్ట్ గా ఉండటమే మంచిదనిపించిందని తెలిపారు..
డైరెక్టర్ గా తాను షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రతిక్షణం భయం వేసేది. టేబుల్ మీద ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా కడుపునిండా తినలేని పరిస్థితి నాది.. ప్రొడ్యూసర్లు నన్ను నమ్మి ఇంత డబ్బు పెట్టారని ప్రతిక్షణం భయం వేసేదని బాబు తెలిపారు. ఇలా చాలా భయం భయంగానే తాను ఈ సిరీస్ షూటింగ్ చేశానని తెలిపారు. అయితే చాలామంది షూటింగ్ కోసం కేరళ వెళ్లి ఎంజాయ్ చేసావా అని అడిగారు అసలు మేము కేరళ వెళ్ళిన విషయం కూడా నాకు గుర్తు లేదని, తన ఫోకస్ మొత్తం ఈ సిరీస్ పైనే ఉండేదంటూ ఈ సందర్భంగా బాబు తెలిపారు.
జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతున్న ఈయన డైరెక్టర్ గా మారి లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Least Eligible Bachelor)అనే ఒక సిరీస్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్ జర్నీ గురించి ఈ సందర్భంగా బాబు ముచ్చటించారని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాబు ఇంకా ఎలాంటి విషయాలు గురించి మాట్లాడారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రతి ఆదివారం సాయంత్రం 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారమవతుంది.
Also Read: ‘రియాలిటీ’ లో రఘుకుల తిలకా రారా సాంగ్..కిరణ్ అబ్బవరం క్లారిటీ!